Brahmamudi: రాజ్‌ను చెడగొడుతున్న అపర్ణ.. పుట్టింటికి కావ్య.. అప్పు కోసం కల్యాణ్ పాట్లు!
బ్రహ్మాముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తిని కలగజేస్తుంది. ఈ సీరియల్ ఇప్పుడు మాటీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో బెస్ట్ రేటింగ్ సాధిస్తోంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే జూలై 17 నుంచి జూలై 22 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..
డబ్బుల కోసం కావ్య: కల్యాణ్ గ్రౌండుకు వచ్చి అప్పుకు ఫోన్ చేయగా.. తనకు రావడం కుదరదని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఏదో సమస్యలో ఉన్నట్టు ఉంది ఎలా తెలుసుకోవడమని కళ్యాణ్ ఆలోచిస్తాడు. శృతి డబ్బులు వేస్తే అమ్మ వాళ్ళకి పంపించాలని అనుకుంటూ ఉండగా ఫోన్ చేసి అకౌంటెంట్ లీవ్ లో ఉన్నాడు రెండు రోజుల్లో డబ్బులు క్రెడిట్ చేస్తానని చెప్తుంది శృతి. అమ్మ వాళ్ళకి సాయం చేయాలని అనుకుంటే ఇలా అయ్యిందేంటని కావ్య బాధపడుతుంది. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

శృతికి రాజ్ ఫోన్:ఎపిసోడ్ ప్రారంభంలో కావ్య గీసిన డిజైన్స్.. లాప్ టాప్ లో ఉన్న డిజైన్స్ చెక్ చేసుకుంటాడు రాజ్. అవి ఇవి ఒకటే అని నిర్ధారించుకొని శృతికి ఫోన్ చేసి ఫ్రీ లాన్సర్ డిజైనర్ పేరు చెప్పమని అడుగుతాడు. కంగారుపడుతూ శిరీష అని చెప్తుంది శృతి.
ఫోన్ పెట్టేసిన రాజ్ శృతి అబద్ధం చెప్తుందని అర్థం చేసుకుంటాడు. ఎలాగైనా నిజం బయట పెడతాను అనుకుంటాడు. మరోవైపు టీబీ అంటువ్యాధి అనుకొని తనకోసం సపరేట్గా గ్లాసు కంచం తెచ్చుకుంటుంది అన్నపూర్ణ. అప్పు.. పెద్ద క్లాస్ ఇచ్చి.. అన్నపూర్ణకు అన్నం తిసిపిస్తుంది.పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
తర్వాత కావ్య తో: ఆ మాటలు విన్న రాజ్ అవతలి వైపు మహానటి అనుకుంటే ఇవతల వైపు సహజనటి అని శృతిని, కావ్యని అనుకుంటాడు రాజ్. శృతి ఫోన్ రాజ్ కి ఇచ్చిన తర్వాత నేను మాట్లాడి తర్వాత ఫోన్ ఇస్తాను ఈ లోపు వెళ్లి నీ పని చేసుకో అంటాడు రాజ్. శృతి ఇబ్బందిగానే అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కావ్య తో మాట్లాడుతూ డిజైన్స్ చాలా బాగా గీసారు మా ఆవిడ ఉంది మంచి డిజైన్ గీస్తుందేమో అనుకుంటే 11 చుక్కల ముగ్గు వేసుకుంటుంది అందరికీ మీలాగా టాలెంట్ ఉండదు అని కావ్య ని కావాలనే తిడతాడు రాజ్. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

రాజ్ ప్రవర్తనతో అపర్ణ షాక్: కావ్యని అందరితో తిట్టించాలని చూసిన స్వప్నను రాజ్ రివర్స్ లో తిడతాడు. మీ చెల్లి ఎలాంటిదో ఈ ఇంట్లో మానానమ్మని అడిగినా చెప్తుంది. కలిసి పుట్టి పెరిగావ్ అర్థం చేసుకోలేవా అని రాజ్.. స్వప్నతో అంటాడు. నీ పెళ్లి కోసం నానా కష్టాలు పడినా గుర్తించవా... పెళ్లికి ముందే తొందరపడి మీ అమ్మానాన్నకి తలవంపులు తెచ్చినా ప్రతీ క్షణం నీ గురించే ఆలోచించింది.
నీ పెళ్లి కోసం ప్రయత్నాలు చేసింది. అలాంటిది నీ గురించి పట్టించుకోదా? వినడానికే అసహ్యంగా ఉందని తిడతాడు. రాజ్ ప్రవర్తనతో అపర్ణ ఆశ్చర్యపోతుంది. కావ్య మీద నిందలు వేయడం కరెక్ట్ కాదని ఇంద్రాదేవి అంటుంది. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

కావ్య డిజైన్స్ వేస్తుంటే.. రాజ్ పట్టుకుంటాడు: ఎందుకు ఇలా దొంగతనంగా వేయడం..నేను కళను గుర్తించనను కున్నావా.. అని రాజ్ అంటాడు. దానకిి కావ్య మీ దృష్టిలో నేను ముగ్గులు వేయడానికి తప్ప ఎందుకు పనికి రాను కదా అని సమాధానం ఇస్తుంది. ఆరోజు ఫారిన్ నుంచి క్లయింట్స్ వస్తే.. నేను మీతో ఆఫీసుకి వచ్చి డిజైన్స్ గీసి ఇచ్చాను. ఇదేమన్న ఇంటి ముందు ముగ్గు అనుకున్నావా అని చించి పారేశారు అని కావ్య గుర్తు చేస్తుంది. అవే డిజైన్స్ ల్యాప్ టాప్ లో శృతి చూపిస్తే ఆమె వేసిందని మెచ్చుకుని నమ్మారు అని చెబుతుంది కావ్య.పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications











