మీనాతో బాలు రొమాన్స్... శ్రీముఖికి కడుపుమంట, ముళ్లకంపని బుక్ చేసిందిగా!
Photo Courtesy: Star Maa
స్టార్ మాలో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్స్‌లో గుండెనిండా గుడిగంటలు కూడా ఒకటి. ఆకట్టుకునే కథ, కథనం, నటీనటుల నటనతో ఈ ధారావాహిక టెలివిజన్, ఓటీటీ ప్లాట్‌ఫాంపై టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తోంది. ఈ సీరియల్ ఈ స్థాయిలో హిట్ కావడానికి బాలు- మీనాల మధ్య కెమెస్ట్రీ, బాలు విసిరే పంచ్‌లు, కామెడీతో పాటు ఈ సీరియల్‌లోని జంటల నటన కీలకపాత్ర పోషించింది. తాజాగా శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకు గుండెనిండా గుడిగంటలు టీమ్ విచ్చేసి సందడి చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.
వారం వారం బుల్లితెర సెలబ్రిటీల అల్లరి, ఆటపాటలతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమం. ప్రతివారం ఓ ప్రత్యేకమైన థీమ్‌తో సెలబ్రిటీలను ఆడిస్తున్నారు యాంకర్ శ్రీముఖి. దీనిలో భాగంగా ఈ వారం ఎపిసోడ్‌లో గుండెనిండా గుడిగంటలు మెగా సెలబ్రేషన్స్ పేరుతో స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుండెనిండా గుడిగంటలు టీమ్ మొత్తం హాజరైంది.

Photo Courtesy: Star Maa
తొలుత ప్రభావతి క్యారెక్టర్ పోషించిన అనీలా శ్రీకుమార్ ఎప్పుడూ చీరలో ఉంటారు, అయితే పంజాబీ డ్రెస్‌లో కనిపించడంతో నా సిస్టర్ వచ్చింది అనుకున్నాను అని శ్రీముఖి పంచ్ పేల్చింది. 700 ఎపిసోడ్స్.. అక్కడ ఓటీటీలో, మరోపక్క టీవీలో నెంబర్ వన్.. ఎలా అనిపిస్తోందని శ్రీముఖి అడగ్గా.. చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు. శృతి కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పగా.. మీ నెయిల్స్ కూడా చాలా బాగున్నాయని కాంప్లిమెంట్ ఇస్తాడు. కొత్త నెయిల్స్ పెట్టుకుంటే అదొక ఎగ్జయిట్‌మెంట్.. షైన్ అవుతుంది చూడవా అని అందరికీ చూపించొచ్చు అంటుంది. అయితే నెయిల్స్ కంటే మీ ఫేసే ఎక్కువగా షైన్ అవుతోందని అవినాష్ అనడంతో ఈ డైలాగ్ ఎంతమందికి చెబుతారని మనోజ్ పంచ్ పేలుస్తాడు.
తమిళంలో, తెలుగులో సేమ్ రోల్ చేస్తున్నారు.. రెండు భాషల్లో ఎక్కడ బాగుందని శ్రీముఖి అడగటంతో రెండు కళ్లలో ఏ కన్ను బాగుందంటే ఏం చెప్పను అని అనీలా శ్రీకుమార్ తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. మీరందరూ ఓకే కానీ నేను ఎదురుచూస్తున్న ఈ వీరుడు ఎక్కడ అని బాలుని వెతుకుతుంది శ్రీముఖి. ఇంతలో మీనాను వెంటపెట్టుకుని ఎంట్రీ ఇస్తాడు బాలు. వారిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే శ్రీముఖి ముఖం మాడిపోయింది. మీ జంటకు ఎవ్వరి దిష్టం తగలొద్దంటూ శ్రీముఖిని ఆడుకుంటాడు అవినాష్. అయితే బాలు- మీనాలను మీరెప్పుడూ ప్రేమగా ఉన్నప్పుడే చూశారు.. కానీ ఈసారి మాత్రం ఒకరితో ఒకరు పోటీపడితే ఎలా ఉంటుందో చూద్దామని టాస్క్ ఇస్తుంది శ్రీముఖి. దాంతో బాలుకి ఒక పువ్వు ఇస్తుంది మీనా. అది చూసిన శ్రీముఖి షాక్ అవుతుంది.
మనం ఎంత పోటీ పడమన్నా వాళ్లు ఆల్రెడీ ప్రేమించుకుంటున్నారని అంటాడు ఎక్స్‌ప్రెస్ హరి. అయితే ఇదంతా కాదు.. నేను కావాలో? మీనా కావాలో తేల్చేయాలని శ్రీముఖి నిలదీస్తుంది. బాలు మాత్రం మరో ఆలోచన లేకుండా మీనా గారు అనడంతో అవినాష్, హరిలు గోలగోల చేస్తారు. అది చూసి నవ్వుకుంటున్న మీనాని.. ఇలాంటివి చూస్తే నీకు బాగా నవ్వొస్తుంది కదా అని ఆటపట్టిస్తుంది శ్రీముఖి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బాలు- మీనాలను విడదీసేందుకు శ్రీముఖి ఎలాంటి ప్రయత్నాలు చేసింది? స్టేజ్‌పై గుండెనిండా గుడిగంటలు టీమ్ చేసిన సందడి తెలియాలంటే ఈ ఆదివారం ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో చూసేయాల్సిందే.


Click it and Unblock the Notifications


