కలర్స్ స్వాతి రెండో పెళ్లి.. సైలెంట్‌గా తెలుగు దర్శకుడితో మూడు మూళ్లు!

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు 'కలర్స్ స్వాతి'. నటి స్వాతి రెడ్డి యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. ఆమె తాజాగా రెండోసారి వివాహం చేసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి మరెవరో కాదు, తాను చివరిసారిగా నటించిన 'మంత్ ఆఫ్ మధు' సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ నాగోటి. ఈ విషయాన్ని స్వాతి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

Also Read
Nagabandham Day 6 Collections: కొట్టుమిట్టాడుతున్న'నాగబంధం'.. 6 రోజుల్లో కేవలం ఇంతేనా?
Nagabandham Day 6 Collections: కొట్టుమిట్టాడుతున్న'నాగబంధం'.. 6 రోజుల్లో కేవలం ఇంతేనా?

స్వాతి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫొటోలను పంచుకుంటూ " Hitched"అంటూ శ్రీకాంత్ నాగోటిని ట్యాగ్ చేశారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఒక్కసారిగా ఈ ఫొటోలు షేర్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సాదాసీదాగా ఈ వివాహ వేడుక జరిగినట్లు ఫొటోలు చూస్తే తెలుస్తోంది.

Colors Swathi Marries Director Srikanth Nagothi

స్వాతి.. 'కలర్స్' కార్యక్రమంతో యాంకర్‌గా తెలుగు వెండితెర ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ షో సక్సెస్ కావడంతో ఆమెకు 'కలర్స్ స్వాతి' అనే పేరు స్థిరపడిపోయింది. ఆ ఫేమ్ తో 'డేంజర్' అనే సినిమాతో నటిగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇక 'అష్టాచమ్మా' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తర్వాత 'స్వామి రారా', 'గోల్కొండ హైస్కూల్', 'కార్తికేయ', 'పంచతంత్రం', 'అప్పల్రాజు' వంటి చిత్రాలతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

Recommended For You
వారణాసి మూవీపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.. గ్లింప్స్ ఆలస్యానికి కారణమదే అంటూ..
వారణాసి మూవీపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.. గ్లింప్స్ ఆలస్యానికి కారణమదే అంటూ..

ఇక స్వాతి వ్యక్తిగత జీవితం విషయాన్ని వస్తే.. 2018లో కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసును ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ సమయంలో కొంతకాలం విదేశాల్లో ఉన్నారు. అయితే ఆ తర్వాత 'మంత్ ఆఫ్ మధు' అనే సినిమాతో మళ్లీ నటిగా రీఎంట్రీ ఇచ్చారు. అయితే.. ఆ సినిమా విడుదల సమయంలోనే స్వాతి వ్యక్తిగత జీవితంపై పలు వార్తలు వినిపించాయి.

భర్త వికాస్ వాసుతో విభేదాలు వచ్చాయని, ఇద్దరూ విడిపోయారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంపై స్వాతి నేరుగా స్పందించలేదు. తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగానే ఉంచారు. ఇప్పటివరకు ఆమె మొదటి వివాహం, విడాకులపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు.

You May Also Like
పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతి.. చివరి కోరిక నెరవేరకుండానే అనంతలోకాలకు..
పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతి.. చివరి కోరిక నెరవేరకుండానే అనంతలోకాలకు..

ఇప్పుడు అదే 'మంత్ ఆఫ్ మధు' చిత్ర దర్శకుడు శ్రీకాంత్ నాగోటిని వివాహం చేసుకోవడం విశేషం. సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారిందనీ, ఇప్పుడు వివాహ బంధానికి దారితీసిందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. యితే తమ ప్రేమకథ గురించి స్వాతి లేదా శ్రీకాంత్ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

రామ్ చరణ్ నుంచి రాజమౌళి వరకు.. టాలీవుడ్ స్టార్స్‌పై వేణు స్వామి జోస్యం..
రామ్ చరణ్ నుంచి రాజమౌళి వరకు.. టాలీవుడ్ స్టార్స్‌పై వేణు స్వామి జోస్యం..

తాను పనిచేసిన దర్శకుడిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.పెళ్లి వార్త బయటకు వచ్చిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి పెళ్లి తరువాత నటిగా సినిమాలో నటిస్తుందా? లేదా? అనే విషయం కూడా చర్చనీయంగా మారింది. మొత్తానికి కలర్ స్వాతి రెండో పెళ్లి విషయం మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X