Ramayana Trailer Review: 'రామాయణ' ట్రైలర్‌పై అట్లీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవిపై కామెంట్స్!
Ramayana Trailer Review: రామాయణం ఆధారంగా రూపొందిన తాజా హిందీ సినిమా 'రామాయణ'. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఈ ఏడాది దీపావళికి 'రామాయణ: పార్ట్ 1', వచ్చే ఏడాది దీపావళికి 'రామాయణ: పార్ట్ 2'విడుదల కానున్నాయి. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటించారు. ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్నారు.
ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన ట్రైలర్ ను 'ప్రథమ్ సంకల్ప్' ట్రైలర్‌ను ప్రత్యేక కార్యక్రమంలో ప్రదర్శించారు. అధికారికంగా ఆన్‌లైన్‌లో విడుదల కాకముందే ఈ ట్రైలర్‌ను చూసిన పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా స్టార్ దర్శకుడు అట్లీ కూడా తన రివ్యూను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే?

అట్లీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. 'రామాయణ' ట్రైలర్ చూసి పూర్తిగా ఆశ్చర్యపోయాను"అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మొదటగా నిర్మాత నమిత్ మల్హోత్రాను విజన్ ను ప్రశంసించారు. దర్శకుడు నితేష్ తివారీ అద్భుతమైన పనితనం కనబర్చారని కొనియాడారు. అలాగే యష్ గురించి ప్రత్యేకంగా అట్లీ ప్రస్తావించారు. "యష్ చాలా పవర్‌ఫుల్‌గా, భయంకరమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కనిపిస్తున్నారు" అని అన్నారు. హీరో రణ్‌బీర్ కపూర్ అద్భుతంగా కనిపించారని, ఆయన లుక్ ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు.
ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. "ఆమెలో దివ్యత్వం కనిపిస్తోంది. తెరపై ఆమె ప్రెజెన్స్ ఎంతో అందంగా ఉంది" అని ప్రశంసించారు. ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్ గ్రాండ్‌గా, కొత్తదనంతో, మాయాజాలంలా అనిపించిందని అట్లీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చివరగా 'రామాయణ' మూవీ మేకర్స్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. ఇది నిజంగా ఓ ఎపిక్ సినిమా లా కనిపిస్తోంది'అంటూ అట్లీ ప్రశంసలు కురిపించారు. స్టార్ దర్శకుడు అట్లీ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు కూడా 'రామాయణ' ట్రైలర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
జూలై 24న ట్రైలర్ రిలీజ్
ప్రస్తుతం 'రామాయణ' ట్రైలర్‌ను ప్రత్యేక ప్రివ్యూ ఈవెంట్‌లో మాత్రమే ప్రదర్శించారు. అధికారికంగా యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా వేదికల్లో జూలై 24న విడుదల చేయనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అట్లీ 'రాకా'తో బిజీ
అట్లీ విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా 'రాకా'అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణం కోసం దాదాపు 800 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో దీపికాతో పాటు మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ వంటి స్టార్ట్ హీరోయిన్స్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇప్పటివరకు అధికారిక ప్రకటించలేదు. అయితే రీసెంట్ గా 'మిన్నల్ మురళి' ఫేమ్ ఫెమినా జార్జ్ ఇందులో నటిస్తున్నట్లు టీం ప్రకటించింది. బుల్లితెర పాపులర్ నటి మన తెలుగమ్మాయి సిరి హన్మంత్ కూడా ఇందులో నటిస్తున్నట్లు రీసెంట్ గా ప్రొడ్యూసర్ SKN లీక్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications




