యయునికి మొగుడు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నరేష్, రిచా పనయ్, సాయాజీ షిండే, రమ్యకృష్ణ, చంద్రమోహన్, నరేష్, చలపతిరావు, కృష్ణభగవాన్, భరత్, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఇ సత్తిబాబు నిర్వహించారు మరియు నిర్మాత చంటి అడ్డాల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చారు
కథ
బ్రహ్మ తప్పిదం వల్ల పుట్టిన నరేష్ (నరేష్) కి నుదిట రాత అనేది ఉండదు. దాంతో అతను దైవుళ్ళతో సమానంగా ఏది కోరుకుంటే అది జరుగే శక్తి పుట్టకతోనే వస్తుంది. కానీ ఆ విషయం అతనికి తెలియదు. ఈలోగా నారదుడు మాయ వల్ల యముడి (సాయాజీ షిండే) కూతురు యమజ (రిచా పనయ్) భూమి మీదకు వచ్చి... నరేష్ చేత మెళ్లో పూల దండ వేయించుకుంటుంది. దాంతో పూల దండ వేసిన వాడే తన భర్త అని ఫీలవుతూ అతని వెనక పడుతూంటుంది. నారద మాయ తెలియని నరేష్ ఆమెను వెళ్లగొట్టాలనుకుని ఆ ప్రాసెస్ లో ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే తన కూతురు ఓ మానవుడుతో జీవితం పంచుకుంటోందని తెలిసిన యముడు... భూమి మీదకు వచ్చి ఆమెను తనతో తమ లోకానికి తీసుకు వెళ్లతాడు. అప్పుడు నరేష్ ఏం చేసాడు. యమలోకం వెళ్లి తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ.