Spirit:'స్పిరిట్' పై సందీప్ రెడ్డి వంగా అదిరిపోయే అప్‌డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే..

Spirit Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్పిరిట్'. ఈ సినిమాపై అభిమానుల్లో ఎప్పటి నుంచో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ ను స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డి ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి 'స్పిరిట్' హాట్ టాపిక్‌గా మారింది.

Also Read
Jana Nayagan Advance Booking: అడ్వాన్స్ బుకింగ్స్ లో 'జన నాయగన్'రికార్డు.. విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Jana Nayagan Advance Booking: అడ్వాన్స్ బుకింగ్స్ లో 'జన నాయగన్'రికార్డు.. విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

అమెరికాలోని చార్లెట్ నగరంలో జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మెగా కన్వెన్షన్-2026లో సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులతో ముచ్చటించారు. 'స్పిరిట్' సినిమా గురించి వారు ప్రశ్నించగా.. ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయిందని తెలిపారు. అలాగే, "ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని తెలిపారు. ఈ మాటలు ప్రభాస్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.

Prabhas Spirit Update Sandeep Reddy Vanga Confirms 40 Shoot Completed

దర్శకుడు చెప్పిన ఈ ఒక్క అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో అభిమానులు సందడి చేస్తున్నారు. షూటింగ్ వేగంగా సాగుతుండటంతో సినిమా అనుకున్న తేదీకే విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ పోస్టర్లు, ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. ఇప్పుడు 40 శాతం షూటింగ్ పూర్తయిందనే సమాచారం రావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

Recommended For You
Lenin 10 Days Box Office: 'లెనిన్' బాక్సాఫీస్ వేట.. అఖిల్ సినిమా ఎంత కొల్లగొట్టిందంటే?
Lenin 10 Days Box Office: 'లెనిన్' బాక్సాఫీస్ వేట.. అఖిల్ సినిమా ఎంత కొల్లగొట్టిందంటే?

'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ తొలిసారి ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలకు భిన్నంగా ఈ క్యారెక్టర్ ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. సందీప్ రెడ్డి వంగా మార్క్‌లో ఉండే ఇంటెన్స్ ఎమోషన్స్, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, పాత్రలు ఈ సినిమాకు ప్రధాన బలం కానున్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌ను కొత్త అవతారంలో చూపించేందుకు దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

You May Also Like
24 గంటల ఫుటేజ్‌ను గంటలో ఎలా చూపిస్తారు ? బిగ్ బాస్‌పై లేడీ కామెడియన్ షాకింగ్ కామెంట్స్..
24 గంటల ఫుటేజ్‌ను గంటలో ఎలా చూపిస్తారు ? బిగ్ బాస్‌పై లేడీ కామెడియన్ షాకింగ్ కామెంట్స్..

ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్, సీనియర్ నటి కాంచన తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్టార్ నటీనటులతో రూపొందుతున్న ఈ సినిమాపై అన్ని భాషల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

Bigg Boss Telugu 10: నాగార్జునకు మరో జాక్‌పాట్? బిగ్ బాస్ 10 రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
Bigg Boss Telugu 10: నాగార్జునకు మరో జాక్‌పాట్? బిగ్ బాస్ 10 రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?

'స్పిరిట్' చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు ఇంగ్లీష్, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయిలో విడుదల కానున్న చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. రాబోయే రోజుల్లో టీజర్, గ్లింప్స్, మరిన్ని అధికారిక అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X