X
Home టాప్ లిస్టింగ్

2023 సెప్టెంబ‌ర్‌లో సంద‌డి చేయ‌నున్న పాన్ ఇండియా సినిమాలు

Author Administrator | Updated: Saturday, July 29, 2023, 09:32 AM [IST]

Kushi To Salaar Pan India Movie Releases In September 2023 |సెప్టెంబ‌ర్‌లో సంద‌డి చేయ‌నున్న పాన్ ఇండియా సినిమాలు | Pan India movies that will be buzzing in September


cover image

విషయ జాబితా

ఖుషి

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఖుషి’. మొత్తం తెలుగు నెటివిటీతో రూపొందినప్పటికీ విజయ్ దేవరకొండ, సమంతలకు పాన్ ఇండియా రేంజ్‌లో ఉన్న క్రేజ్ ఆధారంగా ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 1న పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేసుకుంటున్నారు. 

బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జవాన్’. హీరోయిన్ కూడా సౌత్ నుంచే తీసుకున్నారు. ఆమె నయనతార. ఈ సినిమాను ముందుగా జూన్‌లో విడుద‌ల చేయాల‌ని డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే షూటింగ్ పూర్తి కాక‌పోవ‌టంతో జవాన్ సినిమాను సెప్టెంబ‌ర్ 7న హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ అవుతుంది. ప‌ఠాన్ త‌ర్వాత షారూక్ ఖాన్ హీరోగా న‌టిస్తోన్న సినిమా కావ‌టంతో సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. 

రామ్‌- బోయపాటి

మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తోన్న టాలీవుడ్ యంగ్ హీరోస్‌లో రామ్ పోతినేని ఒక‌రు. ఆయ‌న గ‌త ఏడాది ది వారియ‌ర్ సినిమాతో తెలుగుతో పాటు త‌మిళంలోనూ త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకున్నారు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. అయితే కూడా రామ్ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌టం లేదు. ఈసారి ఏకంగా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుతో క‌లిసి మాస్ మూవీ చేశారు. ఈ సినిమాకు స్కంధ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే ఆ సీజ‌న్‌లో విప‌రీత‌మైన పోటీ ఉండ‌టంతో పాటు సినిమా వ‌ర్క్ కూడా త్వ‌ర‌గా పూర్త‌వుతుండ‌టంతో సినిమా రిలీజ్‌ను ప్రీ పోన్ చేసి సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ చేస్తున్నారు. 

సలార్

ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సలార్’. కె.జి.యఫ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు, నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌తో పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ప్ర‌భాస్ సినిమా చేస్తుండ‌టంతో మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సెప్టెంబ‌ర్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాలు కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+