»   » డిసెంబర్ 31...'బాహుబలి' టీమ్ భారీ పంక్షన్, న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ పార్టీ కాదు

డిసెంబర్ 31...'బాహుబలి' టీమ్ భారీ పంక్షన్, న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ పార్టీ కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ నెల (డిసెంబర్) 31 వ తేదీ 'బాహుబలి' టీమ్ కు గుర్తు పెట్టుకోదగ్గ మెమరబుల్ డే గా మారనుంది. ఏంటి ఆ రోజు స్పెషాలిటీ ..సంవత్సవం పూర్తి అవుతుందనా, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికే పార్టీ పెట్టుకుంటారు అని చెప్పబోతున్నాను అనుకుంటున్నారా..అదేమీ కాదు..మరో హైలెట్ న్యూస్ చెప్పబోతున్నాం.

డిసెంబర్ 31న బాహుబలి టీమ్ ..గుమ్మిడికాయ పంక్షన్ జరుపుకోనుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బాహుబలి 2 చిత్రం షూటింగ్ డిసెంబర్ 27తో పూర్తి కానుంది. కొద్దిగా ప్యాచ్ వర్క్ కూడా ఫినిషి చేసి, భారీ ఎత్తున గుమ్మిడికాయ పగలకొట్టే ఫంక్షన్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఆ రోజుతో ఇక బాహుబలి షూటింగ్ కు స్వస్ది పలికినట్లే అన్నమాట.


December 31st turns Memorable for Baahubali Unit

ఇక ఈ పంక్షన్ ని దర్శక,నిర్మాతలు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అది ఒక మరుపురాని సంఘటన గా గుర్తుండిపోవాలని భావిస్తున్నారు. ఈ ఈవెంట్ ని సినిమాకు పనిచేసిన టాప్ టెక్నిషియన్స్ నుంచి, డైలీ వేజెస్ కోసం పని చేసిన వారిని సైతం పిలుస్తున్నట్లు సమాచారం. ఆర్కా మీడియా వర్క్స్ వారు ఈ పంక్షన్ ని పబ్లిసిటీలో భాగంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఏప్రియల్ 28,2017న భారీ ఎత్తున విడుదల కానుంది.


ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న 'బాహుబలి 2' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం థియేట్రికల్‌, శాటిలైట్‌ హక్కులు భారీ మొత్తంలోఇప్పటికే అమ్ముడు పోయాయి.

English summary
A massive pumpkin breaking ceremony has been planned by Baahubali: The Conclusion makers on December 31st which will sure make the complete movie unit memorable.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu