Brahmamudi: స్వప్నను హత్య చేసేందుకు రుద్రాణి, రాహుల్ స్కెచ్... తల్లికి నిజం చెప్పేసిన రాజ్

బ్రహ్మాముడి సీరియల్ లో ఈ వారం కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. ఈ సీరియల్ మాటీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో బెస్ట్ రేటింగ్ సాధిస్తోంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..

సోమవారం సెప్టెంబర్ 4న బ్రహ్మముడి సీరియల్ లో సంబంధం లేదంటున్నా సావాసం చేస్తున్నాను.. సహనంతో సహజీవనం చేస్తున్నాను.. ఎందుకు? ఎందుకు? అంటూనే ఇందుకు.. అంటూ తాళిని చూపిస్తుంది కావ్య. ఇంకా రగిలిపోతూ చూస్తాడు రాజ్. ఈ సతమానంతో నన్ను కట్టి పడేశారు. పెళ్లి పేరుతో నాకు సంకెళ్లు వేశారు. అందుకే.. అందుకే నేను ఇక్కడున్నాను అంటుంది కావ్య. ఇక కావ్యతో రాజ్ మూడు నెలలు గడువు అడిగి... కిందకి వచ్చి ఆమె వ్రతాన్ని పూర్తి చేస్తాడు. కానీ రాజ్ ఇదంతా చేసేది మాత్రం సీతారామయ్య కోసం.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 September 4th to September 9th episode

సెప్టెంబర్ 5న ఎపిసోడ్ లో ఇక బ్రహ్మముడి సీరియల్ ప్రారంభంలోనే రాజ్, సీతారామయ్య మాట్లాడుకుంటారు. వ్రతం ఇంకా పూర్తి కాలేదు. అది కూడా నీవల్లే అని చెబుతాడు సీతారామయ్య. నాకేం సంబంధం తాతయ్య అని రాజ్ అంటే... ఉదయం నుంచి కావ్య ఉపవాసం ఉంది. వ్రతం పనులన్నీ చేసి చేసి అలసిపోయింది. చివరిలో అక్షింతలు వేయకుండా ఆ అమ్మాయి మనసు బాధపెట్టావ్ అంటాడు సీతారామయ్య. అపర్ణ రగిలిపోతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 September 4th to September 9th episode

సెప్టెంబర్ 6న ఎపిసోడ్ లో బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తోంది. ఇక రాజ్.. కళావతి మీద దొంగ ప్రేమ చూపిస్తూ... నాటకాలు ఆడుతున్నాడు. మరోవైపు అపర్ణ కొడలిపై రగిలిపోతుంది. కళ్యాణ్ అభిమాని.. అనామిక స్కెచ్ వేరు. అసలు గుట్టు వేరు. మొత్తానికీ కళ్యాణ్‌ని తన ఉచ్చులో బిగించే పనిలో పడిందనిపిస్తోంది అనామిక. మరోవైపు రుద్రాణి, రాహుల్ కలిసి స్వప్నని మాయం చేసేశారు. ఇక పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి

సెప్టెంబర్ 7న సీతారామ‌య్య‌కు క్యాన్స‌ర్ అని తేల‌డంతో ఆయ‌న‌కు ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి కావ్య‌ను త‌న భార్య‌గా అంగీక‌రిస్తాడు రాజ్‌. తాత‌య్య ద‌గ్గ‌ర మంచి మార్కులు కొట్టేయ‌డానికి కావ్య‌పై అంతులేని ప్రేమ‌ను న‌టిస్తుంటాడు. కావ్య‌పై పొగ‌డ్త‌ల్ని కురిపిస్తుంటాడు. భ‌ర్త‌లో వ‌చ్చిన మార్పుకు కావ్య షాక‌వుతుంది. కావ్య‌పై రాజ్ ప్రేమ అప‌ర్ణ‌కు మింగుడుప‌డ‌దు. తాత‌య్య‌ను ఇంప్రెస్ చేసే ప్ర‌య‌త్నంలో ప్ర‌తిసారి త‌ల్లి ద‌గ్గ‌ర బుక్క‌వుతుంటాడు రాజ్‌.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 September 4th to September 9th episode

సెప్టెంబర్ 8వ ఎపిసోడ్ లో ఇక సీతారామయ్య క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇక సీతరామయ్య ఇబ్బంది పడుతుంటే రాజ్ చూసి.. ఆసుపత్రికి వెళ్దాం అని చెబుతాడు. అంతా బాగానే ఉందని సీతారామయ్య అని చెబుతాడు. మనం బెటర్ ట్రీట్ మెంట్ కోసం వేరే చోటుకు వెళ్దాం అని చెప్తాడు రాజ్... పెంచగలరేమో కానీ.. ప్రాణం అయితే నిలపలేరు కదా అంటాడు సీతారామయ్య. సరే నా సంగతి తర్వాత చెప్తా... ముందు నీ గురించి చెప్పు? నిన్నో మాట అడుగుతాను నిజం చెప్తావా? అని అంటాడు సీతారామయ్య. దేని గురించి తాతయ్యా.. కళావతి గురించేనా? అని అంటాడు రాజ్. ఇక పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి

సెప్టెంబర్ 9వ ఎపిసోడ్ లో.. బ్రహ్మముడి సీరియల్ ప్రారంభంలో కావ్య పూలు, పాల గ్లాస్ తో రాజ్ గదిలోకి వెళ్తుంది. కాసేపు పాలు, పూల గురించి క్లాస్ తీసుకుంటుంది కావ్య. అది వినలేక రాజ్.. కావ్యకు దండం పెడుతాడు. మళ్లీ ఫీల్ అవుతుందేమోనని.. మూడు నెలలు టైమ్ అడిగాను కదా అని కావ్యకు గుర్తు చేస్తాడు రాజ్. అమ్మమ్మ పూలు పెట్టారు, చిన్నత్తయ్య పాలు ఇచ్చారని చెప్తుంది కావ్య. దీంతో రాజ్ సైలెంట్ అయిపోతాడు. ఇక పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X