Karthika Deepam 2లో కొత్త విలన్.. ఎవరీ మాలిని? దక్షిణామూర్తి కోడలి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
స్టార్ మాలో సూపర్‌హిట్ సీరియల్‌గా దూసుకెళ్తోంది కార్తీక దీపం 2. గతంలో వచ్చిన కార్తీక దీపంకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ ధారావాహిక అదే ట్విస్టులు, కథనంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కార్తీక దీపం ముందు సీజన్‌లో కేవలం కార్తీక్ బాబు, వంటలక్క మాత్రమే ఉన్నప్పటికీ కొత్త నటీనటులు కూడా అదే స్థాయిలో మెప్పిస్తున్నారు. కార్తీక్ కోసం జ్యోత్స్న, దీపలు ఇప్పటి వరకు కొట్టుకుంటూ ఉండగా.. కథలో కొత్త విలన్‌గా మాలిని దేవి ఎంట్రీ ఇచ్చింది? ఆమె ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ? అనేది పరిశీలిస్తే..
తన బావని తనకు కాకుండా చేసిన దీపపై పగ తీర్చుకుంటూ వచ్చిన జ్యోత్స్నకి దీపే సుమిత్ర- దశరథల కూతురు అని తెలిసినప్పటి నుంచి కథ అనూహ్య మలుపులు తిరుగుతోంది. కార్తీక్‌ని అగ్రిమెంట్ పేరుతో సీఈవో పోస్ట్ నుంచి తప్పించి తన ఇంటిలో జీతం లేని పాలేరుగా వాడుకుంటూ వస్తోంది జ్యోత్స్న. అంతలో దీపే తన కూతురని దశరథకు తెలిసింది, అలాగే జ్యోత్స్న నెల రోజుల్లో పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకోకపోతే ఆస్తి మొత్తం కార్తీక్ కుటుంబానికి చెందుతుందని దశరథ వీలునామా రాస్తాడు.

ఇంతలో శ్రీధర్‌కు హార్ట్ అటాక్ రావడంతో కంపెనీకి కొత్త సీఈవోని ఎంపిక చేయాల్సిన పరిస్ధితి వస్తుంది. ఎవరు సీఈవోగా వచ్చినా వారు శివన్నారాయణ కుటుంబ సభ్యులే కావాలని బోర్డ్ మెంబర్స్ పట్టుబట్టడంతో కంపెనీని కాపాడుకోవడం కోసం జ్యోత్స్నకి, దీపకి పోటీ పెట్టి.. దీపని సీఈవోగా చేస్తారు కార్తీక్, శివన్నారాయణ. ఈ ప్రాసెస్‌లోనే కథలోకి సూరజ్ ఎంట్రీ ఇచ్చి దీప, కార్తీక్‌లకి అన్నిరకాలుగా హెల్ప్ చేస్తూ జ్యోత్స్నకి కౌంటర్లు ఇస్తూ ఆమెను పెళ్లి చేసుకుంటానని టీజింగ్ చేస్తుంటాడు.
మధ్యలో శివన్నారాయణ పాత మిత్రుడైన దక్షిణామూర్తి రావడం.. తన కుమార్తె సుమిత్ర కోసం ఆయన తల్లడిల్లిపోతుండటం, ఆయనను పెద్దాయన శత్రువులా చూడటం జరుగుతాయి. అయితే దక్షిణామూర్తి- సూరజ్‌లు మాట్లాడుకుంటూ ఉండటంతో అతనిపై శివన్నారాయణ, కార్తీక్‌లకి అనుమానం ఉంటుంది. ఆఫీస్‌లో దీపకి అసిస్టెంట్‌గా పరిమితమైన జ్యోత్స్నను ఏడిపిస్తూ ఎప్పటికైనా నిన్ను నా భార్యను చేసుకుంటానని చెబుతాడు సూరజ్. అలా జరగాలంటే పై నుంచి ఎవరో ఒకరు దిగిరావాలని జ్యోత్స్న చెప్పగా మాలిని దేవి ఎంట్రీ ఇస్తుంది. ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టని పాత్రలో, క్రూయల్‌గా ఆమెను చూపించారు. ఈ మాలిని ఎవరో కాదు దక్షిణామూర్తి కోడలు.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి ఈ మాలిని .. స్వయంగా సూరజ్‌కి తల్లి అయ్యుండొచ్చని చెబుతున్నారు. శివన్నారాయణ కుటుంబంపై పగ సాధించడానికి తల్లీకొడుకులు జ్యోత్స్నని ట్రాప్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే నిజమైతే ఇప్పటి వరకు జ్యోత్స్నతో ఫైట్ చేసిన దీప, కార్తీక్‌లు ఇకపై నేరుగా దక్షిణామూర్తి, మాలినిలను ఢీకొట్టనున్నారు. అయితే కొత్త విలన్ మాలిని దేవి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు. రాయల్ లుక్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోన్న ఆమె ఫస్ట్ ఎపిసోడ్‌తోనే అందరినీ ఆకట్టుకున్నారు. దాంతో ఈ మాలిని ఎవరు? ఆమె పేరేంటీ? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ అనేది ఆరా తీస్తున్నారు.
ఈ మాలిని అసలు పేరు.. తేజస్విని ప్రకాష్. కర్ణాటకకు చెందిన ఈ ముద్దుగుమ్మకు బలమైన సినీ నేపథ్యం ఉంది. శాండల్‌వుడ్ స్టంట్ మాస్టర్ ప్రకాష్ కూతురే ఈ తేజస్విని. ఈమె తల్లి వినయ బుల్లితెర నటిగా పాపులర్. కన్నడ బిగ్‌బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న తేజస్విని నాలుగు వారాల పాటు హౌస్‌లో ఉన్నారు. నిహారిక, నన్నరసి రాధే అనే సీరియల్స్‌లో నటించారు ఈ ముద్దుగుమ్మ. బుల్లితెరపైనే కాకుండా గూలిహట్టి, మానసద మక్కలు, గజ, అంబుట్టు ఇంబుట్టు ఎంబుట్టు అనే కన్నడ సినిమాలతో పాటు ప్రతిక్షనం, సినిమా మహాల్ - రోజుకి 4 ఆటలు, కట్ చేస్తే అనే తెలుగు సినిమాలోనూ నటించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫణివర్మ అనే వ్యక్తిని పెళ్లాడారు తేజస్విని.. ఈ దంపతులకు ఒక పాప సంతానం. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా కెరీర్, వ్యక్తిగత జీవితాన్ని కొనసాగిస్తున్న తేజస్విని .. కార్తీక దీపం 2 సీరియల్‌లో తన మార్క్ ఎలా చూపిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications



