నా భార్యకు ఎప్పుడో చెప్పా.. కొడుకు పుడితే.. మనసులో కోరిక బయటపెట్టిన అఖిల్!

అక్కినేని అఖిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి దాదాపు 10 ఏండ్ల తరువాత 'లెనిన్'సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకుంది. దీంతో అఖిల్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. మూవీ ప్రమోషన్స్ ముగిసిన తర్వాత తాజాగా ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన 'సిసింద్రీ' సినిమా గురించి చెప్పిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?

Also Read
Jana Nayagan Day 3 Collections: బాక్సాఫీస్ కింగ్ జన నాయగన్.. సీఎం విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Jana Nayagan Day 3 Collections: బాక్సాఫీస్ కింగ్ జన నాయగన్.. సీఎం విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

హీరో అఖిల్ మాట్లాడుతూ.. తన జీవితంలో 'సిసింద్రీ' సినిమాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. తాను కేవలం 8 నుంచి 9 నెలల వయసులోనే ఆ సినిమాలో నటించానని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను ఏం చేస్తున్నానో కూడా తెలియని వయసులో కెమెరా ముందుకు వచ్చానని, కానీ ఆ సినిమా తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయిందన్నారు. అంతేకాదు, భవిష్యత్తులో తనకు కొడుకు పుడితే అతడితో 'సిసింద్రీ 2' సినిమా తీయాలని తన కోరిక అని వెల్లడించారు.

Akhil Akkineni Reveals Dream of Sisindri 2 With His Son
Recommended For You
Devara: దేవర వసూళ్లు ఫేకా? నిజమేంటో తేల్చేసిన ప్రముఖ నిర్మాత!
Devara: దేవర వసూళ్లు ఫేకా? నిజమేంటో తేల్చేసిన ప్రముఖ నిర్మాత!

ఈ విషయాన్ని తన భార్య జైనాబ్‌కు కూడా చెప్పానని అఖిల్ తెలిపారు. "నాకు కొడుకు పుడతాడా? కూతురు పుడుతుందా? అనేది దేవుడి చేతుల్లో ఉంది. కానీ ఒకవేళ కొడుకు పుడితే మాత్రం అతడితో 'సిసింద్రీ 2' చేయాలని నా ఆలోచన. మావోడు ఎప్పుడు వస్తాడో.. ఎప్పుడు ఆ సినిమా చేస్తామో చూడాలి" అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు. అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అక్కినేని అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

You May Also Like
అందుకే బిగ్‌బాస్ ఆఫర్ రిజెక్ట్ చేశా.. అసలు కారణం చెప్పిన నాగదుర్గ!
అందుకే బిగ్‌బాస్ ఆఫర్ రిజెక్ట్ చేశా.. అసలు కారణం చెప్పిన నాగదుర్గ!

'సిసింద్రీ' షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను అఖిల్ వివరించారు. తాను రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే మెలకువగా ఉండేవాడినని, ఆ సమయంలో కూడా తన మూడ్ బాగుంటేనే షూటింగ్ చేసేవారని చెప్పారు. చిన్నపిల్లాడైన తనపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చిత్రబృందం ఎంతో జాగ్రత్తగా షూటింగ్ చేస్తున్నట్టు తెలిపారు.

జాన్వీ.. నీ బ్యూటీ స్పాట్స్ చూపిస్తావా? హీరో మెసేజ్‌‌కు బ్యూటీ రియాక్షన్ ఏమిటంటే?
జాన్వీ.. నీ బ్యూటీ స్పాట్స్ చూపిస్తావా? హీరో మెసేజ్‌‌కు బ్యూటీ రియాక్షన్ ఏమిటంటే?

సినిమాలో నవ్వే సన్నివేశాలు ఎలా చిత్రీకరించారో కూడా అఖిల్ వివరించారు. కెమెరా వెనుక తన తండ్రి నాగార్జున నిలబడి రకరకాల సైగలు చేస్తే తాను నవ్వేవాడినని చెప్పారు. అలాగే ఏడవాల్సిన సన్నివేశాల కోసం తన తల్లి అమల కారులో వెళ్లిపోతుండగా చూసి తాను ఏడిస్తే, ఆ సహజ భావోద్వేగాలను షూట్ చేశారని తెలిపారు. సిసింద్రీ సినిమా అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని కూడా అఖిల్ చెప్పారు. ఆ సినిమా విజయాన్ని సాధించడంతో వచ్చిన లాభాలతోనే తన తల్లి అమల ఎంతో ఇష్టంగా 'బ్లూ క్రాస్' జంతు సంరక్షణ సంస్థ ప్రారంభించారని వెల్లడించారు.

బిగ్ బాస్‌లోకి సౌరవ్ గంగూలీ.. దాదా పారితోషికం ఎన్ని కోట్లంటే?
బిగ్ బాస్‌లోకి సౌరవ్ గంగూలీ.. దాదా పారితోషికం ఎన్ని కోట్లంటే?

అంతేకాదు, 'సిసింద్రీ' తనకు తొలి గుర్తింపును మాత్రమే కాదు, ఫిలింఫేర్ అవార్డును కూడా అందించిందని అఖిల్ పేర్కొన్నారు. చిన్న వయసులోనే అంతటి గుర్తింపు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అందుకే ఆ సినిమా తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ప్రత్యేక సినిమాగా నిలిచిపోయిందన్నారు.

’చిన్న పెగ్ వేస్తే చిరంజీవిని.. పెద్ద పెగ్‌తో పవన్ కల్యాణ్‌ను టార్గెట్’
’చిన్న పెగ్ వేస్తే చిరంజీవిని.. పెద్ద పెగ్‌తో పవన్ కల్యాణ్‌ను టార్గెట్’

1995లో విడుదలైన 'సిసింద్రీ' సినిమాకు శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. హాలీవుడ్ సూపర్‌హిట్ 'బేబీస్ డే అవుట్' కథ ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాను నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించడంతో పాటు కీలక పాత్రలో కూడా నటించారు. చిన్నారి అఖిల్ అమాయక నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X