Brahmamudi అప్పుకు గురూజీ సాయం.. బావతో కావ్య రొమాన్స్... ప్రేమను బయటపెట్టిన రాజ్!
బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఇంట్రెస్టుగా సాగుతోంది. ఇక ఈ వారం మొత్తం అనేక ట్విస్టులతో ఆసక్తి కలిగించింది. రాజ్ లోని ప్రేమను బయటపెట్టేందుకు కావ్య తన బావతో కలిసి నాటకం ఆడుతుంది. ఇక ఇందిరాదేవి సూచనలతో రాజ్ ను ముప్పు తిప్పలు పెడతారు. మరోవైపు కల్యాణ్ ను కంట్రోల్ చేసేందుకు అనామిక ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. ఇక అప్పు సైతం పోలీస్ అయ్యేందుకు కసరత్తులు మొదలు పెడుతుంది. అప్పుకు ఓ గురూజీ కూడా దొరికేస్తాడు. ఇక కావ్య, ఆమె బావలపై రుద్రాణి డౌట్ పడుతుంది. ఇలా వారం మొత్తం సాగింది. ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు బ్రహ్మముడి సీరియల్ లో ఏం జరిగిందో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
ఫిబ్రవరి 19వ తేదీ సీరియల్‌లో
తన కోడలు అనామికకు ఇంట్లో పెత్తనం ఇవ్వాలంటూ ధాన్యలక్ష్మి పెంటపెడుతుంది. కావ్య ఇంట్లోని రెండు లక్షలు తీసుకుని తన పుట్టింటికి ఇచ్చిదంటూ ఆరోపిస్తారు. ఇక ఆఫీసు నుంచి సుభాష్, రాజ్, ప్రకాశం వచ్చాక పంచాయితీ పెడతారు. కావ్య మీద నిందలు వేస్తారు. దీంతో సుభాష్, రాజ్, ప్రకాశం కలిసి ధాన్యలక్ష్మికి ఇచ్చిపడేస్తారు. పూర్తి వివరాల కోసం లింక్ ను క్లిక్ చేయండి.

ఫిబ్రవరి 20వ తేదీ సీరియల్‌లో
అనామిక, కల్యాణ్ కలిసి బయటకు వెళ్తారు. అలా వెళ్తుండగా వారి కారుకు అప్పు బైక్ అడ్డు వస్తుంది. ఇక ఇద్దరు సీరియస్ గా దిగగా.. కల్యాణ్ చూసి బ్రో అంటూ పలకరిస్తాడు. ఇక కల్యాణ్ మాట్లాడి కారులో కూర్చున్నాక అనామిక.. అప్పును కించ పరుస్తుంది. దీంతో అప్పు కూడా అనామికకు వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు కావ్య తన బావతో రొమాన్స్ డోస్ పెంచి రాజ్ ను ముప్పుతిప్పలు పెడుతుంది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
ఫిబ్రవరి 21వ తేదీ సీరియల్‌లో
కావ్య తన బావతో కలిసి బయటకు వెళ్లేందుకు రాజ్ ను పర్మిషన్ అడుగుతుంది. నేను ఇవ్వను అంటూ రాజ్ బిల్డప్ ఇస్తాడు. అయితే మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా పోతా అని చెప్తుంది. దీంతో రాజ్ వెళ్లమని చెప్తాడు. ఇక బావతో షికార్లు అని కావ్య వెళ్లిపోతుంది. కావ్య వెళ్లిపోయాక రాజ్ తట్టుకోలేకపోతాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఇందిరాదేవికి కంప్లైంట్ ఇస్తాడు. దీంతో ఇందిరాదేవి మన ఇంటికి తీసుకువచ్చిందని చెప్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఫిబ్రవరి 22వ తేదీ సీరియల్‌లో
కావ్య తన బావతో క్లోజ్ గా ఉండటం రాజ్ సహించలేకపోతుంటాడు. మరోవైపు కావ్య బావ దుగ్గిరాల ఇంట్లోనే ఉండేందుకు ఇందిరాదేవి పర్మిషన్ ఇస్తుంది. అపర్ణ కూడా ఓకే అంటుంది. ఇక రాజ్ మాత్రం కోపంతో ఊగిపోతాడు. మరోవైపు ఇంట్లో పెత్తనం కోసం అనామిక ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. ఇక కావ్య, ఆమె బావపై రుద్రాణికి డౌట్ వస్తుంది. రాహుల్ ను పిలిచి వారిపై ఓ కన్నువేసి ఉంచమని చెప్తుంది. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి.
ఫిబ్రవరి 23వ తేదీ సీరియల్‌లో
కావ్య బావ కంటే తాను ఎక్కువ అని నిరూపించుకునేందుకు యోగాసనాలు వేస్తూ తిప్పలు పడతాడు. రాజ్ తిప్పలు చూసి ఇందిరాదేవి కూడా నవ్వుకుంటుంది. ఏదో ఆసనం వేసి నడుం పట్టేలా చేసుకుంటాడు. మరోవైపు అనామిక వాళ్ల అమ్మకు కాల్ చేసి.. కల్యాణ్ ను ఆఫీసుకు పంపిస్తున్నా అని చెప్తుంది. కల్యాణ్ ను కింగ్ చేసి.. నేను క్వీన్ అవుతా అంటూ మాట్లాడుతుంది. ఇవన్నీ రుద్రాణి విని.. తన కొడుకుని కింగ్ చేసి.. నేను కింగ్ మేకర్ అవుతా అని అనుకుంటుంది. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి.

ఫిబ్రవరి 24వ తేదీ సీరియల్‌లో
కావ్యకు సర్ ప్రైజ్ ఇస్తానని భాస్కర్ కేఫెకు తీసుకుపోతాడు. ఇక రాజ్ కూడా దొంగచాటుగా అక్కడి వెళ్తాడు. వెయిటర్ ను పిలిచి రాజ్ విషయం కనుక్కుంటాడు. ఏంటి ప్లాన్ అని వెయిటర్ కు డబ్బులు ఇచ్చి కనుక్కుంటాడు. వాళ్లు కేక్ ఆర్డర్ చేశాడు.. అని చెప్తాడు. ఎందుకు అంటే.. ఈరోజు వాలంటైన్స్ డే అని చెప్తాడు. దీంతో రాజ్ షాక్ అవుతాడు. తదుపరి ఎపిసోడ్ లో రాజ్.. కళావతికి పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications










