Nagabandham OTT: థియేటర్లలో బిగ్ షాక్.. 21 రోజుల్లోనే ఓటీటీలోకి.. నాగబంధం స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nagabandham OTT: యువ హీరో విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్ హీరోయిన్‌గా నటించిన సినిమా 'నాగబంధం'. ఈ మూవీనిదర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడినా, విడుదల తర్వాత నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు చేయలేకపోయింది. థియేటర్లలో డిజాస్టర్ గా మారింది. ఇలా థియేటర్లలో ఘోరంగా విఫలమైన ఈ సినిమా కేవలం 21 రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇంతకీ ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
'నాగబంధం'ను నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ స్థాయిలో నిర్మించాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాణ వ్యయం రూ.100 కోట్లకు పైగానే ఉందట. పురాతన నాగబంధం రహస్యం, దాగి ఉన్న నిధి, భారతీయ పురాణాల నేపథ్యాన్ని ఆధునిక విజువల్ టెక్నాలజీతో చూపించే ప్రయత్నం చేశారు. అలాగే.. విరాట్ కర్ణ సరసన నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు, మహేశ్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నాగర్కర్, అనసూయ, రిషబ్ సాహ్నీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ కొరియోగ్రఫీ, భారీ సెట్స్, అత్యాధునిక గ్రాఫిక్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

నాగబంధం విడుదలైన తొలి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, తర్వాత సినిమా కలెక్షన్లు క్రమంగా పడిపోయాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం.. తొలి వారం ముగిసే నాటికి సినిమా దేశవ్యాప్తంగా సుమారు రూ.15.77 కోట్ల నెట్ కలెక్షన్లు అందుకోగా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.20.75 కోట్లకు అందుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.60 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్‌కు సుమారు రూ.65 కోట్ల షేర్ అవసరమై ఉండగా, ఆ లక్ష్యానికి సినిమా చాలా దూరంలోనే ఆగిపోయింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వాటిల్లినట్లు సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
సాధారణంగా పెద్ద సినిమాలు నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తుంటాయి. అయితే 'నాగబంధం' మాత్రం విడుదలైన కేవలం 21 రోజుల్లోనే ఓటీటీ బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది. థియేట్రికల్ రన్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మేకర్స్ త్వరగా డిజిటల్ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. జూలై 24 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
హిందీ వెర్షన్ మాత్రం థియేట్రికల్ విండో కారణంగా కొంత ఆలస్యంగా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇటీవలి కాలంలో థియేటర్లలో ఆశించిన ఫలితం అందుకోని అనేక సినిమాలు ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందాయి. 'నాగబంధం' విషయంలో కూడా అదే జరుగుతుందేమో అనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఫాంటసీ, మైథలాజికల్ కథలను ఇష్టపడే ప్రేక్షకులు ఓటీటీలో ఈ సినిమాను ఆదరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నాన్-థియేట్రికల్ రికవరీపై ఆశలు
థియేట్రికల్ పరంగా నిరాశపరిచినప్పటికీ, ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కొత్త ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశతో చిత్రబృందం ఉంది. 'నాగబంధం' థియేటర్లలో భారీ విజయాన్ని అందుకోలేకపోయినా, ఓటీటీ ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు. బాక్సాఫీస్‌లో మిస్సైన విజయాన్ని డిజిటల్ వేదికపై అందుకుంటుందా? అనే ప్రశ్నకు సమాధానం రానున్న రోజుల్లో తెలుస్తుంది.


Click it and Unblock the Notifications




