X
Home టాప్ లిస్టింగ్

బాక్సాఫీస్ పోరులో బాల‌కృష్ణ వ‌ర్సెస్ ర‌వితేజ‌

Author Administrator | Updated: Friday, August 4, 2023, 11:22 AM [IST]

సీజ‌న్స్‌ను టార్గెట్ చేసి వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టాల‌నుకోవ‌టం మ‌న హీరోలు ఎప్ప‌టి నుంచో చేస్తున్న‌దే. అయితే ఇలాంటి సంద‌ర్భాల్లో కొంద‌రి మ‌ధ్య తెలియ‌ని పోటీ వ‌చ్చేస్తుంది. ఈ లిస్టులో రానున్న ద‌సరాకు నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా ఉన్నారు. ఇద్ద‌రూ మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు. వీరు ఇప్పుడే కాదు, ఇదివ‌ర‌కే ఇద్ద‌రూ బాక్సాఫీస్ ద‌గ్గర పోటీ ప‌డ్డారు. ఈ క‌లెక్ష‌న్స్ పోరులో ఇటు బాల‌కృష్ణ‌, అటు ర‌వితేజల్లో ఎవ‌రు ఎక్కువ స‌క్సెస్ రేట్ సాధించార‌నే వివ‌రాల్లోకి వెళితే...


cover image

నందమూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు జూన్ 13, 2003లో విడుద‌లైంది. ర‌వితేజ క‌థానాయ‌కుడు న‌టించిన ఒక రాజు ఒక రాణి సినిమా జూన్ 19, 2003లో విడుద‌లైంది. అది కూడా ఓ వారం గ్యాప్‌తోనే అయితే రెండు సినిమాలు ప్రేక్ష‌కుల‌ను నిరాశ ప‌రిచాయి. 

2005లో అల్ల‌రి పిడుగు సినిమా అక్టోబ‌ర్ 5న రిలీజైంది. ఇందులో బాల‌కృష్ణ హీరో. ఇక ర‌వితేజ హీరోగా న‌టించిన భ‌గీర‌థ సినిమా అక్టోబ‌ర్ 13న విడుదలైంది. అంటే వారం గ్యాప్‌తో. ఈ రెండు సినిమాలు ఆశించిన ఫ‌లితాల‌ను అందుకోలేక‌పోయాయి. 

2008లో బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ఒక్క‌మ‌గాడు చిత్రం జ‌న‌వ‌రి 11న సంక్రాంతి బ‌రిలోకి దిగింది. అయితే సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ మ‌రుస‌టి రోజు అంటే జ‌న‌వ‌రి 12న ర‌వితేజ హీరోగా న‌టించిన కృష్ణ సినిమా విడుద‌లైంది. ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ హిట్ అయ్యింది. 

2009లో బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన మిత్రుడు మూవీ మే 1న రిలీజైంది. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక దానికి ఓ వారం గ్యాప్‌లో వచ్చిన కిక్ సినిమా ర‌వితేజ రేంజ్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లేంత బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీగా నిలిచింది. 

బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ప‌ర‌మ‌వీరచ‌క్ర మూవీ 2011 సంక్రాంతి సంద‌ర్బంగా జ‌న‌వ‌రి 12న రిలీజైంది. సినిమా బాల‌కృష్ణ‌కు మ‌రో డిజాస్ట‌ర్‌ను ఖాతాలో వేసింది. ఆ మ‌రుస‌టి రోజు అంటే జ‌న‌వ‌రి 13న ర‌వితేజ హీరోగా న‌టించిన మిర‌ప‌కాయ్ విడుద‌లైంది. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. 

 

2012లో ర‌వితేజ హీరోగా న‌టించిన ద‌రువు సినిమా మే 25న రిలీజైంది. క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఓ వారం గ్యాప్‌తో అంటే జూన్ 1న బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన అధినాయ‌కుడు వ‌చ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. 

ర‌వితేజ హీరోగా న‌టించిన దేవుడు చేసిన మ‌నుషులు సినిమా 2012 ఆగ‌స్ట్ 15న రిలీజైంది. మ‌రుస‌టి రోజుకే ఊసులేకుండా డిజాస్ట‌ర్ టాక్‌తో డీలా ప‌డింది. రెండు వారాల గ్యాప్‌లో బాల‌కృష్ణ హీరోగా న‌టించిన శ్రీమ‌న్నారాయ‌ణ మూవీ వ‌చ్చింది. ఈ సినిమా కూడా ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్టుకోలేదు. 

2023లో బాల‌కృష్ణ హీరోగా న‌టించిన వీర సింహా రెడ్డి సంక్రాంతి రేసులోకి జ‌న‌వ‌రి 11న వ‌చ్చాడు. సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ మ‌రుస‌టి రోజు వ‌చ్చిన వాల్తేరు వీర‌య్యలో చిరంజీవి మెయిన్ హీరో. కానీ ర‌వితేజ ఇందులో స్పెష‌ల్ రోల్ చేశాడు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. 

2023లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, ర‌వితేజ మ‌రోసారి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు. ఈ రేసులో ముందుగా అంటే అక్టోబ‌ర్ 19న బాల‌య్య న‌టించిన భ‌గ‌వంత్ కేస‌రి రిలీజ్ కానుంది. ఆ మ‌రుస‌టి రోజు అంటే అక్టోబ‌ర్ 20న ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు రిలీజ్ కానుంది. ఈ బాక్సాఫీస్ వార్‌లో ఎవ‌రు విన్న‌ర్‌గా నిలుస్తారో చూడాలి మ‌రి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+