పాటకు సంగీతం ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి తగిన సాహిత్యం కూడా తోడు కావాల. అదే దానికి ప్రాణం పోస్తుంది. ఒక వైపు ఆ సినిమాలో సన్నివేశానికి సరిపడేలా లెరిక్స్‌ను అల్లుకోవడమే కాకుండా.. ఆ సంగీతంలో అమరిపోయేంత గొప్పగా సాహిత్యాన్ని రచించాల్సి ఉంటుంది. ఆ విషయంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రిని మించినవారు లేరు. ఆయన సాహిత్యం మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతుంది. సమాజాన్ని నిద్రలేపే విప్లవ గీతాల నుంచి.. కుర్రకారును ఉర్రూతలూగించే పాటల వరకు ప్రతి ఒక్కటీ.. గుండెను హత్తుకొనేలా రాయడం సిరివెన్నెలకే చెల్లుతుంది. చెప్పాలంటే.. ఆయన పాటల్లోని సాహిత్యం వింటే.. ప్రాణం పరవశిస్తుంది. అందుకే.. ఆయన పాటను స్మరిస్తూ.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం