మూడేళ్లు వాడితో రిలేషన్‌లో... బ్రేకప్‌కు కారణం అదే.. సుప్రీత

కొందరు సెలబ్రిటీల పిల్లలకు పుట్టుకతోనే స్టార్ స్టేటస్ వస్తుంది. ఈ కోవలోకే వస్తుంది టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత. తల్లితో కలిసి ఈ ముద్దుగుమ్మ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. భర్త చనిపోవడంతో కూతురే ప్రాణంగా బతుకుతున్నారు సురేఖ. వీరిద్దరూ తల్లీకూతుళ్లలా కాకుండా అక్కాచెల్లెళ్లు, ఫ్రెండ్స్‌లా ఉంటారు. ఒకరికోసం ఒకరు అన్నట్లుగా తమ జీవితాన్ని సాగిస్తున్నారు. కూతురిని నటిగా నిలబెట్టేందుకు సురేఖ వాణి ఎంతో శ్రమిస్తున్నారు. స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో తన లవ్‌స్టోరీ, బ్రేకప్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సుప్రీత. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
షూటింగ్‌లో విషాదం.. ఆ న్యూస్‌తో హృదయం ముక్కలు.. తనూజ కంటతడి
షూటింగ్‌లో విషాదం.. ఆ న్యూస్‌తో హృదయం ముక్కలు.. తనూజ కంటతడి

సురేఖ వాణి- సురేష్ కుమార్తెగా సినీ ప్రపంచానికి, ప్రేక్షకులకు చాలా చిన్న వయసులోనే పరిచయమయ్యారు సుప్రీత. భర్త మరణంతో అన్నీతానే అయి కూతురిని పెంచింది సురేఖ. చదువు తర్వాత తల్లిదండ్రుల బాటలోనే సినీ రంగం వైపు అడుగులు వేశారు సుప్రీత. 2019లో మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో తనదైన నటనతో, గ్లామర్‌తో కుర్రాళ్లను ఆకట్టుకుంది. అనంతరం అవర్స్ వర్సెస్ అదర్స్, వెళ్లిపో, గాయత్రి పోతే పోవే అనే కవర్ సాంగ్‌లతో అలరించింది. ఇవి సూపర్‌ హిట్ కావడంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Surekha Vani s Daughter Supritha Opens Up About Toxic Relationship on Sreemukhi s Show

లేచింది మహిళా లోకం, చౌదరిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనే సినిమాల లోనూ ఆమె నటించారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుప్రీత.. తన వ్యక్తిగత విశేషాలు, తల్లితో కలిసి చేసే వీడియోలు, డ్యాన్స్, రీల్స్ అప్‌‌లోడ్ చేస్తుంటారు. దాంతో సురేఖవాణి- సుప్రీతలపై దారుణంగా ట్రోలింగ్ జరిగేది. వీటికి మొదట్లో రియాక్ట్ అయినప్పటికీ తర్వాత వీరిద్దరూ పట్టించుకోవడం మానేశారు. అయితే ఇటీవల బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ చేయడంతో సుప్రీత వివాదంలో ఇరుక్కుంది. అయితే తప్పయి పోయిందంటూ క్షమాపణలు చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. వివాదానికి తెరదించారు. ఇంకెప్పుడూ ఇలాంటి బ్రాండ్స్‌కు ప్రమోషన్స్ చేయనని సుప్రీత స్పష్టం చేశారు.

Recommended For You
టార్చర్ చేసి.. తెలుగులో నాపై అలా బ్యాన్.. పల్లవి గౌడ షాకింగ్ కామెంట్స్
టార్చర్ చేసి.. తెలుగులో నాపై అలా బ్యాన్.. పల్లవి గౌడ షాకింగ్ కామెంట్స్

సుప్రీత ప్రేమ, పెళ్లిపై గతంలో పలు రూమర్స్ వచ్చాయి. తాజాగా తన రిలేషన్స్‌పై ఆమె ఓపెన్ అయ్యారు. ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వీక్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా విచ్చేశారు. వారం వారం స్పెషల్ థీమ్‌తో బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేస్తుంటారు. ఫ్రెండ్‌షిప్ డేను పురస్కరించుకుని ఈ వారం సరికొత్తగా రెడీ అయ్యింది. సెలబ్రిటీలు తమ బెస్ట్ ఫ్రెండ్స్‌తో కలిసి ఈ షోకు వచ్చారు. దీనిలో భాగంగా తన బెస్ట్ ఫ్రెండ్, యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహాతో కలిసి శ్రీముఖి షోకు వచ్చింది సుప్రీత. ఇదే షోకు హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీగౌరీ ప్రియలు తమ చెన్నై లవ్ స్టోరీ ప్రమోషన్స్‌లో భాగంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గెస్ట్‌లను వారి ఫస్ట్ లవ్ స్టోరీస్ గురించి అడుగుతూ ఒక్కొక్కరి పోస్టర్‌ను స్క్రీన్ పై ప్రదర్శించింది శ్రీముఖి.

You May Also Like
The India Story Movie Twitter Review: ది ఇండియా స్టోరీ మూవీ ట్విట్టర్ రివ్యూ
The India Story Movie Twitter Review: ది ఇండియా స్టోరీ మూవీ ట్విట్టర్ రివ్యూ

ఇంతలో సుప్రీత వంతు వచ్చింది.. మణికొండ లవ్‌స్టోరీ అంటూ ఓ పోస్టర్ ప్రదర్శించింది. దాంతో తన ప్రేమకథను బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.. తనతో మూడేళ్లు రిలేషన్‌లో ఉన్నా, కానీ వాడు చాలా టాక్సిక్‌లా ఉండేవాడు. ఇండస్ట్రీకి వెళ్లొద్దు.. నువ్వు ఆ బట్టలు వేసుకోకు, ఇలా ఉండాలి అనేవాడు అని సుప్రీత చెబుతుండగా ఇంతలో నిఖిల్ జోక్యం చేసుకుని మొత్తం చెప్పేయొద్దురా, టెలికాస్ట్ అవుతుందని అలర్ట్ చేశాడు. దాంతో అంతా నవ్వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా .. అయితే సుప్రీత బ్రేకప్ గురించి పరోక్షంగా వివరాలు బయటపెట్టినట్లయ్యింది. ఆమె ప్రేమించిన వ్యక్తి ఎవరు? అంతలా ఎందుకు వేధించాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: surekha vani supritha sreemukhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X