ఎన్టీఆర్ మనిషి కాదు.. వాళ్ల సెంటిమెంట్ కూడా పని చేయదు: ప్రముఖ నటుడు
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే అన్ని రంగాల్లోనూ రాణిస్తూ స్టార్ హీరో అనే పేరుకు సరైన అర్థం చెప్తున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఈ మధ్య కాలంలో ఎవరూ ఊహించని రీతిలో ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్న అతడు.. వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. దీంతో అతడి రేంజ్ అమాంతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ యాక్టింగ్, డ్యాన్స్ గురించి ప్రముఖ నటుడు అజయ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీకోసమే!
ఏకధాటిగా హిట్లు కొడుతూ
టాలీవుడ్‌లోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. 'టెంపర్' మూవీ నుంచి మొదలుకొని 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత వీరరాఘవ', 'RRR' వంటి హిట్లను అందుకున్నాడు. అలాగే, పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగిపోయాడు.
బిగ్ బాస్‌లోకి శ్రీరెడ్డి లాంటి హీరోయిన్.. 100 రోజులు శృంగారం లేకుండా అంటూ!

దేవరగా మారిన ఎన్టీఆర్
కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ఈ ఉత్సాహంతోనే ప్రస్తుతం అతడు 'దేవర' అనే చిత్రంలో నటిస్తున్నాడు. రెండు పార్టులుగా రూపొందుతోన్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతుంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తీసుకు రాబోతున్నారు.
ఆ భారీ సినిమాల్లో తారక్
'దేవర' మూవీ షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పటికే బాలీవుడ్‌లో 'వార్ 2' అనే చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. వీటితో పాటు అతడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు. దీన్ని ఆగస్టులో మొదలు పెడుతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ తారక్ నటించనున్నాడు.
షర్ట్ మొత్తం విప్పేసిన డీజే టిల్లు లవర్.. ఇలాంటి షో ఎప్పుడైనా చూశారా?

ఇండియాలో టాప్ హీరో
జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి టాలెంట్ గురించి సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు కూడా కొనియాడుతుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ నటుడు అజయ్ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. అంతేకాదు, ఇప్పుడున్న టాలీవుడ్ హీరోల్లో ఎన్టీఆర్ ఇండియాలోనే నెంబర్ వన్ అంటూ కామెంట్స్ చేశాడు.
బెస్ట్ డ్యాన్సర్ అంటూ
ఆ తర్వాత అజయ్ కంటిన్యూ చేస్తూ.. 'ఎన్టీఆర్ అంటే కాంబో ఆఫ్ యాక్టింగ్. డ్యాన్స్‌లో కూడా అతడు టాప్. నాకు తెలిసి వరల్డ్‌లోనే అతడు బెస్ట్ డ్యాన్సర్. ఇప్పుడు ఏదైనా ఒక సాంగ్ చేసేటప్పుడు 62 కౌంట్లు ఉంటే అలా చూసి ఇలా చేసేస్తాడు. నేను ఇది నా కళ్లతో చూసి చెబుతున్నాను. యాక్టింగ్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు' అంటూ చెప్పుకొచ్చాడు.
Samyuktha Menon: తొలిసారి ఘాటుగా హాట్ షో చేసిన సంయుక్త.. ఈ ఫొటోలు చూశారంటే!

ఎన్టీఆర్ మనిషి కాదు
అజయ్ కొనసాగిస్తూ.. 'డైలాగ్స్‌లో అయితే ఎన్టీఆర్ మనిషి కాదు రోబో. ఇలా చూసి అలా మొత్తం చెప్పేస్తాడు. వాస్తవానికి రాజమౌళి గారి సినిమా తర్వాత ఫ్లాపుల సెంటిమెంట్ ఉందని అంటారు. కానీ, దాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ చెరిపేస్తారు. కొరటాల శివ గారు కూడా ఎంతో కసిగా దేవర సినిమాను చేస్తున్నారు. ఆయన డైరెక్షన్ ఇందులో చూస్తారు' అంటూ వివరించాడు.


Click it and Unblock the Notifications











