Brahmamudi:హమ్మయ్యా.. ఆ ఇన్సిడెంట్‌తో మొత్తానికి కావ్య, రాజ్ ఒక్కటయ్యారుగా!

బ్రహ్మాముడి సీరియల్ లో ఈ వారం కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. ఈ సీరియల్ మాటీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో బెస్ట్ రేటింగ్ సాధిస్తోంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..

సెప్టెంబర్ 18వ ఎపిసోడ్ లో... క‌ళ్యాణ్‌కు ప్ర‌పోజ్ చేయాల‌ని అనామిక ఫిక్స్ అవుతుంది. ల‌వ్ ప్ర‌పోజ్ కంటే డైరెక్ట‌ర్‌గా పెళ్లి ప్ర‌పోజ‌ల్‌ను క‌ళ్యాణ్ వ‌ద్ద తీసుకుర‌మ్మ‌ని అనామిక‌కు ఆమె తండ్రి స‌ల‌హా ఇస్తాడు. తండ్రి స‌ల‌హాను పాటించ‌డ‌మే బెట‌ర్ అని అనామిక అనుకుంటుంది. ఇక కల్యాణ్ కు అనామిక పెళ్లి కార్డు ఇచ్చి ప్రపోజ్ చేస్తుంది. మరోవైపు కావ్య, రుద్రాణి ఈ ఎపిసోడ్ లో కలిసిపోతారు.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 September 18th to September 23rd episode

సెప్టెంబర్ 19వ ఎపిసోడ్ లో... అప‌ర్ణ చేసిన ప‌ని వ‌ల్ల ఇంట్లో ఎవ‌రూ భోజ‌నం చేయ‌కుండా ప‌స్తులు ఉండిపోతారు. త‌ల్లి కోపం ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందో అని రాజ్ భ‌య‌ప‌డిపోతాడు. త‌న వ‌ల్ల రాజ్‌, అప‌ర్ణ‌కు మ‌ధ్య దూరం పెర‌గ‌డం కావ్య త‌ట్టుకోలేక‌పోతుంది. త‌ల్లీకొడుకుల్ని క‌ల‌పాల‌ని ఫిక్స్ అవుతుంది. అప‌ర్ణ‌కు వాస్త‌వాల్ని వివ‌రించి ఆమెలోని కోపాన్ని పోగోట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది కావ్య‌. కానీ కావ్య మాట‌ల్ని ప‌ట్టించుకోదు అప‌ర్ణ‌. మంచిమాట‌ల‌తో కాకుండా రివ‌ర్స్ స్ట్రాట‌జీలో కొత్త నాట‌కం మొద‌లుపెట్టి అప‌ర్ణ మ‌న‌సు మార్చేస్తుంది కావ్య‌. పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి

సెప్టెంబర్ 20వ ఎపిసోడ్ లో... కావ్య.. అపర్ణ దగ్గరకి వచ్చి... దుగ్గిరాల ఫ్యామిలీకి దూరం అయ్యేది మీరే. నా భర్త నాకే దగ్గర అవుతున్నారు. ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోండని చెబుతుంది. మీరు ఏదైతే మనసులో ఊహించుకుంటున్నారో అదే జరుగుతోంది. ఆ అవకాశాన్ని మరే నాకు ఇస్తున్నారు. ఇక ముందు మీ స్థానంలో మీరు ఉంటాలంటే ఇంటికి... ఇంటి సభ్యులకు దూరం అయి మీరు సాధించేది ఏం లేదు. కాదు.. మీ నిర్ణయమే సరైనది అనుకుంటే మొత్తం ఇంటి బాధ్యతను నాకు అప్పగిస్తారు. ఇకపై మీరే ఆలోచించుకోండి అత్తయ్య మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కావ్య. దీంతో అపర్ణకు ఏం చేయాలో అర్థం కాదు. కావ్య చెప్పిన విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 September 18th to September 23rd episode

సెప్టెంబర్ 21వ ఎపిసోడ్ లో... బ్రహ్మముడి సీరియల్ లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. దీంతో ఈ సీరియల్ ఎపిసోడ్స్ కానీ, ప్రోమోస్ కానీ ఎలాంటివి ముందుగా రిలీజ్ చేయడం లేదు మేకర్స్. ప్రేక్షకుల్ని సస్పెన్స్ పెడుతూ... ఊరిస్తున్నారు. ఈ సీరియల్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక సీరియల్ విషయానకిి వస్తే... రుద్రాణి... కావ్య, కృష్ణమూర్తి ఫ్యామిలీకి పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో ఏం చేయాలో తెలీని నిస్సహాయ స్థితిలో ఉంది. మరోవైపు అనామిక ప్రేమలో కల్యాణ్ తేలిపోతాడు. పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి

సెప్టెంబర్ 22వ ఎపిసోడ్ లో బ్రహ్మముడి సీరియల్‍ గత వారం నుంచి ట్విస్టుల మీద ట్విస్టుల మీద సాగుతోంది. ఇక ఈరోజు కావ్య ఇంటికి రాజ్ వెళ్తాడు. అక్కడ కావ్యకు ఆలస్యం కావడంతో అక్కడే ఉండిపోతాడు. అది తెలిసి అపర్ణ రగిలిపోతుంది. మరోవైపు కృష్ణమూర్తిని కొట్టి.. రుద్రాణి పంపిన రౌడీలు విగ్రహాలను ఎత్తుకెళ్తారు. విషయం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు... అయితే పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 September 18th to September 23rd episode

సెప్టెంబర్ 23వ ఎపిసోడ్ లో కృష్ణమూర్తిని కొట్టి రాహుల్ పంపించిన రౌడీలు విగ్రహాలు ఎత్తుకెళ్తారు. ఈ విషయం తెలుసుకున్న కావ్య... వెంటనే విగ్రహాల కార్ఖానాకు చేరుకుంటుంది. అక్కడ గాయాలతో కృష్ణ మూర్తి పడి ఉంటాడు. ఇక అది చూసిన కావ్య, అప్పు, కనకం..ఏడుస్తూ ఉంటారు. మరోవైపు నా విగ్రహాలు నాకు కావాలని కంట్రక్టార్ వచ్చి అడుగుతాడు. రాజ్ నేను తీసుకు వస్తాను... అని చెప్పి వెళ్తాడు. అసలు రాజ్ ఆ విగ్రహాలను పట్టుకుంటాడా.. కావ్యకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా.. అనేది ఈ స్టోరీలో తెలుస్తుంది. అయితే ఫుల్ స్టోరీ కోసం క్లిక్ చేయండి.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 September 18th to September 23rd episode

సెప్టెంబర్ 24వ ఎపిసోడ్ లో రాజ్ రౌడీల కోసం వెతుకుతాడు. చివరకు గండిపేట చెరువు వద్ద రౌడీలు ఉన్నట్లు తెలుసుకుంటాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న అప్పు, వారి ఫ్రెండ్స్ ను రౌడీలు కొడుతూ ఉంటారు. రాజ్ వెళ్లి హీరో రెంజులో కొట్టి విగ్రహాలను తీసుకువస్తాడు. ఇక కావ్య ఎమోషనల్ అయి రాజ్ ను హగ్ చేసుకుంటుంది. మొత్తానికి కావ్య రాజ్ ఒక్కటైపోతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X