»   »  హీరో ప్రభాస్.... ‘బాహుబలి’ కాంట్రాక్టును ఉల్లంఘించ బోతున్నాడా?

హీరో ప్రభాస్.... ‘బాహుబలి’ కాంట్రాక్టును ఉల్లంఘించ బోతున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమా మొదలైన తర్వాత ప్రభాస్ ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాడో అందరికీ తెలిసిందే. ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ఇతర సినిమాలకు కమిట్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పాటు బాహుబలి మూవీ కాంట్రాక్ట్ ప్రకారం షూటింగ్ సమయంలో పబ్లిక్ ఫంక్షన్లకు హాజరు కాకూడదు. ముఖ్యంగా మీడియా ఫోకస్ అయ్యే వేడుకలకు అస్సలు వెళ్లకూడదు.

అయితే ఈసారి ప్రభాస్ ఈ కాంట్రాక్టు రూల్స్ ను బ్రేక్ చేయబోతున్నాడట. రామ్ గోపాల్ వర్మ కోసం పబ్లిక్ ఈవెంటుకు హాజరు కాబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన 'శివ టు వంగవీటి' వేడుకకు ప్రభాస్ హాజరవుతున్నాడు. రాజమౌళి అంగీకారంతోనే ప్రభాస్ ఈ ఫంక్షన్ కు హాజరవుతున్నాడు. ప్రభాస్, రాజమౌళి కలిసే ఈ వేడుకకు హాజరుకాబోతున్నారని టాక్.

రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మాత‌గా రూపొందిన 'వంగవీటి' సినిమాను డిసెంబ‌ర్ 23న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా డిసెంబ‌ర్ 20న హైద‌రాబాద్ జె.ఆర్‌.సి.క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో నిర్మాత దాసరి కిర‌ణ్‌కుమార్ 'శివ టు వంగవీటి' పేరుతో భారీ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్నారు.

 ప్రభాస్, రాజమౌళి

ప్రభాస్, రాజమౌళి

ఈ వేడుక‌కు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, కింగ్ నాగార్జున ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతున్నారు. ఓ బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ తెలుగు వేడుకకు ఇలా విచ్చేయ‌డం ఇదే ప్ర‌థ‌మం. తెలుగు సినీ పరిశ్రమ నుండి పలువురు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు, ప్రముఖ నటులు ఈ వేడుకకు హాజరు అవుతున్నారు.

 గరుడ, మహాభారతం ఇవేవీ కాదు...నెక్ట్స్ మూవీకి రాజమౌళి న్యూ టర్న్!

గరుడ, మహాభారతం ఇవేవీ కాదు...నెక్ట్స్ మూవీకి రాజమౌళి న్యూ టర్న్!

వరుస విజయాలతో టాలీవుడ్లో నెం.1 డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి..... 'బాహుబలి' మూవీతో నేషనల్ రేంజికి వెళ్లిపోయాడు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 డిసెంబర్ 31...'బాహుబలి' టీమ్ భారీ పంక్షన్, న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ పార్టీ కాదు

డిసెంబర్ 31...'బాహుబలి' టీమ్ భారీ పంక్షన్, న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ పార్టీ కాదు

ఈ నెల (డిసెంబర్) 31 వ తేదీ 'బాహుబలి' టీమ్ కు గుర్తు పెట్టుకోదగ్గ మెమరబుల్ డే గా మారనుంది. ఏంటి ఆ రోజు స్పెషాలిటీ ..సంవత్సవం పూర్తి అవుతుందనా... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 ‘ధృవ' చూసిన రాజమౌళి...ఎవరికి పూర్తి మార్కులు వేసి,రియల్ హీరో అన్నారో తెలుసా?

‘ధృవ' చూసిన రాజమౌళి...ఎవరికి పూర్తి మార్కులు వేసి,రియల్ హీరో అన్నారో తెలుసా?

‘ధృవ' చూసిన రాజమౌళి...ఎవరికి పూర్తి మార్కులు వేసి,రియల్ హీరో అన్నారో తెలుసా?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Both Prabhas and Rajamouli are going to grace for RGV's "Shiva To Vangaveeti" function scheduled to take place tomorrow in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu