»   » థియేటర్లో ఒకే ఒక్కడు: రూ. 1000, రూ. 500 నోట్ల ఎఫెక్ట్!

థియేటర్లో ఒకే ఒక్కడు: రూ. 1000, రూ. 500 నోట్ల ఎఫెక్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రూ. 1000, రూ. 500 నోట్ల రద్దు ఎఫెక్ట్ సినిమా పరిశ్రమపై భారీగానే పడింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేసినప్పటి నుండి థియేటర్లలో పెద్ద నోట్లను తీసుకోవడం లేదు. దీంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య భారీగా పడిపోయింది.

అహ్మదాబాద్ లో ఓ థియేటర్లో..... ఒకే ఒక్క ప్రేక్షకుడితో షో నడిపంచాల్సి వచ్చింది. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ఏ రేంజిలో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. చాలా చోట్ల ఏటీఎంలు కూడా పనిచేయక పోవడం, చేతిలో రోజువారి ఖర్చులకు కూడా డబ్బులు లేక పెద్దనోట్ల మార్పడి కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు.

సింగిల్ గా థియేటర్లో సినిమా చూసే అవకాశం దక్కించుకున్న ఆ యువకుడి పేరు హరి పంచల్. వయసు 21. గురువారం మధ్యాహ్నం స్థానిక మల్టీప్లెక్స్ థియేటర్‌కు 'మహాయోధ రామా' అనే యానిమేషన్ మూవీ చూసేందుకు వెళ్లాడు.

డెబిట్ కార్డుతో ఈ సినిమాకు టికెట్ తీసుకకున్నాడు

డెబిట్ కార్డుతో ఈ సినిమాకు టికెట్ తీసుకకున్నాడు

ఈ సినిమా చూసేందుకు కొందరు థియేటర్‌కు వచ్చినా రూ.1,000, 500 నోట్లను కౌంటర్లో తీసుకోకపోవడంతో వెనుదిరిగారు. హరి పంచల్ తన డెబిట్ కార్డుతో ఈ సినిమాకు టికెట్ తీసుకకున్నాడు.
నిబంధనల ప్రకారం మల్టీప్లెక్స్‌ల్లో కనీసం ఐదు టికెట్ల అమ్ముడైతేనే సినిమాను ప్రదర్శిస్తారు. లేకపోతే డబ్బు వాపసు ఇవ్వడం కానీ లేదా వేరే సినిమాకు ఆ టికెట్లతో అనుమతించడం కానీ చేస్తారు.
కానీ తానొక్కడి కోసమే యాజమాన్యం సినిమాను ప్రదర్శించడం చూసి అతనూ ఆశ్చర్యపోయాడు. మోడీ నిర్ణయం వల్లే తనకు ఈ అరుదైన అవకాశం దక్కిందని హరి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఒక్కరి కోసమే షో వేయడంపై మల్టీప్లెక్స్ ప్రతినిధి రాకేష్ పటేల్ స్పందిస్తూ.... పెద్ద నోట్ల రద్దుతో ప్రేక్షకులు బాగా తగ్గిపోయారని, అందుకే నిబంధనలు పక్కనపెట్టి ఎన్ని టిక్కెట్లు అమ్మాని సినిమా నడిపించాలని నిర్ణయించామని తెలిపారు.

డియర్ నాగార్జున... అంటూ ప్రధాని మోడీ రిప్లై, రూ. 500, రూ. 1000 ఇష్యూపై!

డియర్ నాగార్జున... అంటూ ప్రధాని మోడీ రిప్లై, రూ. 500, రూ. 1000 ఇష్యూపై!

డియర్ నాగార్జున... అంటూ ప్రధాని మోడీ రిప్లై, రూ. 500, రూ. 1000 ఇష్యూపై.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నోట్ల కట్టల రద్దు ఎఫెక్ట్: పాతిక కోట్లు బ్లాక్ మనీతో తెలుగు స్టార్ హీరో విలవిల

నోట్ల కట్టల రద్దు ఎఫెక్ట్: పాతిక కోట్లు బ్లాక్ మనీతో తెలుగు స్టార్ హీరో విలవిల

ప్రధాని మోదీ నోట్ల కట్ల రద్దు వ్యవహారం తెలుగులోని ఓ స్టార్ హీరో కు పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టినట్లైంది. పాతిక కోట్లకు పైగా క్యాష్ ఆయన ద్గగర బ్లాక్ మనీ ..ఇప్పుడు ఏం చేయాలో అని తలపట్టుకున్నారట. నిన్నటి నుంచి షూటింగ్ కు కూడా హాజరు కాకుండా ఆయన తన వాళ్లతో మంతనాలు జరుపుతున్నారట... పూర్తి వివారల కోసం క్లిక్ చేయండి

500, 1000 నోట్ల రద్దు: ‘బిచ్చగాడు' మూవీ డైలాగ్ దేశాన్ని ఊపేస్తోంది!

500, 1000 నోట్ల రద్దు: ‘బిచ్చగాడు' మూవీ డైలాగ్ దేశాన్ని ఊపేస్తోంది!

500, 1000 నోట్ల రద్దు: ‘బిచ్చగాడు' మూవీ డైలాగ్ దేశాన్ని ఊపేస్తోంది!.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఇంత బూతు తట్టుకోలేం: దిగజారుడు కాక మరేమిటి?

ఇంత బూతు తట్టుకోలేం: దిగజారుడు కాక మరేమిటి?

ఇంత బూతు తట్టుకోలేం: దిగజారుడు కాక మరేమిటి?..... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
After Rs 500 and Rs 1,000 notes became invalid tenders since Tuesday midnight, multiplexes have been witnessing fewer footfalls. When Panchal turned out to be the only person who had bought the ticket (using his debit card) for the afternoon show of Mahayoddha Rama, the multiplex management took a liberal view and decided to run the show just for him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu