13 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులు.. టెలివిజన్ యాక్టర్‌కు భయంకర అనుభవం

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న లాకప్ సీజన్ 2 సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్‌గా పాల్గొంటున్న వారు తమ వ్యక్తిగత జీవితంలోని రహస్యాలను ఒక్కొక్కటిగా బయటపెడుతూ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఆకాంక్ష చమోలా, సునీత అహుజా, శిల్పా షిండేలు తమ వ్యాఖ్యలతో దుమారం రేపుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి బుల్లితెర నటుడు రామ్ కపూర్ చేరారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
తమన్నా భాటియా గ్లామర్ ట్రీట్... వల లాంటి డ్రెస్‌లో కుర్రాళ్లని అలా ట్రాప్!
తమన్నా భాటియా గ్లామర్ ట్రీట్... వల లాంటి డ్రెస్‌లో కుర్రాళ్లని అలా ట్రాప్!

రామ్ కపూర్.. హిందీ సినిమా, బుల్లితెర రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. పంజాబ్‌కు చెందిన ఈ నటుడు న్యాయ్ సీరియల్ ద్వారా హిందీ బుల్లితెర ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత హీనా, సంఘర్ష్, కవిత, ఘర్ ఏక్ మందిర్, రిస్తే, కబి అయే నా జుడాయ్, కసమ్ సే, బసేరా, తదితర సీరియల్స్‌తో కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. సీరియల్స్‌తో పాటు పలు హిందీ సినిమాలలో తనదైన నటనతో అలరించారు రామ్ కపూర్.

Lock Upp Season 2 Ram Kapoor reveals horrifying incident when he was 13

మాన్‌సూన్ వెడ్డింగ్ మూవీతో హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత మిస్డ్ కాల్, దేవకి, ఉదాన్, ఏజెంట్ వినోద్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, మేరే దాదాకీ మారుతి, రఫ్ బుక్, లవ్ యాత్రి, తప్పాడ్, ది బిగ్‌బుల్, యుధ్రా, జాలీ ఎల్ఎల్‌బీ 3 సినిమాలలో నటించారు. మూడు దశాబ్ధాల కెరీర్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హిందీ బుల్లితెర నటుడిగా, ఇండియాలో టాప్ యాక్టర్స్‌లో ఒకడిగా నిలిచారు. ఘర్ ఏక్ మందిర్ సీరియల్‌లో తనతో కలిసి నటించిన గౌతమి గద్గిల్‌తో ప్రేమలో పడిన రామ్ కపూర్.. 2003 ఫిబ్రవరి 14వ తేదీన ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

Recommended For You
చీరలో దీప్తి సునైన గ్లామర్ షో... తొలకరి చినుకుల్లో తడుస్తూ అలా కవ్వింపులు..
చీరలో దీప్తి సునైన గ్లామర్ షో... తొలకరి చినుకుల్లో తడుస్తూ అలా కవ్వింపులు..

సీరియల్స్‌, సినిమాలతో పాటు బుల్లితెరపై పలు రియాలిటీ షోలలో రామ్ కపూర్ పాల్గొన్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న లాకప్ సీజన్ 2లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. ఈ రియాలిటీ షో ప్రారంభమైన నాటి నుంచి షో నిబంధనల ప్రకారం కంటెస్టెంట్స్ తమ జీవితంలో ఎవరికీ తెలియని రహస్యాలను బయటపెట్టాల్సి ఉంది. ఈ టాస్క్‌లో భాగంగా రామ్ కపూర్ మాట్లాడుతూ.. తాను 13 ఏళ్ల వయసులో సీనియర్ విద్యార్ధి చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పి బాంబు పేల్చాడు.

You May Also Like
100 కోట్ల ఇంటిలో మూడో భార్యతో ఆమీర్‌ ఖాన్ కొత్త కాపురం? లగ్జరీ విల్లా ఫీచర్స్ ఇవే!
100 కోట్ల ఇంటిలో మూడో భార్యతో ఆమీర్‌ ఖాన్ కొత్త కాపురం? లగ్జరీ విల్లా ఫీచర్స్ ఇవే!

నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్ ముగిసిన తర్వాత హాస్టల్‌లోని డార్మిటరీలో మాట్లాడుకునేవాళ్లం. ఓ రోజున 10వ తరగతి చదువుతున్న ఓ సీనియర్ విద్యార్ధి నా బెడ్‌పై కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంతలో అకస్మాత్తుగా అతను దుప్పటిలోకి చేతులు పెట్టి నన్ను అసభ్యంగా తాకాడు. ఆ సమయంలో డార్మిటరీలో కనీసం 30 నుంచి 40 మంది పిల్లలు ఉన్నారు. ఊహించని పరిణామంతో నేను బిగుసుకుపోయాను. కానీ ఏం చేయలేక మౌనంగా ఉండిపోయా.. ఆ సీనియర్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయాడు.

మహేశ్‌బాబు మించి గౌతమ్.. ఒడిస్సీ ప్రీమియర్‌లో స్టైలిష్ లుక్‌తో ఘట్టమనేని వారసుడు అదుర్స్!
మహేశ్‌బాబు మించి గౌతమ్.. ఒడిస్సీ ప్రీమియర్‌లో స్టైలిష్ లుక్‌తో ఘట్టమనేని వారసుడు అదుర్స్!

కాసేపటికీ ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని ఇలాంటి పనులు తనకు నచ్చవని చెప్పడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ ఈ సంఘటనతో మానసికంగా కృంగిపోవడంతో పాటు ఎంతో చలాకీగా ఉండే నేను ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాను. కొద్దిరోజుల తర్వాత ఆ సీనియర్ నా దగ్గరికి వచ్చి క్షమాపణలు అడిగాడు, ఎప్పుడు ఎదురుపడినా నా ముందు పశ్చాత్తాపపడుతూ నన్ను బాధలో నుంచి కోలుకునేలా సాయం చేశాడు. అనంతరం మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాము. ఈ రహస్యం 40 ఏళ్లుగా నా పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా తెలియదు. కేవలం నా భార్య గౌతమికి మాత్రమే చెప్పా, జరిగిన దానిలో అతని పొరపాటు ఉందో లేదో పక్కనపెడితే.. టీనేజ్‌లో హార్మోన్ల ప్రభావం వల్లే అతను అలా ప్రవర్తించి ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ఏ బిడ్డకు ఇలాంటి పరిస్ధితి ఎదురవ్వకూడదని రామ్ కపూర్ వ్యాఖ్యానించారు.

'నా భర్తకు 50 మందితో అఫైర్.. అయినా వదిలిపెట్టను’
'నా భర్తకు 50 మందితో అఫైర్.. అయినా వదిలిపెట్టను’

ఆయన మాటలతో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ భావోద్వేగానికి గురయ్యారు. సూఫీ మోతీవాలా, హోర్షట్ చోప్డే, ధీరజ్ ధూపర్ కంటతడి పెట్టారు. స్వయంగా హోస్ట్ ఫరా ఖాన్.. రామ్‌ను దగ్గరికి తీసుకుని ఓదార్చారు. రితేష్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. నువ్వు చాలా ధైర్యవంతుడివి, నిన్ను చూసి గర్వపడుతున్నానని ప్రశంసించారు. ఇక లాకప్ సీజన్ 2 రెండు వారాలు పూర్తి చేసుకోగా ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. అనారోగ్య కారణాలతో సునీతా అహుజా, తక్కువ ఓట్లు రావడంతో రియాజ్ తప్పుకున్నారు. డేంజర్ జోన్‌లో ఉన్న శ్రేయా కల్రా తృటిలో తప్పించుకున్నారు.

Read more about: lock upp ram kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X