వాణీ జయరామ్ దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు. 1945 నవంబరు 30న తమిళనాడులోని వేలూరులో ఓ సంగీత కుటుంబంలో జన్మించారు వాణీజయరాం. జన్మతహ తమిళియన్ అయిన వాణీ అసలు పేరు కలై వాణి. జయరాంతో పెళ్ళయిన తర్వాత వాణీజయరాంగా మారారు.1970లో ప్లేబాక్ సింగర్‌గా మారారు. మొదటి చిత్రం హిందీ మూవీ 'గుడ్డీ'. ఇందులోని 'బోల్‌రే పపీ హరా' పాట తోనే నేషనల్ అవార్డు అందుకున్నారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, మరాఠి, బెంగాలి, భోజ్‌పురి, తులు, ఒరియా భాషల్లో దాదాపు 10 వేల పాటలు పాడింది. తెలుగు సహా దాదాపు 19 భాషల్లో పాటలు పాడారు. కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం అంటే ఫిబ్రవరి 4న చెన్నైలో తుది శ్వాస విడిచారు.అయితే ఇప్పటివరకు ఆమెది సహజమరణమే అని అంతా భావించారు. కానీ లెజండరీ సింగర్ వాణి జయరాం మృతిపట్ల అనుమానాలు కలిగించే పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.