X
Home టాప్ లిస్టింగ్

రూమర్స్ కి చెక్ పెట్టిన శర్వానంద్.. వివాహం, ఎప్పుడు, ఎక్కడంటే .. !

Author Administrator | Published: Wednesday, May 17, 2023, 12:41 PM [IST]

హీరో శర్వానంద్‌ తన సింగిల్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టనున్నారు‌. రక్షితా రెడ్డితో ఆయన ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జనవరి లో నిశ్చితార్థం జరిగిన ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రానంద్ వలన వారి వివాహంపై సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ కి శర్వానంద్ ఫుల్ స్టాప్ పెట్టారు.


cover image
1

నటుడు శర్వానంద్ అధికారికంగా తన వివాహం గురించి ఒక ప్రకటన విడుదల చేసాడు. అందులో తన వివాహం, ఎప్పుడు, ఎక్కడ ఇవన్నీ ప్రకటించాడు. దీనితో శర్వానంద్ వివాహం గురించి వచ్చిన రూమర్స్, వార్తలకు ఒక స్టాప్ పెట్టినట్టు అయింది.

 

2

వీరిద్దరి పెళ్లి సంబరం రాజస్థాన్ జైపూర్ లోని లీల ప్యాలస్ జూన్ 2, 3 తేదీల్లో జరగనుంది. జూన్ 2న మెహందీ ఫంక్షన్ జరగనుంది. జూన్ 3న రాత్రి 11 గంటల సమయంలో హిందూ సాంప్రదాయ పద్దతిలో శర్వా అండ్ రక్షిత ఒకటి కానున్నారు. 

 

3

శర్వానంద్‌కు కాబోయే భార్య రక్షిత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆమె తండ్రి మధుసూదన్‌రెడ్డి. ఆయన హైకోర్టు లాయర్‌. తల్లి సుధారెడ్డి.

4

శర్వానంద్ కి  రక్షితరెడ్డితో జనవరి 26న నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరి నిశ్చితార్ధానికి చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, రానా, అల్లరి నరేష్, సిద్దార్థ్.. తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

5

కొన్ని రోజుల నుండి నటుడు శర్వానంద్ వివాహం గురించి సాంఘీక మాధ్యమంలో ఇటు కొన్ని మాధ్యమాల్లో కూడా బాగా వైరల్ అయ్యాయి. కొందరు శర్వానంద్, రక్షిత  ల ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిపోయిందని, శర్వా వివాహం వాయిదా వేసుకున్నాడని, ఇలా పలు రకాలుగా వార్తలు రాసారు, వైరల్ కూడా అయ్యాయి. 

6

శర్వానంద్ సినిమాల విహాయనికి వస్తే ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే లండన్ లో 40 రోజులు లాంగ్ షెడ్యూల్ ని పూర్తి చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. శర్వానంద్ 35వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి  హీరోయిన్ గా నటిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+