యాత్ర 2 సినిమా పొలిటికల్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మమ్మూట్టి, జీవ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మహి వి రాఘవ్ వహించారు. నిర్మాత శివ మేక నిర్మించారు. సంగీతం సంతోష్ నారాయణన్ అందించారు.
స్టోరీ లైన్
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందిన యాత్ర మూవీ మంచి విజయాన్ని సాధించింది. దానికి కొనసాగింపుగా ‘యాత్ర 2’ రూపొందనుంది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయినది మొదలు వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కే వరకు ఎదుర్కొన పరిస్థితులను, ముఖ్యంగా వై.ఎస్.జగన్ చేసిన పాదయాత్రను హైలెట్ చేస్తూ యాత్ర 2 సినిమాను తెరకెక్కించబోతున్నారు.