ఐసీయూలో ఫౌజీ యాక్టర్.. ప్రభాస్ మూవీ షూట్‌లో రూమర్లపై క్లారిటీ
పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఫౌజీ. టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ప్రాజెక్ట్స్‌లో ఫౌజీ కూడా ఒకటి. పీరియాడికల్ ఎలిమెంట్స్‌తో ప్రభాస్‌ను గతంలో ఎన్నడూ చూడని విధంగా హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు రాజేశ్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చిత్ర యూనిట్ ఉలిక్కిపడింది. షూటింగ్ సమయంలో ఓ విషపురుగు కుట్టడంతోనే ఆయన తీవ్ర ఇబ్బందికి గురయ్యారని.. దాంతో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమ షాకైంది. ఈ నేపథ్యంలో రాజేశ్ శర్మ పీఏ దీనికి క్లారిటీ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
రాజేష్ శర్మ బెంగాలీ, హిందీ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కోస్లా కా గోస్లా, ఇష్కియా, నో వన్ కిల్డ్ జెస్సికా, చిల్లర్ పార్టీ, ది డర్టీ పిక్చర్, లవ్ షువ్ తే చికెన్ ఖురానా, స్పెషల్ 26, పాస్, తను వెడ్స్ మను రిటర్న్స్, బజరంగీ భాయిజాన్, ఎంఎస్ ధోనీ తదితర చిత్రాలతో సత్తా చాటారు. ఇటీవలి హిట్ చిత్రాలు భూత్ బంగ్లా, కృష్ణావతారం పార్ట్ 1: ది హర్ట్ సినిమాలలో తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలోనే ఫౌజీలోనూ రాజేశ్ శర్మకు అవకాశం దక్కింది. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు.

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఫౌజీ షూటింగ్ జరుగుతుండగా ఓ రోజున రాజేశ్ శర్మ తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫిలిం సిటీలోని కాస్త గుబురుగా, దట్టమైన చెట్ల ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతుండగా కొందరు టెక్నీషియన్లతో ఆయన మాట్లాడుతున్న సమయంలో ఓ పురుగు కరిచినట్లుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఇదేం పట్టించుకోకుండా యథావిధిగా షూటింగ్‌లో పాల్గొనగా 6 గంటల తర్వాత రాజేశ్ శర్మ కుడి కాలు వాచిపోవడం.. జ్వరం, ఊపిరి ఆడకపోవడంతో వెంటనే కోల్‌కతాకు బయల్దేరివెళ్లారు. నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కుడికాలిలో ఇన్ఫెక్షన్ పెరగడం, ఇతర అనారోగ్య కారణాలతో రాజేశ్ శర్మను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే విష పురుగు కుట్టడం వల్లే రాజేశ్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వస్తున్న వార్తలు నిజం కాదని ఆయన పీఏ సుభాశిష్ పాండా తేల్చిచెప్పారు. రాజేశ్ శర్మ అనారోగ్యంపై వస్తున్న కథనాలకు స్పందించిన ఆయన ఓ వీడియో విడుదల చేశారు. పురుగు కుట్టడం వల్ల రాజేశ్ శర్మ అస్వస్థతకు గురికాలేదు డయాబెటిస్ వల్లే ఇలా జరిగింది. షుగర్ వ్యాధి ఇప్పుడు ఆయన శరీర భాగాలపై ప్రభావం చూపిస్తోంది. తను ప్రతి నిత్యం రాజేశ్ శర్మ వెంటే ఉంటా, హైదరాబాద్ ఫిలిం సిటీలో ఆయనకేం కాలేదు. రాజేశ్ శర్మ కాలికి చిన్న సమస్యే.. 2 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు. సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై ఇలాంటి వార్తలు వ్యాప్తి చేయడం సరికాదని పాండా క్లారిటీ ఇచ్చారు.
కాగా.. ఫౌజీ మూవీని టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, రాజేశ్ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications


