»   » ‘ధృవ’ చూసిన రాజమౌళి...ఎవరికి పూర్తి మార్కులు వేసి,రియల్ హీరో అన్నారో తెలుసా?

‘ధృవ’ చూసిన రాజమౌళి...ఎవరికి పూర్తి మార్కులు వేసి,రియల్ హీరో అన్నారో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్‌: తమిళంలో ఘనవిజయం సాధించిన 'తనీ ఒరువన్‌' చిత్రాన్ని తెలుగులో 'ధృవ'గా రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. గీతాఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా, హిప్‌ ఆప్‌ తమిళ స్వరాలు సమకూర్చారు. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో చిత్రం యూనిట్ కు అన్ని చోట్ల నుంచీ ప్రశంసలు అందుతున్నాయి.

  ముఖ్యంగా ఈ సినిమా కోసం రామ్‌చరణ్‌ పడిన కష్టం మొత్తం చిత్రంలో ప్రతిబింబించడంతో అందరూ చెర్రీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఇప్పుడు రామ్‌చరణ్‌ను ప్రముఖ దర్సకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రశంసలతో ముంచెత్తారు.  'ఇమేజ్‌ను పక్కన పెట్టి కేవలం కథను మాత్రమే దృష్టిలో ఉంచుకుని 'ధృవ'ను తీసుకొచ్చిన రామ్‌చరణ్‌, సురేందర్‌రెడ్డిలకు నా అభినందనలు. ' అని ట్వీట్‌ చేశారు.  సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు చరణ్‌ లుక్‌, నటన చాలా బాగుంది. అతి చిన్న హావభావాలను సైతం చక్కగా పలికించారు. రకుల్‌ అందం మంత్రముగ్ధులను చేసేలా ఉంది.
  అలాగే అరవింద్ స్వామి ఆల్రెడీ తమిళ వెర్షన్ లో ప్రూవ్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా అంత బాగా చేసారు. ఇంత మంచి స్క్రిప్టు ఇచ్చిన రైటర్ కు పూర్తి మార్కులు , రియల్ హీరో అన్నారు.


  మరో ప్రక్క అరవింద్ స్వాతి తనను తెలుగులో ఆదరిస్తునందుకు ధాంక్స్ చెప్పారు.  "నన్ను మళ్ళీ ఇంత బాగా ఆదరిస్తోన్నందుకు, సినిమాకు ఇంత పెద్ద విజయం తెచ్చిపెట్టినందుకు తెలుగు ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్" అని అరవింద్ స్వామి తెలిపారు.


  English summary
  rajamouli ss ‏ tweeted: "My full appreciation to charan and surendarreddy for keeping the story infront instead of image which made Dhruva intresting and captivating.from beg till end.Charan looks great with his fantastic physic.performed very well with subtle expessions through out. Rakul is ravishing.Aravind swamy already proved in tamil version and he does no less here. Greatjob. full marks to the writer who did a fabulous job.Real hero.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more