వివాహ భోజనంబు (2021)
Release date
27 Aug 2021
genre
వివాహ భోజనంబు స్టోరి
వివాహ భోజనంబు సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సత్య అక్కల, అర్జావీ రాజ్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టి.ఎన్.ఆర్, ‘వైవా’ హర్ష, శివోన్ నారాయణ, మధుమని, నిత్యా శ్రీ, కిరీటి, దయ, కల్పలత నటించారు.నెల్లూరు ప్రభ అనే ప్రత్యేక పాత్రలో సందీప్ కిషన్ నటించారు. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ బ్యానర్లపై కె.ఎస్. శినీష్, హీరో సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. కిట్టు, కృష్ణ చైతన్య సాహిత్యం అందించిన ఈ చిత్రానికి అనిరుధ్ విజయ్ సంగీతం సమకూర్చారు. మణి కందన్ సినిమాటోగ్రఫీ అందించారు. నందు ఆర్.కె మాటలు రాశారు. భాను భోగవరపు కథ అందించారు. చోటా కె. ప్రసాద్ ఎడిటర్.
కథ
ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేసే పత్తి గింజల మహేష్ (సత్య) పక్కా పిసినారి, ఓ అనాథ. అలాంటి వ్యక్తి సంపన్న కుటుంబానికి చెందిన అనితతో (ఆర్జావీ)తో ప్రేమలో పడుతాడు. తన కూతురు అతి సాధారణమైన వ్యక్తితో ఎలా ప్రేమలో పడిందనే విషయంతో తండ్రి రామకృష్ణ (శ్రీకాంత్ అయ్యంగార్) షాక్ తింటాడు. కానీ కూతురిపై ప్రేమను చంపుకోలేక మహేష్‌తో పెళ్లి చేస్తారు. అయితే అనాథ అనే విషయాన్ని దాచి పెట్టడంతో మహేష్‌పై రామకృష్ణ కోపం పెంచుకొంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో పైసా పోతే ప్రాణం పోతుందనుకొనే మహేష్ ఇంటికి తన భార్య కుటుంబ సభ్యులంతా వస్తారు. ఆ సమయంలోనే కరోనా వల్ల లాక్డౌన్ విధించడంతో కుటుంబ సభ్యుల మహేష్ ఇంటిలో ఉండిపోతారు. లాక్డౌన్లో తన భార్య అనిత కుటుంబంలోని పది మంది తన ఇంట్లో ఉంటే పిసినారి మహేష్ ఏం చేశాడు? మహేష్ ఎందుకు పిసినారిగా మారాడు? రాజారాం (సుబ్బరాయ శర్మ) అనే సంపన్నుడి మనవరాలు అనిత అందగాడు కానీ మహేష్‌ను ఎందుకు ప్రేమించింది? లాక్డౌన్లో మహేష్ పిసినారి తనం అనిత కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు కలిగించింది? అనిత తాత రాజారాం ఆరోగ్యం క్షీణిస్తే మహేష్ తాను దాచుకొన్న డబ్బంతా ఎందుకు కట్టాడు? ఉన్నత కుటుంబాలకు చెందిన రాజారాం, రామకృష్ణ చివరకు మహేష్‌ను ఎలాంటి పరిస్థితుల్లో తమ ఇంటి అల్లుడిగా అంగీకరించారు. ఈ కథలో అంబులెన్స్ డ్రైవర్ నెల్లూరు ప్రభ (సందీప్ కిషన్) పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే వివాహ భోజనంబు సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie వివాహ భోజనంబు with us? Please send it to us ([email protected]).