విరూపాక్ష సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ, సాయి చంద్, రాజీవ్ కనకాల, సునీల్, అభినవ్ గౌతమ్, అజయ్ తదితరులు నటించారు. దర్శకత్వం కార్తీక్ వర్మ దండు వహించారు. నిర్మాత బి వి ఎన్ ఎస్ ప్రసాద్ నిర్మించారు. సంగీతం బి అజనీష్ లోకనాథ్ అందించారు.
రిలీజ్
ఈ మూవీ ఏప్రిల్ 21, 2023 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది.
కథ
రుద్రవనం అనే గ్రామంలో చేతబడి చేస్తున్నారనే కారణంతో తాంత్రిక విద్యలు తెలిసిన వైద్యుడు వెంకటాచలం కుటుంబాన్ని గ్రామస్థులు సజీవ దహనానికి పాల్పడుతారు. అయితే సజీవ దహనం సమయంలో పుష్కరకాలం తర్వాత మీ ఊరు సర్వనాశనమవుతుందని వెంకటాచలం భార్య శపిస్తుంది. సరిగ్గా పన్నెండేళ్ల తర్వాత రుద్రవనం గ్రామానికి వచ్చిన సూర్య (సాయిధరమ్ తేజ్) నందిని (సంయుక్తా మీనన్)ను చూసి ప్రేమలో పడిపోతాడు. అయితే అదే సమయంలో ఆ గ్రామంలో నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అమ్మవారి గుడిలో గ్రామస్థుడు రక్తం కక్కుకుని చస్తాడు. అయితే జాతర సమయంలో ఏర్పడిన విఘాతంతో ఊరిని అష్టదిగ్బంధం చేస్తారు. అష్ట దిగ్బంధం సమయంలో సుధ (సోనియా) గ్రామం దాటి వెళ్తుంది. దాని వల్ల నందిని ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. దాంతో నందిని దక్కించుకోవడానికి సూర్య సిద్దమవుతాడు.రుద్రవనం గ్రామానికి సూర్య తన కుటుంబంతో ఎందుకు వచ్చాడు? రుద్రవనంలో సూర్య పిన్ని (యాంకర్ శ్యామల), పాల వ్యాపారి, సుధ ఆకస్మిక మరణాలకు కారణం ఏమిటి? నందినికి ఉన్న మూర్ఛవ్యాధికి కారణం ఏమిటి? అష్ట దిగ్బంధం తర్వాత గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామస్థుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిన సమయంలో సూర్య చేసిన ప్రయత్నాలు ఏమిటి? గ్రామస్థులను ఎలా సూర్య ఎలా రక్షించాడు. తన ప్రేయసి నందిని ప్రాణాలను కాపాడుకొని సూర్య తన ప్రేమను సఫలం చేసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే విరూపాక్ష సినిమా .
ట్రైలర్
రెండు నిమిషాల 5 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్.. థ్రిల్, మిస్టరీ అంశాలతో ఆకట్టుకుంటోంది. రుద్రవనం అనే గ్రామంలో జరిగే కథలా కనిపిస్తుంది. చాలా వివరాలను చెప్పకుండానే ట్రైలర్ ను చాలా ఇంట్రస్టింగ్ గా మలిచారు మేకర్స్. ఆద్యంతం ఉత్కంఠగా సాగింది ట్రైలర్. ఇక హీరో సాయి ధరమ్ తేజ్ గ్రామంలో ఆకస్మికంగా జరిగే మరణాలు వెనక గల కారణాన్ని కనుగొనే అన్వేషణలో ఉన్నట్లు కనిపిస్తోంది. స్థానికుల మరణాలకు కారణాలు ఏంటి? దీని వెనక ఎవరు ఉన్నారు? వాటిని హీరో ఎలా కనుగొన్నారు వంటి విషయాలను తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ట్రైలర్ మొత్తం చాలా ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ట్రైలర్ ను చూస్తుంటే ఈసారి సాయి ధరమ్ తేజ్ హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.