»   » డియర్ నాగార్జున... అంటూ ప్రధాని మోడీ రిప్లై, రూ. 500, రూ. 1000 ఇష్యూపై!

డియర్ నాగార్జున... అంటూ ప్రధాని మోడీ రిప్లై, రూ. 500, రూ. 1000 ఇష్యూపై!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిన్నటి వరకు చెలామణిలో ఉన్న రూ. 1000, 500 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బ్లాక్ మనీ, అవినీతి సొమ్ము, దొంగనోట్ల చెలామణిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మోడీ నిర్ణయాన్ని హర్షిస్తూ సినీ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, కరణ్ జోహార్ తదితరులు ట్వీట్స్ చేసారు. ఈ ట్వీట్లపై స్వయంగా నరేంద్ర మోడీ స్పందించారు. వారికి పేరు పేరునా ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చారు.

PM Modi Replies to Rajinikanth, Nagarjuna

రజనీ-మోడీ

‘హ్యాట్సాఫ్‌ నరేంద్ర మోడీ గారు. కొత్త భారతదేశం ఆవిర్భవించింది. జైహింద్‌' అంటూ రజనీకాంత్ ట్వీట్ చేయగా.... ధానికి మోడీ స్పందిస్తూ ‘ధన్యవాదాలు. మనమంతా కలిసికట్టుగా పనిచేసి సంపన్న, అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిద్దాం' అంటూ రిప్లై ఇచ్చారు

నాగార్జునకు మోడీ రిప్లై

‘అభినందనలు నరేంద్ర మోడీ జీ! పన్ను చెల్లించే మాలాంటి వారిని సత్కరించినందుకు. ఆర్థికంగా బలపడే దిశగా ఇండియా అడుగులు వేస్తోంది' అంటూ నాగార్జున ట్వీట్ చేయగా.... ‘డియర్ నాగార్జున, దీని వల్ల అవినీతి ఆగుతుంది, నల్లధనం, నకిలీ నోట్ల చెలామణీ తగ్గుతుంది' అంటూ మోడీ రిప్లై ఇచ్చారు.

కమల్ హాసన్‌కు మోడీ రిప్లై

‘సెల్యూట్‌ మోడీ. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ నచ్చే నిర్ణయమిది. ముఖ్యంగా పన్ను చెల్లింపు దారులు' అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేసారు. దీనికి మోడీ స్పందిస్తూ.... ‘ఈ నిర్ణయాన్ని బెటర్‌ ఇండియా కావాలనుకుంటున్న నిజాయతీగల పౌరుల ఆసక్తి మేరకు తీసుకున్నాం' అంటూ మోడీ రిప్లై ఇచ్చారు.

కరణ్ జోహార్‌కు మోడీ రిప్లై

‘ఇది నిజంగా గొప్ప నిర్ణయం. మోడీ దుమ్ము దులిపేశారు' అంటూ కరణ్ జోహార్ ట్వీట్ చేయగా.... మోడీ స్పందిస్తూ... ధన్యవాదాలు కరణ్‌జోహార్‌. భవిష్యత్తు తరాల కోసం మనం కచ్చితంగా అవినీతి రహిత భారతదేశాన్ని తయారు చేయాలి' అంటూ ట్వీట్ చేసారు.

రితేష్ దేశ్ ముఖ్ కు రిప్లై

‘నరేంద్ర మోడీ రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసి మంచి పని చేశారు' అంటూ రితేష్ దేశ్ ముఖ్ ట్వీట్ చేయగా..., ‘థ్యాంక్‌యూ రితేష్‌ దేశ్‌ముఖ్‌' అంటూ మోడీ ట్వీట్ చేసారు.

మాధుర్ బండార్కర్

‘ధైర్యంగా ముందడుగు వేసి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసి మన దేశాన్ని ఆర్థికంగా బలపరిచినందుకు నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు' అంటూ దర్శకుడు మధుర్ బండార్కర్ ట్వీట్ చేయగా, ‘అవును మధుర్‌ భండార్కర్‌, ఇది అభివృద్ధికి ప్రేరణని ఇస్తుంది' అంటూ మోడీ రిప్లై ట్వీట్ చేసారు.

కైలాష్ ఖేర్ కు మోడీ రిప్లై

ఇది ఒక చారిత్రాత్మకమైన దినం. త్వరలోనే మన భారత దేశం అభివృద్ధి చెందిన దేశాల లిస్టులో చేరుతుంది అంటూ కైలాష్ ఖేర్ ట్వీట్ చేయగా... మోడీ స్పందిస్తూ... ‘ధన్య వాదాలు, అవినీతి, నల్లదనం నిర్మూలించినప్పుడే మనం అభివృద్ధి సాధిస్తాం అంటూ మెడీ ట్వీట్ చేసారు.

500, 1000 నోట్ల రద్దు: ‘బిచ్చగాడు’ మూవీ డైలాగ్ దేశాన్ని ఊపేస్తోంది!

500, 1000 నోట్ల రద్దు: ‘బిచ్చగాడు’ మూవీ డైలాగ్ దేశాన్ని ఊపేస్తోంది!

500, 1000 నోట్ల రద్దు: ‘బిచ్చగాడు' మూవీ డైలాగ్ దేశాన్ని ఊపేస్తోంది!.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఇంత బూతు తట్టుకోలేం: దిగజారుడు కాక మరేమిటి?

ఇంత బూతు తట్టుకోలేం: దిగజారుడు కాక మరేమిటి?

ఇంత బూతు తట్టుకోలేం: దిగజారుడు కాక మరేమిటి?..... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రోమ్‌లో అఖిల్ మ్యారేజ్, అప్పుడు మెచ్యూరిటీ లేకనే అలా : నాగ చైతన్య

రోమ్‌లో అఖిల్ మ్యారేజ్, అప్పుడు మెచ్యూరిటీ లేకనే అలా : నాగ చైతన్య

రోమ్‌లో అఖిల్ మ్యారేజ్, అప్పుడు మెచ్యూరిటీ లేకనే అలా : నాగ చైతన్య పూర్తి ఇంటర్వ్యూ వివరాల కోసం క్లిక్ చేయండి

కులాల పట్టింపులు: రామ్ చరణ్, బన్నీ, అఖిల్‌ వివాహాలపై...మీడియా ఫోకస్!

కులాల పట్టింపులు: రామ్ చరణ్, బన్నీ, అఖిల్‌ వివాహాలపై...మీడియా ఫోకస్!

కులాల పట్టింపులు: రామ్ చరణ్, బన్నీ, అఖిల్‌ వివాహాలపై...మీడియా ఫోకస్!.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రామ్ చరణ్ ‘ధృవ’ పాటలు రిలీజ్...

రామ్ చరణ్ ‘ధృవ’ పాటలు రిలీజ్...

రామ్ చరణ్ ‘ధృవ' పాటలు రిలీజ్... (వినడానికి క్లిక్ చేయండి)

English summary
Prime Minister Narendra Modi’s announcement that Rs 500 and Rs 1000 notes will become invalid by midnight on Tuesday, got a lot of praise from the film industry. Everyone from Rajinikanth to Karan Johar welcomed the historic step taken by the government to crackdown on black money. On Wednesday, Modi tweeted his response to some of the celebs who applauded his masterstroke of demonetisation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu