Nagabandham Day 6 Collections: కొట్టుమిట్టాడుతున్న'నాగబంధం'.. 6 రోజుల్లో కేవలం ఇంతేనా?
Nagabandham Collections: సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్'(Nagabandham). దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ సినిమాలో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రలు పోషించగా, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్ ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా జూలై 3న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. అయితే భారీ ప్రచారం, విజువల్ గ్రాండియర్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఎంత కలెక్ట్ చేసింది? ఆరో రోజు మూవీ అంచనా కలెక్షన్లు ఎంతంటే?
కలెక్షన్ల పరంగా చూస్తే ఈ సినిమా మొదటి రోజు నుంచే ఆశించిన స్థాయిలో కలెక్షన్లు అందుకోలేకపోయింది. మొదటి రోజు 3.40 కోట్ల రూపాయలునెట్ కలెక్షన్లతో ఖాతా తెరిచింది. రెండో రోజు 3.05 కోట్ల రూపాయలు, మూడో రోజు (ఆదివారం) 3.65 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వీకెండ్ ముగిసే సమయానికి సినిమా 10.10 కోట్ల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే సోమవారం నుంచి వసూళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. నాలుగో రోజు 1.50 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టిన ఈ సినిమా, ఐదో రోజు మాత్రం స్వల్పంగా కోలుకుని 1.55 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లు నమోదు చేసింది.

ఇలా ఐదు రోజుల్లో సినిమా మొత్తం నెట్ కలెక్షన్లు 13.15 కోట్ల రూపాయలకు చేరగా.. గ్రాస్ కలెక్షన్లు 15.13 కోట్ల రూపాయల చేరాయి. భాషల వారీగా ఐదో రోజు కలెక్షన్లను పరిశీలిస్తే.. తెలుగు నుంచి 1.20 కోట్ల రూపాయలు, హిందీ నుంచి 25 లక్షల రూపాయలు, తమిళం నుంచి 7లక్షల రూపాయలు,కన్నడ నుంచి 2 లక్షల రూపాయలు, మలయాళం నుంచి 1 లక్ష రూపాయలు మాత్రమే కలెక్షన్ చేసింది.
ఇక ఓవర్సీర్ లో కూడా ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఫలితాలు అందుకోలేపోయిందనే చెప్పాలి. ఐదో రోజు ఓవర్సీస్‌లో కేవలం 10 లక్షల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. దీంతో మొత్తం ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్లు 1.45 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇలా సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 16.58 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకి ఇప్పటివరకు వచ్చిన వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆరోరోజు అంచనా కలెక్షన్లు
ఇక అసలు పరీక్ష సోమవారం నుంచే మొదలైందనే చెప్పాలి. వీకెండ్‌లో దుమ్మురేపిన వీక్‌డేస్‌లో భారీ కలెక్షన్లు తగ్గాయి. ట్రేడ్ వర్గాల ప్రకారం.. మధ్యాహ్నం 2:03 గంటల (IST) నాటికి దేశవ్యాప్తంగా 586 నగరాల్లో, 1,878 షోల నుంచి ఈ సినిమా సుమారు 60.24 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు నమోదు చేసిందట. ప్రస్తుతం ట్రెండ్ చూస్తే.. బుధవారం దేశవ్యాప్తంగా రూ. 1 కోటి వరకు కలెక్షన్లు అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో కూడా 10 లక్షలు కలెక్షన్లు అందుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే రోజులు బాక్సాఫీస్ ప్రయాణం ఎలా సాగుతుందో ఆసక్తికరంగా మారింది.
నాగబంధం సినిమా విడుదలైన తర్వాత వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ తో నిర్మాతలు రన్‌టైమ్‌ను దాదాపు 20 నిమిషాలు తగ్గించి కొత్త వెర్షన్‌ను థియేటర్లలో ప్రదర్శించారు. అయినప్పటికీ వసూళ్లలో పెద్దగా మార్పు కనిపించలేదు. ప్రస్తుతం సినిమా తొలి వారం ముగిసేలోపు గణనీయమైన వసూళ్లు నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే బాక్సాఫీస్ ప్రయాణం మరింత కష్టతరమయ్యే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2026లో టాలీవుడ్‌కు మరో పెద్ద షాక్‌గా మారిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications



