OTT Releases This Week: ఓటీటీ లవర్స్‌కు పండగే.. ఈ వారం స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే!

OTT Releases This Week: ఈ వారం థియేటర్లలో పెద్దగా బజ్ ఉన్న సినిమాలేవీ లేకపోయినా... ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మాత్రం వరుసగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. సంక్రాంతి హిట్స్ ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశాయి. ఇక ఫిబ్రవరి మూడో వారంలో దాదాపు 15కి పైగా మూవీస్, ఒరిజినల్ సిరీస్‌లు వివిధ ఓటీటీల్లోకి రాబోతుండటంతో సినీ ప్రియులకు కంటెంట్ లోటు మాత్రం లేదు. ప్రస్తుతం ట్రెండ్ చూస్తే.. ఈ వారం తెలుగు స్ట్రెయిట్ మూవీస్ కంటే డబ్బింగ్ చిత్రాలు, హాలీవుడ్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ థ్రిల్లర్, రొమాన్స్, ఎమోషనల్ డ్రామా, క్రైమ్ జానర్స్‌లో ఇంట్రెస్టింగ్ టైటిల్స్ లిస్ట్‌లో ఉన్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.

లక్కీ ది సూపర్ స్టార్ (Lucky The Superstar)
ఈ వారం ఓటీటీలోకి నేరుగా వస్తున్న ముఖ్యమైన సినిమాల్లో లక్కీ ది సూపర్ స్టార్ (Lucky The Superstar) ఒకటి. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఈ తమిళ కామెడీ డ్రామా థియేటర్లను దాటేసి నేరుగా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. హీరోయిన్‌గా ఇందులో 'ఛాంపియన్', 'విత్ లవ్' ఫేమ్ అనశ్వర రాజన్ హీరోయిన్ గా నటించగా, కోవై సరళ, దేవదర్శిని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 20 నుంచి జియో హాట్‌స్టార్‌లో తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

OTT Releases This Week Lucky The Superstar Kennedy Raakshasa amp amp More Streaming from Feb 19-20

శ్రీ చిదంబరం గారు (Sri Chidambaram Garu)
వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా శ్రీ చిదంబరం గారు. ఈ మూవీ ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. ఈ గ్రామీణ నేపథ్య ఎమోషనల్ డ్రామా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందననే పొందింది. తనకు మెల్లకన్ను ఉందన్న భావనతో బాధపడే ఓ యువకుడు జీవితంలో ఏం నేర్చుకున్నాడు? అన్నదే కథాంశం. ఈ మూవీ ఫిబ్రవరి 19 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానున్నది. ఈ సినిమా కేవలం రెండు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ జరగడం ఇండస్ట్రీలో సర్ప్రైజ్‌గా మారింది. థియేటర్లలో కనెక్ట్ కాకపోయిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

చథా పచ్చ (Chatha Pacha)
మలయాళ డబ్బింగ్ సినిమా చథా పచ్చ (Chatha Pacha). ఇందులో అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, లక్ష్మీ మీనన్, విషాక్ నాయర్, సాయి కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు. ఫిబ్రవరి 13న తెలుగునాట థియేటర్లలో విడుదలైన మలయాళ డబ్బింగ్ 'చథా పచ్చ'. మలయాళంలో జనవరి 22న విడుదల చేశారు. ట్విస్ట్ ఏమిటంటే... ఈ వారం, అంటే ఫిబ్రవరి 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

30 కోట్ల స్పెషల్ గిఫ్ట్.. స్టార్ హీరోయిన్‌కి జైలులోని బాయ్ ఫ్రెండ్ షాక్..
కెన్నెడి (Kennedy)
బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ (Sunny Leone)ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ కెన్నెడి (Kennedy). ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. మూడేళ్ల క్రితమే పూర్తైన ఈ సినిమా ఇప్పటివరకు థియేటర్లకు రాకపోయినా, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ZEE5 సొంతం చేసుకోగా... ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్ భట్ కీలక పాత్ర పోషించగా, సన్నీ 'చార్లీ' పాత్రలో మెప్పించనుంది.

'రాక్షస' (Raakshasa)
కన్నడ ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్‌ 'రాక్షస'(Raakshasa) . ఈ వెబ్ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'రాక్షస'లో విజయ్ రాఘవేంద్ర ఎస్ఐ హనుమప్ప రోల్ చేశారు. మలప్రభ నది తీరంలో జరుగుతున్న హత్యలు, వాటికి కారణం మొసలే అన్న ప్రచారం... కానీ అసలు నిజం వేరేనా? అన్న సస్పెన్స్‌తో కథ సాగుతుంది. తమిళ హిట్ సిరీస్ విలాంగు (Vilangu) ఆధారంగా తెరకెక్కినట్టు టాక్.

Nagarjuna: 'ధురంధర్‌'లో విలన్‌ రోల్‌ మిస్.. నాగార్జున క్లారిటీ
'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ
ప్రైమ్ వీడియో ఓటీటీలోకి 'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ (Tu Meri Main Tera Main Tera Tu Meri) రాబోతోంది. కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటించిన ఈ రొమాంటిక్ మూవీ థియేటర్లలో ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం తొలుత రెంటల్ విధానంలో ఓటీటీలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్లకు ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.

Jana Nayagan Release: దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. జన నాయగన్ రిలీజ్ అప్పుడే?
థియేటర్లలోకి వచ్చే సినిమాలు
ఈ వీకెండ్ థియేటర్లలో 'హే భగవాన్', 'నవాబ్ కేఫ్', 'త్రిశంకు' వంటి చిన్న చిత్రాలు విడుదలవుతున్నాయి. అయితే వీటిపై పెద్దగా బజ్ కనిపించడం లేదు. దీంతో ఈ వారం ప్రేక్షకుల ఫోకస్ పూర్తిగా ఓటీటీ కంటెంట్‌పైనే ఉండే అవకాశం ఉంది. థియేటర్లలో పెద్ద రిలీజులు లేకపోవడంతో ఈ వీక్ ప్రేక్షకుల దృష్టి పూర్తిగా ఓటీటీపైనే ఉండేలా కనిపిస్తోంది. మరి వీటిలో ఏది హిట్ అవుతుంది? ఏది ట్రెండ్ అవుతుంది? అన్నది చూడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X