Janaki Kalaganaledu Weekly Roundup: హ్యాపీగా ఉన్న సమయంలోనే మరో కష్టంలో జానకి.. మరో ట్విస్ట్

జానకి కలగనలేదు సీరియల్ మొదట కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే మే 29 నుంచి జూన్ 2 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..

మే 29వ ఎపిసోడ్: ఆ తర్వాత జానకి పోలీస్ స్టేషన్కు వెళుతుంది. అయితే అక్కడ ఒక వ్యక్తి ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వస్తాడు. ఎంత బ్రతిమాలినప్పటికీ కూడా అతనికి సహాయం చేయరు. అయితే జానకి మాత్రం అతనికి సహాయం చేయడానికి మీ ఇంటికి వస్తాను అని చెబుతుంది.

Janaki Kalaganaledu Serial Weekly Roundup: 2023 May 29th to June 2nd Episode

ఇక ఆ తర్వాత జానకి కోసం రామచంద్ర పోలీస్ స్టేషన్ కు వస్తాడు. కానీ ఆమె ఇంకా పోలీస్ స్టేషన్ కు రాలేదు అని చెప్పడంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. జానకికి వెంటనే ఫోన్ చేసినప్పటికీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు. అయితే జానకి ఫోన్ ఒక దగ్గర పడిపోయి ఉంటుంది. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

మే 30వ ఎపిసోడ్: ఏ మనిషి అయినా సరే అనుకున్న లక్ష్యాన్ని చేధించే వరకు వెనుకడుగు వేయకూడదు అని కొన్నిసార్లు కింద పడిన కూడా పైకి లేచి మళ్ళీ పరిగెత్తాలి అని ఎంతో ధైర్యంగా చెబుతుంది. ఇక ఆమె మాటలు విన్న యువతీ గది తలుపులు తెరిచి బయటకి వస్తుంది. మీ అమ్మ నాన్న కోసం నువ్వు బ్రతకాలి అని వారికోసం కష్టపడు అని మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకు అని చెప్పి జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే జానికి అలా వెళ్ళిపోతున్న సమయంలోనే ఆమెను ఇద్దరు గుండాలు కిడ్నాప్ చేస్తారు ఒక ప్లేస్ లో ఉంచి ఆమెను ఇబ్బంది పెట్టాలని చూస్తారు.

Janaki Kalaganaledu Serial Weekly Roundup: 2023 May 29th to June 2nd Episode

కానీ జానకి ఏమాత్రం భయపడకుండా వారికి సమాధానం చెబుతుంది. అయితే జానకి పోలీస్ అని చూసి ధైర్యంగా మాట్లాడుతుంది అని ఆ డ్రెస్ తీసేస్తే సరిపోతుంది అంటూ వెటకారంగా గుండాలు మాట్లాడుతుంటారు. ఇక ఆ ప్రయత్నాలు చేస్తూ ఉండగా జానకి వారిని చితకబాదలని ప్రయత్నం చేస్తుంది. ఇక మరోవైపు రామచంద్ర జానకిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. కానీ ఆమె జాడ మాత్రం తెలియదు. మరోవైపు జానకి తల్లి అయినట్లు నిర్ధారణ అవుతుంది. మరి ఈ సమస్యల నుంచి ఆమె ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే తదుపరి ఎపిసోడ్లో చూడాల్సిందే. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

మే 31వ ఎపిసోడ్: ఇక జానకి రామచంద్ర వారి గదిలోకి వెళ్ళగానే ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. పుట్టబోయే బిడ్డ కోసం వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే జానకి మాత్రం తాను తల్లి అయిన విషయాన్ని మాత్రం ఇంకా చెప్పదు. పూర్తిగా డాక్టర్ నిర్ధారించిన తర్వాతనే నిజం చెప్పాలని అనుకుంటుంది. ఇక అప్పుడే రామచంద్ర చెల్లెలు వచ్చి వారికి ఆవకాయ అన్నం ఇస్తుంది. మీ ఇద్దరూ తినిపించుకోండి అంటూ చెప్పి వెళ్ళిపోతుంది. ఇక రామచంద్ర ఎంతో ప్రేమగా జానకి కి ముద్దలు పెట్టి తినిపిస్తూ ఉంటాడు.

Janaki Kalaganaledu Serial Weekly Roundup: 2023 May 29th to June 2nd Episode

ఇక భర్త ప్రేమను చూసిన జానకి ఎంతగానో సంబరపడిపోతూ ఉంటుంది. మరోవైపు జానకి త్వరగా తల్లి అయితే బాగుండు అని అత్తగారు కూడా చాలా బెంగపెట్టుకుని ఉంటారు. సరిగ్గా భోజనం కూడా చేయదు. మరోవైపు జానకి పై రివెంజ్ తీర్చుకోవాలి అని ఎస్సై మనోహర్ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇద్దరు రౌడీలు కూడా అతను పంపించిన వారే. ఇక మరో ప్లాన్ వేయాలి అని అనుకుంటాడు. ఇక జానకి తల్లి అయినట్లుగా డాక్టర్ నిర్ధారిస్తుంది. మరి ఆ విషయాన్ని ఆమె భర్తకు ఎలా వివరిస్తుందో చూడాలి. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

జూన్ 1వ ఎపిసోడ్: ఎంతోమంది తనను ఎన్నో రకాలుగా తిట్టారు అని, పిల్లలు పుట్టలేదు అని హేళన చేశారు అని ఇప్పుడు ఆ సంతోషాన్ని నెరవేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని దేవుడికి చెప్పుకుంటుంది. అయితే జానకి పై రివేంజ్ తీర్చుకోవడానికి మరోవైపు ఎస్ఐ మనోహర్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను మరోసారి రౌడీలని పిలిపించి జానకి పై దాడి చేయించాలని అనుకుంటాడు. ఇక జానకి అలా వెళుతుండగా పక్కనే ఒక షాప్ చూసి ఒక ఫ్యామిలీ బొమ్మ కొనాలని దాని ద్వారా రామచంద్ర గారికి అసలు విషయం చెప్పాలి అని అనుకుంటుంది.

Janaki Kalaganaledu Serial Weekly Roundup: 2023 May 29th to June 2nd Episode

ఇక జానకి ఆ ఫోటో తీసుకొని వెళుతూ ఉండగా అప్పుడే ఎస్ఐ మనోహర్ పంపించిన ఇద్దరు రౌడీలు జానకిని కత్తితో పొడవడానికి ప్రయత్నిస్తారు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోతుంది. తలకు బలంగా గాయం కూడా అవుతుంది. ఇక జానకి తృటిలో తప్పించుకోవడంతో అందరూ కూడా ఆమెకు సహాయం చేస్తారు కానీ రౌడీలు మాత్రం అక్కడి నుంచి పారిపోతారు. మరి జానకి తన అనుకున్న గుడ్ న్యూస్ ను తన భర్తకు ఏ విధంగా చెబుతుంది అనేది తదుపరి ఎపిసోడ్లో చూడాలి. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X