I Nobody Movie Review: ఐ నోబడీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు, హకీం షాజహాన్, అశోకన్, విజయ్ రాఘవన్, మధుపాల్, శంకర్ రామకృష్ణన్, నక్షత్ర తదితరులు
దర్శకత్వం: నిషమ్ బషీర్
నిర్మాతలు: సుప్రియా మీనన్, ముఖేష్ ఆర్ మెహతా, సీవీ సారథి
సినిమాటోగ్రఫి: దినేష్ పురుషోత్తమన్
ఎఢిటర్: రమీజ్ ఎంబీ
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
కథ: సమీర్ అబ్దుల్
క్యాస్టూమ్: ధన్య బాలకృష్ణన్
ఆర్ట్: అర్షద్
బ్యానర్: పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, E4 ఎక్స్‌పెరిమెంట్స్
రిలీజ్ డేట్: 2026-07-10

రాజీవన్ అలియాస్ రాజు (పృథ్వీరాజ్ సుకుమారన్) ప్రభుత్వ ఉద్యోగి. భార్య మీరా (పార్వతి తిరువోతు) కూతుళ్లు జియా, అమలతో కలిసి భారంగా జీవితాన్ని లాగిస్తుంటాడు. భార్యతో రాజుకు కొన్ని విభేదాలు చోటు చేసుకోవడంతో అసంతృప్తిగా లైఫ్‌ను లీడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తన ప్రాంతంలోని బ్యాంకులో జరిగిన భారీ దోపిడి వ్యవహారంలో రాజీవన్‌ చిక్కుకొంటాడు. దాదాపు 17 కోట్లు దోపిడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటాడు. ఓ వైపు పోలీసులు, మరో వైపు మాఫియా గ్యాంగులు రాజును, ఆయన కుటుంబాన్ని వెంటాడుతుంటారు. దాంతో మీరా, ఆమె కూతుళ్లకు మనశ్శాంతి లేకుండా పోవడమే కాకుండా జీవితం అభద్రతాభావానికి గురి అవుతుంది. ఈ క్రమంలో భార్య మీరా విడాకుల నోటీస్ ఇస్తుంది.

భార్య మీరాతో రాజుకు ఉన్న సమస్య ఏమిటి? మీరా, రాజు మధ్య విభేదాలకు కారణం ఏమిటి? బ్యాంక్ దోపిడి వ్యవహారంలో రాజు పాత్ర ఏమిటి? దోపిడి జరిగినప్పుడు బ్యాంకులో రాజు ఏం చేశాడు? దోపిడిదారులతో రాజు ఎందుకు ట్రావెల్ చేశాడు? 17 కోట్ల రూపాయలను రాజు నిజంగానే దోపిడి చేశాడా? దోపిడి చేస్తే భారీగా డబ్బును ఏం చేశాడు? దోపిడి తర్వాత మీరా, ఇద్దరు కూతుళ్ల లైఫ్ ఎందుకు గందరగోళంగా మారింది? ఏ పరిస్థితుల్లో కూతురు జియా కిడ్నాప్ జరిగింది? కూతురు కిడ్నాప్ వ్యవహారంలో ముఖ్యమంత్రి ఎందుకు జోక్యం కలిగించుకొన్నాడు? చివరకు దోపిడి వ్యవహారం ఏం తేలింది? మీరా, రాజు మధ్య విభేదాలు సమసిపోయాయా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

I nobody Movie Review and Rating

ఐ నోబడి సినిమా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో బ్రహ్మండంగా స్టోరీ టేకాఫ్ అందుకొంటుంది. దోపిడి నేపథ్యంలో కథ ఆసక్తికరంగా ముందుకెళ్తుంది. బ్యాంక్ దోపిడి తర్వాత రాజును చుట్టుముట్టిన సమస్యలు కథను మరింత ఇంటెన్స్‌గా మారుస్తుంది. యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్‌తో ఫస్టాఫ్‌ను దర్శకుడు నిషమ్ బషీర్ గ్రిప్పింగ్‌గా తెరకెక్కించాడు. దానికి తోడు పార్వతి, పృథ్వీరాజ్ పెర్ఫార్మెన్స్ తోడు కావడంతో మంచి ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చూస్తున్నామనే ఫీలింగ్ కల్పించాడు. మంచి పాయింట్‌తో ఫస్టాఫ్‌ను ముగించి సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచాడు.

Also Read
Lenin First Review: లెనిన్ మూవీ ఫస్ట్ రివ్యూ
Lenin First Review: లెనిన్ మూవీ ఫస్ట్ రివ్యూ

అయితే సెకండాఫ్ కూడా ఊహించినట్టే మంచి రేంజ్‌తో కొనసాగింది. ప్రీ క్లైమాక్స్‌కు వచ్చే సరికి దర్శకుడిలో తడబాటు కనిపించింది. ఆ తడబాటు చివరి సీన్ వరకు అలాగే కొనసాగింది. కాకపోతే ఫృథ్వీరాజ్, పార్వతి, జియా, అమల క్యారెక్టర్లు పోషించిన బాల నటులు ఫెర్ఫార్మెన్స్‌ కారణంగా సినిమా ఎమోషనల్‌గా సాగడం పాజిటివ్‌గా మారింది. క్లైమాక్స్‌లో పొలిటికల్ డ్రామా ఎమోషన్స్‌ను సైడ్ ట్రాక్ చేసేలా చేస్తుంది. క్లైమాక్స్‌ను ఇంకా కొంత బెటర్‌గా చేసి ఉంటే.. డెఫినెట్‌గా మంచి యాక్షన్ థ్రిల్లర్ అయి ఉండేది అనే ఫీలింగ్ కలుగుతుంది.

Recommended For You
Lenin Box Office Collections: ఓవర్సీస్‌లో డీసెంట్ ఓపెనింగ్స్.. ఆంధ్రా, నైజాంలో కలెక్షన్ల పరిస్థితి ఏంటంటే?
Lenin Box Office Collections: ఓవర్సీస్‌లో డీసెంట్ ఓపెనింగ్స్.. ఆంధ్రా, నైజాంలో కలెక్షన్ల పరిస్థితి ఏంటంటే?

ఐ నోబడి సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ వన్ మ్యాన్ షో. ఆయన మీకు ఎక్కడా స్టార్‌గా కనిపించడు. కామన్ మ్యాన్‌గా, సమాజం సృష్టించిన సమస్యల మధ్య నలిగిపోయిన ప్రభుత్వ ఉద్యోగిలా మాత్రమే కనిపిస్తాడు. నలిగిన బట్టలు, చెరిగిన క్రాఫ్, ముఖంపై రక్తం కారేలా గాయాలతో పూర్తిగా రాజీవన్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. భర్త సృష్టించే సమస్యలతో వేగలేని భార్యగా పార్వతి పోటాపోటీగా నటించింది. పృథ్వీరాజ్ కూతుళ్లుగా నటించిన ఇద్దరు బాల నటులు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఇతర పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు.

You May Also Like
I, Nobody First Review: ఐ నోబడీ మలయాళ మూవీ ఫస్ట్ రివ్యూ
I, Nobody First Review: ఐ నోబడీ మలయాళ మూవీ ఫస్ట్ రివ్యూ

ఐ నోబడి సినిమా విషయానికి వస్తే.. కథ, కథనాలే కాకుండా టెక్నికల్‌గా కూడా బ్రిల్లియెన్స్ కనిపిస్తుంది. ఈ సినిమాకు దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫి, జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్,, ఎఢిటర్‌గా రమీజ్ ఎంబీ పనితీరు ప్రతీ ఫ్రేమ్‌లో ఆకట్టుకొంటుంది. యానిక్ బెన్, కలై కింగ్సన్ యాక్షన్ కోరియోగ్రఫి మైండ్ బ్లోయింగ్‌లా ఉంటుంది. లిఫ్ట్‌లో యాక్షన్ సీన్లు కేక పెట్టిస్తాయి. స్ట్రీట్ ఫైట్స్, మాల్ ఫైట్ డిజైన్ చేసిన విధానం హైలెట్‌గా ఉంటుంది. సాంకేతిక పరంగా ఏ మాత్రం వంక పెట్టడానికి వీలు లేకుండా ఉంటుంది. ఎమోషన్ ఫ్యామిలీ డ్రామా, హై యాక్షన్ థ్రిల్లర్, హై ఎండ్ పెర్ఫార్మెన్స్‌ను ఎంజాయ్ చేయాలనుకొనే వారు ఈ సినిమాను తప్పకుండా చూడొచ్చు. ఎలాంటి అంచనాలతో వెళ్లిన కొత్త అానుభూతిని కలిగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X