X
Home టాప్ లిస్టింగ్

రిలీజ్ డేట్స్ కంఫర్మ్ చేసిన టాలీవుడ్ బిగ్ బ్యానర్ మూవీస్ లిస్ట్

Author Administrator | Updated: Thursday, July 6, 2023, 03:18 PM [IST]

టాలీవుడ్ టాప్ హీరోలా సినిమాలంటే ప్రస్తుతం వున్నా క్రేజ్ వేరే లీవెల్. ఫ్యాన్ ఇండియా క్రేజ్ వచ్చాక వారి నెక్స్ట్ మూవీస్ పై సినీ ప్రేక్షకులు భారీ అంచనాలు వున్నాయి. సినీ ప్రేక్షకులు అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా భారీ బడ్జెట్ మూవీస్ తో వస్తున్నారు మన హీరోలు. ఇప్పటికే రిలీజ్ డేట్స్ కంఫర్మ్ చేసిన టాలీవుడ్ బిగ్ బ్యానర్ మూవీస్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.


cover image
భోళా శంకర్
1

భోళా శంకర్ మూవీ ఆగస్ట్ 11న రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. తమిళంలో అజిత్ సూపర్ హిట్ వేదలం మూవీకి ఇది రీమేక్. అంతేకాదు పదేళ్ల తర్వాత మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న మూవీ.  గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్యలతో హిట్స్ అందుకున్న చిరంజీవి ఇప్పుడు హ్యాట్రిక్ విజయాల కోసం తహతహలాడుతున్నాడు. 

సలార్
2

ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న సాలార్ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా దాదాపు 200 కోట్ల వ్యయంతో పాన్ ఇండియ‌న్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ద‌క్షిణాది ప్రేక్ష‌కులతో పాటు బాలీవుడ్ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి. సెప్టెంబర్ 28న సలార్ ను రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

Project K
3

ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ మూవీను 2024 జనవరి 12 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. దాదాపు 500 కోట్ల రూపాయలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోణ్, దిశా పటాని నటిస్తున్నారు. ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

దేవర
4

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ  దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దేవర మూవీ. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా  వచ్చే ఏడాది 2024 ఏప్రిల్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

గుంటూరు కారం
5

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గుంటూరు కారం.. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీ ఎత్తున నెలకొన్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది 2024 సంక్రాంతికి జనవరి 13న విడుదల చేస్తున్నారు. మహేష్ కు జోడిగా పూజా హెగ్డే, శ్రీ లీలా నటిస్తున్నారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+