సైరా నరసింహా రెడ్డి స్టోరీ
సైరా నరసింహా రెడ్డి సినిమా తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందుతున్న చిత్రం ఇందులో మెగాస్టార్ చిరంజీవి, నయనతార, అమితాబ్ బచ్చాన్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, నిహారిక కొణిదల ఇంకా తదితరులు ఇతర ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేంద్ర రెడ్డి వహించారు, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది సంగీతం అందించారు. కథ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అలియాస్ మజారి నర్సింహారెడ్డి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన స్వాతంత్ర్య సమరయోధుడు. పాలెగాళ్ల సమంత రాజుల నుంచి శిస్తు వసూలు చేయడాన్ని నర్సింహరెడ్డి వ్యతిరేకించి రైతులు, ప్రజల పక్షాన నిలుస్తాడు. బ్రిటీష్ పరిపాలకులకు కప్పం కడుతున్న సామంత రాజుల ఏకం చేసి భరత మాత స్వేచ్ఛ కోసం పోరాడుతాడు. ఈ క్రమంలో నాట్యతార లక్ష్మీ (తమన్నా)ని ప్రేమించి, సిద్దమ్మ (నయనతార)ను పెళ్లి చేసుకొంటాడు. ఇక సైరా కథలో గురువు గోసాని వెంకన్న (అమితాబ్), వీరా రెడ్డి (జగపతిబాబు), అవుకు రాజు (సుదీప్) ఇతర పాత్రలు ప్రాధాన్యమేమిటి? నయనతారతో పెళ్లి వెనుక ట్విస్ట్ ఏమిటి? లక్ష్మీని ప్రేమించిన నర్సింహరెడ్డి ఆమెకు ఎందుకు దూరం కావాల్సి వస్తుంది. స్వాతంత్ర్య ఉద్యమంలో సైరా పన్నిన వ్యూహాలేమిటి? భారత మాత సంకెళ్లను తెంచడం కోసం సాగించే పోరాటంలో ఆయన ఎలా అమరుడయ్యారు అనే ప్రశ్నలకు సమాధానమే సైరా నర్సింహారెడ్డి చిత్ర కథ. 2వ వారం లో కూడ కలేక్షన్ల సునామీతో దూసుకుపోతున్న 'సైరా' ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లోనే హాలీడే సీజన్ లో వచ్చిన సైరా నరసింహా రెడ్డి కలెక్షన్స్ పరంగా యమ స్పీడ్‌గా దూసుకెళ్తోంది. విడుదలైన 8 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డు నమోదు చేసింది సైరా నరసింహా రెడ్డి. అత్యంత వేగంగా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన నాలుగో చిత్రంగా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు వసూళ్లు చూస్తే.. నైజాంలో 2.48 కోట్లు, సీడెడ్‌లో 1.15 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.10 కోట్లు, ఈస్ట్ గోదావరి 27 లక్షలు, వెస్ట్ గోదావరి 14 లక్షలు, గుంటూరు 35 లక్షలు, కృష్ణా 27 లక్షలు, నెల్లూరు 14 లక్షలు, మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 5 కోట్ల 91 లక్షల మేర వసూళ్లు రాబట్టింది సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన జీవిత చరిత్ర..! 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాళెగాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకడు. కంపెనీ దొరతనము ఎదిరించి వీరమరణం పొందినాడు. ఈయన పాలెగార్ మనవడు. 18వ శతాబ్దపు తొలిదినాల్లో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 80 మంది పాలెగాళ్ళుండేవారు.నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిషు వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటిషు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిషు ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది. ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడుగా నరసింహారెడ్డి తండ్రి "పెదమల్లారెడ్డి "ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు, నొస్సం జమీదారు అయిన చెంచుమల్ల "జయరామిరెడ్డి" కి పిల్లలు లేకపోవడం తో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన, జయరామిరెడ్డి పిల్లలులేకుండా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దుచేసింది బ్రిటిషు ప్రభుత్వం. నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామములో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వలన తెలుస్తున్నది. ఈయన కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నిర్మించిన కోటలు, నగరులు ఈనాటికీ ఉన్నాయి. నరసింహా రెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ వలన కొడుకు దొర సుబ్బయ్య జన్మించాడు. రెండవ భార్య పేరమ్మ వలన ఒక కూతురు, మూడవ భార్య ఓబులమ్మ వలన ఇద్దరు కుమారులు జన్మించారు. 1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి తహసిల్దార్, ఆ వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. నరసింహారెడ్డి తాతయగు జయరామిరెడ్డి కాలములోనే అనగా క్రీ.శ.1800 లోనే అంగ్లేయులు నొస్సం సంస్థానమును లోబరుచొకొని, ఈ రాజవంశానికి నెలకు 11 రూపాయలు భరణము ఏర్పాటుచేసిరి. క్రీ.శ. 1845 వరకు ఈ భరణము నరసింహారెడ్డి ఇచ్చేవారు.. ఆసంవత్సరము నరసింహారెడ్డి తనకు రావలసిన భరణము కొరకై కోయిలకుంట్ల తహసిల్దారుకు తన భటునుని (కొందరు భటునుని కాక తన కొడుకు దొరసుబ్బయ్యను పంపారు అని చెప్తారు) పంపెను.. ఆ తహసిల్దారు అది ఈయకుండా నరసింహారెడ్డి పై దుర్భాషలాదడాడు.ఆ భటుడు ఉయ్యాలవాడకు పోయి జరిగిన విషయము తెలిపెను. అది విన్న నరసింహారెడ్డి ఆ అవమానము తో రగిలిపోయెను.. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు. 1846 జూలై 10వ తేదీన రెడ్డి 500 మంది బోయసైన్యమును దీసికొని, పట్టపగలు కోయిలకుంట్ల పట్టణముపై దండెత్తెను. తహసీల్దారుని పట్టి తలకొట్టి, ధనాగారములోనున్న బొదెలవాడు హరిసింగు ను చంపి, దానిని దోచుకొని, కచ్చేరీ నంతయు దగ్ధము చేసి తహసిల్దారు తలను, హర్సింగు తలను తెచ్చి నొస్సం దగ్గరనున్న నయనాలప్ప కొండ లో గల ఒక శివాలయము గుహలో దాచినాడు. కడపలో ఉన్న కలెక్టరునకును, పోలీసు సూపరిండెంటునకు ఈ హత్యావిషయము తెలిసి, వెతకడం ప్రారంభించారు.. ఔకరాజగు నంద్యాల నారాయణరాజును, వారి బంధువు నంద్యాల వెంకటరమణరాజును బంధించి కారాగారములో ఉంచారు..తరువాత శివలయములో నున్న తలల్ని కనుగొని, రెడ్డి గారి అనుచరులగు గోసాయివెంకన్న, ఒడ్డెఓబన్న బందించిఅసలు నిజం తెలుసుకున్నారు. బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది. అటుపై, నారసింహారెడ్డి వేలకొలది సైన్యములను సమకూర్చుకొని గిద్దలూరు దగ్గర వాట్సన్ తో ఘోర యుద్ధము చేసెను. రెడ్డి తన సైన్యముంతయు నష్ఠముకాగా, నల్లమల కొండలలోనికి తప్పించుకొని పారిపోయెను. ఆంగ్లేయులు ఆతనిని పట్టుకొనుటకు ఎన్నియో ప్రయత్నములు చేసిరి.కాని ఫలించలేదు. తరువాత జూలై 23న తేదీన మరలా కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్ధరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదుచేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు రెడ్డి. 1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల వద్దగల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించ దలచెను. నారసింహారెడ్డి దగ్గర ఒక వంటమనిషి ఉండేది.బ్రిటీషువారు ఆమెకు లంచమిచ్చి నారసింహారెడ్డి ని పట్టుకొన్నారు.. ఆవంట మనిషి నారసింహారెడ్డికి విపరీతముగా సారాయి పట్టించి ఆతని తుపాకీలో నీళ్ళు పోసి ఉంచిదంట.. ఆసమయములో నారసింహారెడ్డిని బంధించి కోయిలకుంట్ల కు తెచ్చిఉంచారు. వీరమరణం నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు. కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు..
Read More