X
తెలుగు » సినిమాలు » వివాహ భోజనంబు
వివాహ భోజనంబు

వివాహ భోజనంబు

Comedy | 27 Aug 2021 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

వివాహ భోజనంబు స్టోరీ

వివాహ భోజనంబు సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సత్య అక్కల, అర్జావీ రాజ్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టి.ఎన్.ఆర్, ‘వైవా’ హర్ష, శివోన్ నారాయణ, మధుమని, నిత్యా శ్రీ, కిరీటి, దయ, కల్పలత నటించారు.నెల్లూరు ప్రభ అనే ప్రత్యేక పాత్రలో సందీప్ కిషన్ నటించారు. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ బ్యానర్లపై కె.ఎస్. శినీష్, హీరో సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. కిట్టు, కృష్ణ చైతన్య సాహిత్యం అందించిన ఈ చిత్రానికి అనిరుధ్ విజయ్ సంగీతం సమకూర్చారు. మణి కందన్ సినిమాటోగ్రఫీ అందించారు. నందు ఆర్.కె మాటలు రాశారు. భాను భోగవరపు కథ అందించారు. చోటా కె. ప్రసాద్ ఎడిటర్. కథ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేసే పత్తి గింజల మహేష్ (సత్య) పక్కా పిసినారి, ఓ అనాథ. అలాంటి వ్యక్తి సంపన్న కుటుంబానికి చెందిన అనితతో (ఆర్జావీ)తో ప్రేమలో పడుతాడు. తన కూతురు అతి సాధారణమైన వ్యక్తితో ఎలా ప్రేమలో పడిందనే విషయంతో తండ్రి రామకృష్ణ (శ్రీకాంత్ అయ్యంగార్) షాక్ తింటాడు. కానీ కూతురిపై ప్రేమను చంపుకోలేక మహేష్‌తో పెళ్లి చేస్తారు. అయితే అనాథ అనే విషయాన్ని దాచి పెట్టడంతో మహేష్‌పై రామకృష్ణ కోపం పెంచుకొంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో పైసా పోతే ప్రాణం పోతుందనుకొనే మహేష్ ఇంటికి తన భార్య కుటుంబ సభ్యులంతా వస్తారు. ఆ సమయంలోనే కరోనా వల్ల లాక్‌డౌన్ విధించడంతో కుటుంబ సభ్యుల మహేష్ ఇంటిలో ఉండిపోతారు. లాక్‌డౌన్‌లో తన భార్య అనిత కుటుంబంలోని పది మంది తన ఇంట్లో ఉంటే పిసినారి మహేష్ ఏం చేశాడు? మహేష్ ఎందుకు పిసినారిగా మారాడు? రాజారాం (సుబ్బరాయ శర్మ) అనే సంపన్నుడి మనవరాలు అనిత అందగాడు కానీ మహేష్‌ను ఎందుకు ప్రేమించింది? లాక్‌డౌన్‌లో మహేష్ పిసినారి తనం అనిత కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు కలిగించింది? అనిత తాత రాజారాం ఆరోగ్యం క్షీణిస్తే మహేష్ తాను దాచుకొన్న డబ్బంతా ఎందుకు కట్టాడు? ఉన్నత కుటుంబాలకు చెందిన రాజారాం, రామకృష్ణ చివరకు మహేష్‌ను ఎలాంటి పరిస్థితుల్లో తమ ఇంటి అల్లుడిగా అంగీకరించారు. ఈ కథలో అంబులెన్స్ డ్రైవర్ నెల్లూరు ప్రభ (సందీప్ కిషన్) పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే వివాహ భోజనంబు సినిమా కథ.
Read More

వివాహ భోజనంబు కాస్ట్ & క్రూ

వివాహ భోజనంబు సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ అబ్బరాజు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనిరుధ్ విజయ్
నిర్మాత కె ఎస్ శినీష్, సందీప్ కిషన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వివాహ భోజనంబు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
వివాహ భోజనంబు సినిమా వినోదం, ఎమోషన్స్, నటీనటులు ఫెర్ఫార్మెన్స్ మేలవించిన చిత్రంగా చెప్పుకొవచ్చు. పాత్రలకు తగినట్టుగా పేరున్న నటీనటులను ఎంచుకొని ఉంటే ఈ సినిమా రేంజ్ మరో విధంగా ఉండేదనిపిస్తుంది. సినిమాను సత్య, శ్రీకాంత్ అయ్యంగార్‌తోపాటు సందీప్ కిషన్ ఫెర్ఫార్మెన్స్ నిలబెట్టింది. కథ, సన్నివేశాల పరంగా ఇంకొంత జాగ్రత్త పడి ఉంటే తప్పకుండా సూపర్ హిట్ చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకొనేది. కలెక్షన్ల గొడవ లేదు కనుక.. ఈ చిత్రాన్ని ఓటీటీలో కుటుంబ సభ్యులంతా కలిసి ఎంజాయ్ చేసే క్లీన్ అండ్ గ్రీన్ చిత్రం. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ప్రేక్షకులకు ఓ ఆక్సిజన్ అందించే సింపుల్ అండ్ సూపర్ చిత్రం అని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూస్తే మంచి అనుభూతి తప్పకుండా కలుగుతుంది.

వివాహ భోజనంబు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వివాహ భోజనంబు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+