X
తెలుగు » సినిమాలు » పొన్నియన్ సెల్వన్-2
పొన్నియన్ సెల్వన్-2

పొన్నియన్ సెల్వన్-2

Action | 28 Apr 2023 | U | 164 Mins
Telugu

2.6 /5 Users

3.5 /5 Filmibeat

పొన్నియన్ సెల్వన్-2 స్టోరీ

పొన్నియన్ సెల్వన్-2 సినిమా డ్రామా, ఎపిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విక్రమ్, జయం రవి, కార్తీక్, త్రిష త్రిష కృష్ణన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, నిజలగల్ రవి, లాల్,  ప్రభు, నాజర్,  కిషోర్, విక్రమ్ ప్రభు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మణి రత్నం వహించారు. నిర్మాత సుభాష్ కరణ్, మణి రత్నం కలిసి నిర్మించారు. సంగీతం ఏ ఆర్ రెహ్మాన్ అందించారు కథ ఉత్తర చోళ సామ్రాజ్య యువరాజు, సైన్యాధ్యక్షుడు ఆదిత్య కరికాలన్ (విక్రమ్)తో ప్రేమ బంధం విఫలం కావడంతో తనపై పగ ప్రతీకారంతో పాండ్య సామ్రాజ్య రాణి, అనాథ నందిని (ఐశ్వర్యరాయ్) జ్వలించుకుపోతుంది. ఆదిత్య కరికాలుడిపై పగ తీర్చుకోవడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటుంది. అంతేకాకుండా తన జన్మకు కారణమైన తండ్రి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం కోసం వెతుక్కొంటుంది. ఇదిలా ఉండగా యుద్ధంలో గాయపడి నదిలో కొట్టుకుపోయిన అరుణ్ మొళి వర్మ అలియాస్ పొన్నియన్ సెల్వన్ తిరిగి రాజ్యానికి చేరుకోవడమే కాకుండా దేశాన్ని పాలించేందుకు అర్హత సంపాదిస్తాడు.ఆదిత్య కరికాలన్‌తో నందిని ప్రేమ వ్యవహారం ఎలా బెడిసి కొట్టింది? నందిని పుట్టుకకు కారణమైన వ్యక్తి ఎవరు? ఆదిత్య కరికాలన్‌పై నందిని ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటుంది? చోళ సామ్రాజ్యంలో సమస్య తలెత్తినప్పుడు ఆదుకొనే మందాకిని అలియాస్ మూగ రాణి (ఐశ్వర్యరాయ్ బచ్చన్) ఎవరు? చిన్ననాటి స్నేహితురాలు నందినిని ప్రేమించిన ఆదిత్య కరికాలుడు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? ఏ పరిస్థితుల్లో నందిని తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడింది? చోళ రాజ్యాధికారాన్ని పొన్నియన్ సెల్వన్ చేపట్టాడా? అనే ప్రశ్నలకు సమాధానమే పొన్నియన్ సెల్వన్ 2 సినిమా రిలీజ్ డేట్  లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మద్రాస్ టాకీస్ నిర్మించిన పొన్నియిన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది  ట్రైలర్  పొన్నియిన్ సెల్వన్  2  ట్రైలర్ 3 నిమిషాల 30 సెకన్ల పాటు ఉంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ‘పీఎస్-2’ కూడా టెక్నికల్ గా రిచ్ గా వుంది.  ట్రైలర్‌ని చూసిన తర్వాత ప్రేక్షకులు బోర్‌ ఫీల్ అయ్యారు మరియు మొత్తం ట్రైలర్‌ని పూర్తి చేయడమే చాలా మందికి కష్టంగా అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ లో ఎటువంటి చమక్కులు లేదా అబ్బురపరిచే సన్నివేశాలు, డైలగ్స్ లేకుండా సాగుతుంది.   పైన  పొన్నియిన్ సెల్వన్  2 కూడా తమిళ ప్రేక్షకులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తుంది.
Read More

పొన్నియన్ సెల్వన్-2 కాస్ట్ & క్రూ

పొన్నియన్ సెల్వన్-2 సిబ్బంది సమాచారం

దర్శకత్వం మణిరత్నం
స్టోరీ జేయ మోహన్
సినిమాటోగ్రఫీ రవి వర్మన్
సంపాదకుడు శ్రీకర్ ప్రసాద్
సంగీతం ఎ ఆర్ రెహమాన్
నిర్మాత సుభాకరన్, మణిరత్నం
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పొన్నియన్ సెల్వన్-2 విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ప్రేమ, పగ, ప్రతీకారం, రాజ్య కాంక్ష, ఎత్తులుపై ఎత్తులు లాంటి అంశాలతో భావోద్వేగంగా రూపొందిన చిత్రం పొన్నియన్ సెల్వన్ 2. ఈ సినిమా కథ పక్కా తమిళ నేటివిటితో ఉన్నప్పటికీ.. తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేనప్పటికీ.. ఆ కథను భావోద్వేగంగా మలచడం మణిరత్నం వల్లే సాధ్యపడిందనిపిస్తుంది.పాత్రలకు ఎంపిక చేసిన నటీనటులు, వారి ఫెర్ఫార్మెన్స్ కారణంగానే ఈ సినిమా మరో రేంజ్‌లో ఉందనిపిస్తుంది. సాంకేతిక నిపుణుల పనితీరు, డైలాగ్స్ సినిమాకు ఆయువుపట్టుగా మారాయి. మణిరత్నం టేకింగ్, మేకింగ్, రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకు పైసా వసూల్‌గా మారాయి. అంచనాలు పెట్టుకొని వెళ్లినా.. అంచనాలు లేకుండా వెళ్లినా పొన్నియన్ సెల్వన్ ఎలాంటి నిరాశకు, అసంతృప్తికి గురిచేయదు. చాలా రోజుల తర్వాత మంచి విందు భోజనం తింటే కలిగే తృప్తి పొన్నియన్ సెల్వన్ 2 కలిగిస్తుంది.

పొన్నియన్ సెల్వన్-2 ట్రైలర్

Video Thumbnail

పొన్నియన్ సెల్వన్-2 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

పొన్నియన్ సెల్వన్-2

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+