కష్టానికి ఫలితం.. సొంత ఇంట్లో అడుగుపెట్టిన బుల్లితెర కమెడియన్!

సొంత ఇల్లు అనేది దాదాపు ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో ఏళ్లు కష్టపడుతుంటారు. అలాంటి కలనే ఇప్పుడు బుల్లితెర నటుడు, కమెడియన్, రైటర్ ఎక్స్‌ప్రెస్ హరి నిజం చేసుకున్నారు. ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితంగా కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బుల్లితెర ప్రముఖుల సమక్షంలో ఘనంగా గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా సొంతింటి గురించి వివరిస్తూ హరి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం పోస్ట్ చేశారు?

Also Read
OTT Releases This Week: 'పెద్ది' నుంచి 'ఇక్కా' వరకు.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!
OTT Releases This Week: 'పెద్ది' నుంచి 'ఇక్కా' వరకు.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!

ఎక్స్‌ప్రెస్ హరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టాండ్‌అప్ కమెడియన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ సినీ, టెలివిజన్ రంగంలో అడుగుపెట్టారు. 'పటాస్'కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. అనంతరం 'జబర్దస్త్'లో తన కామెడీతో మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం స్టార్ మా,ఈటీవీ, జీ తెలుగు వంటి ప్రముఖ ఛానళ్లలో ప్రసారమవుతున్న పలు షోలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

Recommended For You
ఆ విషయంలో చాలా భయపడ్డా.. అఖిల్‌పై నాగార్జున కామెంట్స్
ఆ విషయంలో చాలా భయపడ్డా.. అఖిల్‌పై నాగార్జున కామెంట్స్
Express Hari Buys New House

ముఖ్యంగా 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం', 'కుక్ విత్ జాతిరత్నాలు' వంటి కార్యక్రమాల్లో హరి పాల్గొంటున్నారు. ఈ షోల్లో హరి చేసే కామెడీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. నటుడిగా మాత్రమే కాకుండా షోల కోసం స్క్రిప్ట్‌లు, పంచ్ డైలాగ్స్ రాసే రైటర్‌గా కూడా తన ప్రతిభను చాటుకుంటున్నాడు. టెలివిజన్ రంగంలో అతనికి చాలా డిమాండ్ ఉంది. దీని కారణంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు.

You May Also Like
ఆ సినిమా వల్ల భారీ నష్టం.. అన్నపూర్ణ పక్కన అర ఎకరం అమ్మేశా: రాజేంద్రప్రసాద్
ఆ సినిమా వల్ల భారీ నష్టం.. అన్నపూర్ణ పక్కన అర ఎకరం అమ్మేశా: రాజేంద్రప్రసాద్

కలల ఇంట్లోకి అడుగుపెట్టిన హరి
ఇన్నేళ్ల కష్టానికి గుర్తుగా హైదరాబాద్‌లో ఒక అందమైన మూడు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కొత్త ఇంట్లో గృహప్రవేశ వేడుక నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు సన్నిహిత మిత్రులు,ఇండస్ట్రీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై హరికి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో హరి తన కొత్త ఇంటి గురించి చెబుతూ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

దీపికా పదుకొణె బాటలో కాజల్ అగర్వాల్ .. అలా చేయలేనంటూ..
దీపికా పదుకొణె బాటలో కాజల్ అగర్వాల్ .. అలా చేయలేనంటూ..

హరి తన పోస్టులో "సొంత ఇల్లు.. ఇది నాలుగు పునాదుల మీద కట్టిన మూడు గదుల ఇల్లు మాత్రమే కాదు.. ఒక మధ్యతరగతి వాడి ఎన్నో ఆశలతో నిండిన కల. దాచుకున్న ప్రతి రూపాయికి, పడిన ప్రతి కష్టానికి ఫలితం. నాది అని చెప్పుకోవడానికి జీవితానికి ఒక చిరునామా. సాధించాం అనే సంతోషం, సంపాదించుకున్న గౌరవం. ఇవన్నీ కలిసి ఒక అందమైన జ్ఞాపకంగా మారిందే సొంతిల్లు. ఇప్పుడు అది నా జీవితంలోకి వచ్చింది. ఈ ఇంట్లో వేసిన ప్రతి అడుగు ఆశీర్వాదంగా మారింది. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ, అలాగే శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అభిమానం, ఆశీర్వాదం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను" అని ఎమోషనల్ గా రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Allu Arjun rejected movies: అల్లు అర్జున్ వదిలిస్తే బ్లాక్‌బస్టరేనా? ఆ సెంటిమెంట్ ఎన్టీఆర్‌కు కలిస్తుందా?
Allu Arjun rejected movies: అల్లు అర్జున్ వదిలిస్తే బ్లాక్‌బస్టరేనా? ఆ సెంటిమెంట్ ఎన్టీఆర్‌కు కలిస్తుందా?

హరి నూతన గృహప్రవేశ వేడుకకు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, కమెడియన్ అవినాష్, యాంకర్ శ్రీముఖి, అషూ రెడ్డి, శివజ్యోతితో పాటు హరికి సన్నిహితులైన మరికొందరు ఆర్టిస్టులు పాల్గొని కొత్త ఇంటికి శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Nagabandham Day 3 Collections: వీకెండ్‌లో పుంజుకున్న 'నాగబంధం' కలెక్షన్స్.. విరాట్ కర్ణ మూవీకి ఎన్ని కోట్లంటే?
Nagabandham Day 3 Collections: వీకెండ్‌లో పుంజుకున్న 'నాగబంధం' కలెక్షన్స్.. విరాట్ కర్ణ మూవీకి ఎన్ని కోట్లంటే?

బిగ్ బాస్‌లో హరి?
ఇక మరోవైపు ఎక్స్‌ప్రెస్ హరి పేరు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్ల జాబితాలో కూడా వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా హరి ఈ సీజన్‌లో పాల్గొంటారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ హరి నిజంగానే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే, తన కామెడీ టైమింగ్ తో ఎంతగానో అలరిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.సొంతింటి కలను నెరవేర్చుకోవడంతో పాటు కెరీర్‌లో కూడా మరిన్ని విజయాలు అందుకోవాలని హరికి అభిమానులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X