Idhayam Murali Pre Release Review: హృదయం మురళీ ప్రీ రిలీజ్ రివ్యూ
తమిళ, మలయాళంలో స్టార్ యాక్టర్లు ఫాహద్ ఫాజిల్, అథర్వ, ప్రతీ ముకుందన్, కాయదు లోహర్, నిహారిక ఎన్ఎం, ఎంజెలీనా బీ, వీజే రక్షన్, ద్రావిడ్ సెల్వం, నటరాజన్ సుబ్రహ్మణ్యం నటించిన చిత్రం ఇదయన్ మురళీ. తెలుగులో హృదయం మురళీ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎస్ కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రానికి ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించారు. డాన్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, సీహెచ్ సాయి, ఎఢిటర్: ప్రదీప్ ఈ రాఘవ్, మ్యూజిక్: తమన్ ఎస్, ప్రొడక్షన్ డిజైనర్: ఎంఆర్ కార్తీక్ రాజ్‌కుమార్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన తమిళంతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గురించిన ప్రీ రిలీజ్ రివ్యూ వివరాల్లోకి వెళితే..

ఇదయం మురళీ సినిమా కథ విషయానికి వస్తే.. వన్ సైడ్ లవ్‌లో ఉన్న ఇదయం మురళీ (అథర్వ) అనే యువకుడి లైఫ్ జర్నీ. స్కూల్ రోజుల్లో గీత (ప్రీతీ ముకుందన్) అనే అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. కానీ తన ప్రేయసికి తన మనసులోని మాటను, భావాన్ని ఆ సమయంలో చెప్పలేకపోతాడు. కొన్ని కారణాలుగా వారిద్దరు విడిపోతారు. కానీ చిన్నతనం నుంచి వెంటాడే ప్రేమను, గీతను మురళీ మరిచిపోలేకపోతాడు. తన మనసులో రోజు రోజుకు ఆమెపై ప్రేమ పెరిగి పెద్దదవుతూనే ఉంటుంది. విదేశాల్లో ఉంటున్న తన ప్రేయసి కోసం వేట మొదలుపెడుతాడు. అయితే తన ప్రేయసి కోసం వెతికే క్రమంలో లైఫ్‌లో భారీ ట్విస్ట్ చోటు చేసుకొంటుంది.
గీత కోసం ఇదయ మురళీ వన్ సైడ్ లవ్ ఎలా కొనసాగింది? మురళీకి మరో అమ్మాయి (కాయదు లోహర్)తో రిలేషన్ ఏమిటి? సచిన్ (తమన్ ఎస్), లాడో (నిహారిక ఎన్ఎం) దంపతులకు ఈ కథలో ప్రాముఖ్యత ఏంటి? ఈ ప్రేమ కథలో ఫాహద్ ఫాజిల్ రోల్ ఏమిటి? చివరకు గీతను మురళీ కలుసుకొన్నాడా? లేదా గీత, మరో అమ్మాయిలో ఎవరితో తన జీవితాన్ని పంచుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఇదయ మురళీ సినిమా కథ.
అథర్వ తండ్రి నటుడు మురళీ 1990 సంవత్సరంలో నటించిన హృదయం సినిమా అదిపెద్ద విజయాన్ని కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన విషయం తెలిసిందే.ఆ సినిమాకు ట్రిబ్యూట్‌గా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు కోర్టు ఆదేశాలు అడ్డంకిగా నిలిచాయి. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర ఈ సినిమా రిలీజ్‌ను ఆపాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. డాన్ పిక్చర్స్ నిర్మించిన పరాశక్తి సినిమాకు తనకు రావాల్సిన 8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ చెల్లించలేదని ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో ఈ సినిమా సెన్సార్ వివరాలను గోప్యంగా ఉంచారు.
జూలై 8వ తేదీన ఈ సినిమా రిలీజ్‌పై దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ కొనసాగించనున్నది. ఇరు పార్టీల మధ్య సయోధ్య గానీ.. లేదా రాజీ గానీ కుదిరితే ఈ సినిమా జూలై 10వ తేదీన రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఈ సినిమా సెన్సార్ రివ్యూ గురించిన సమాచారం, ఎక్స్‌క్లూజివ్ రివ్యూ వివరాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications


