X
Home టాప్ లిస్టింగ్

అభిమాన కథానాయకుడు.. తిరుగులేని ప్రజానాయకుడు.. నందమూరి బాలకృష్ణ బర్త్ డే స్పెషల్..!

Author Administrator | Updated: Saturday, June 10, 2023, 08:58 AM [IST]

నంద‌మూరి తార‌క రామారావు న‌ట వార‌సుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన బాల‌కృష్ణ వైవిధ్య‌మైన పాత్ర‌లు, జోన‌ర్స్‌లో సినిమాలు చేస్తూ అగ్ర క‌థానాయ‌కుడిగా రాణిస్తున్నారు. ఒక వైపు సినిమాలు, మ‌రో వైపు రాజ‌కీయాలు, ఇంకో వైపు కాన్స‌ర్ హాస్పిటల్ పెట్టి ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నారు. ఎక్క‌డా ఏ డిస్ట్ర‌బెన్స్ లేకుండా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగ‌టం ఆయ‌న‌కే చెల్లింది. జూన్ 10న పుట్టిన‌రోజు సెల‌బ్రేట్ చేసుకోబోతున్న ఈ నంద‌మూరి న‌ట‌సింహంకు చెందిన విశేషాలు...


cover image

‘తాత‌మ్మ క‌ల’ చిత్రంతో బాల‌న‌టుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన బాల‌కృష్ణ చాలా చిత్రాల్లో న‌టించి మెప్పించారు. సాహ‌స‌మే జీవితంతో కెరీర్‌ను స్టార్ట్ చేశారు బాల‌య్య‌. అక్క‌డి నుంచి ఓ వైపు మాస్ చిత్రాలు చేస్తూనే వైవిధ్య‌మైన చిత్రాల‌కు పెద్ద పీట వేస్తూ వ‌చ్చారు. ఈ జ‌ర్నీలో ఆయ‌న‌కు ‘మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు’ చిత్రంతో తొలి బ్లాక్ బస్టర్ దక్కింది. అక్కడ నుంచి సీతారామ కళ్యాణం, అనసూయమ్మగారి అల్లుడు, మువ్వ గోపాలుడు, బాల గోపాలుడు, నారి నారి నడుమ మురారి, ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్‌, బంగారు బుల్లోడు, భైర‌వ ద్వీపం, బొబ్బిలి సింహం, వంశానికొక్క‌డు, పెద్ద‌న్న‌య్య‌, స‌మ‌ర సింహా రెడ్డి, న‌ర‌సింహ నాయుడు, సింహ‌, శ్రీరామ‌రాజ్యం, లెజెండ్‌, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, అఖండ‌, వీరసింహా రెడ్డి చిత్రాలతో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాల‌కృష్ణ త‌న స‌త్తా చాటుకున్నారు. 

సినిమాలు చేస్తూనే బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌కు ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. పేద‌ల‌కు క్యాన్స‌ర్ చికిత్స‌ను అందించ‌టంలో ఈ హాస్పిట‌ల్ చూపుతున్న చొర‌వ‌పై అంద‌రూ అప్రిషియేష‌న్స్ కురిపిస్తున్నారు. ఈ హాస్పిట‌ల్ కోసం బాల‌కృష్ణ తానే ముందుండి విరాళాల‌ను సేక‌రిస్తుంటారు. ఇవి కాకుండా ఈ ట్ర‌స్ట్ త‌ర‌పు నుంచి బ్ల‌డ్ బ్యాంక్‌ను కూడా ర‌న్ చేస్తున్నారు. 

బాల‌కృష్ణ మ‌న‌సులో ఏదీ దాచుకోరు. ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడుతారనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఇది ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌న్ని వివాదాల‌కు కేంద్ర‌బిందువుగా నిల‌బెట్టింది. బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాప‌బుల్ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో మాట్లాడే సంద‌ర్భంలో న‌ర్సు గురించి బాల‌కృష్ణ చేసిన కామెంట్స్‌పై రాష్ట్ర న‌ర్సుల సంఘం మండిప‌డింది. అయితే దానిపై ఆయ‌న త‌ర్వాత వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ త‌ర్వాత ఓఈవెంట్‌లో మాట్లాడుతున్న‌ప్పుడు అక్కినేని తొక్కినేని అని అన్నారు. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. త‌ర్వాత అక్కినేని అంటే త‌న‌కున్న అభిమానాన్ని బాల‌య్య చెప్పి క్లారిటీ ఇచ్చిన‌ప్పుడు వివాదం స‌ద్దుమ‌ణిగింది. 

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ త‌న‌108వ సినిమాను చేస్తున్నారు. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి భ‌గ‌వంత్ కేస‌రి అనే టైటిల్ ఖరారు చేస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అది కూడా ఒక‌ట్రెండు కాదు.. ఏకంగా 108 హోర్డింగ్స్‌లో టైటిల్‌ను అనౌన్స్ చేయ‌టం అనేది టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. దీని త‌ర్వాత సూర్య‌దేవర నాగ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో డైరెక్ట‌ర్ బాబీతో బాల‌కృష్ణ త‌న 109వ చిత్రాన్ని చేయ‌బోతున్నారు. బాల‌కృష్ణ బ‌ర్త్ డేకి అనౌన్స్‌మెంట్ రానుంది. త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను క్రేజీ కాంబోలో సినిమా తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం. 

నంద‌మూరి బాల‌కృష్ణ బ‌ర్త్‌డే జూన్ 10న అభిమానులు ఘ‌నంగా సెల‌బ్రేట్ చేస్తున్నారు. క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ రోగుల‌కు పండ్ల‌ను పంపిణీ చేస్తారు. అలాగే పేద‌ల‌కు అన్న‌దాన కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి. అభిమానులు ర‌క్త‌దాన శిభిరాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. 

జూన్ 10న బాల‌కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మ‌రో ట్రీట్ కూడా అంద‌నుంది. ఆయ‌న కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిన న‌ర‌సింహ‌నాయుడు చిత్రాన్ని 4కె టెక్నాల‌జీలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు రీ రిలీజ్‌ల ట్రెండ న‌డుస్తోంది. ఆ కోవ‌లో ఇప్పుడు న‌ర‌సింహ‌నాయుడు సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు 4కె లో తీసుకొస్తున్నారు. ఇప్పుడీ సినిమా ఏ రేంజ్‌లో వ‌సూళ్ల‌ను సాధిస్తుందో చూడాలి.

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+