సీనియర్ నటుడు శరత్ బాబు సోమవారం అనారోగ్య సమస్యతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 300కి పైగా తమిళ, తెలుగు చిత్రాల్లో నటించిన ఈయన హీరోగా, విలక్షణ నటుడిగా రాణించారు. అయితే నిజానికి శరత్ బాబుకి యాక్టింగ్ అంటే ఇష్టం లేదు. ఆయన ముందు యాక్టర్ కావాలనుకోలేదు.. ఆసక్తి లేకుండానే ఎంట్రీ ఇచ్చిన శరత్ బాబు అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు. ఆయన కెరీర్‌లో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నారు. అవేంటనే విషయాలను తరచి చూస్తే...