Ramayana Trailer: రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా.. ఆలస్యానికి కారణం ఏంటంటే?
భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో రామాయణ కూడా ఒకటి. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయిపల్లవి, యశ్, కాజల్ అగర్వాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలై చేసిన గ్లింప్స్, నటీనటుల లుక్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో ఈ మూవీ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో రామాయణ చిత్ర యూనిట్ షాకిచ్చింది.

ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ బ్యానర్స్‌పై నమిత్ మల్హోత్రా ఈ రామాయణ సినిమాను నిర్మిస్తుండగా నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. రణబీర్ కపూర్, సాయిపల్లవి, రవి దూబే, సన్నీ డియోల్, యశ్, అమితాబ్ బచ్చన్, లారా దత్తా, అరుణ్ గోవిల్, ఇందిరా కృష్ణన్, వివేక్ ఒబెరాయ్, శిశిర్ శర్మ, మోహిత్ రైనా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తోంది. పంకజ్ కుమార్, మహేశ్ లిమాయేలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని, హ్యాన్స్ జిమ్మర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించనున్నారు.
భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారిగా 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రామాయణను తెరెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళి కానుకగా 2026 నవంబర్ 6న విడుదల చేయనున్నారు. రామాయణ విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను బ్రిటీష్ ఇండియన్ స్టూడియో డీఎన్ఈజీ చేపట్టడం విశేషం. ప్రపంచ ప్రఖ్యాత జర్మన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన హ్యాన్స్ జిమ్మర్ ఈ సినిమాతో భారతీయ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతుండటం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా రామాయణ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేందుకు గాను చిత్ర యూనిట్ భారీ ప్రమోషనల్ కార్యక్రమాలను చేపడుతోంది. ఇటీవల ఢిల్లీలో ఓ ఈవెంట్ నిర్వహించిన యూనిట్.. దేశవ్యాప్తంగా ఉన్న మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ట్రైలర్‌ను ప్రదర్శించింది. తాజాగా ప్రేక్షకుల కోసం జూలై 24న ట్రైలర్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది. దాంతో ట్రైలర్ కోసం ప్రేక్షకులు, సినీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ చిత్ర యూనిట్ షాకిచ్చింది. రామాయణ ట్రైలర్‌ను విడుదల చేయడం లేదని ప్రకటించింది. ఈ మేరకు నిర్మాత నమిత్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు.
ఈరోజు మా రామాయణ ప్రాజెక్ట్‌కు ఎంతో ప్రత్యేకం. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కుదిరిన ఒప్పందం ద్వారా రామాయణాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలన్న నా కల సాకారం కాబోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ట్రైలర్‌ను మరో తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. భారతీయ చలన చిత్ర చరిత్రలో గడిచిన 100 ఏళ్లలో ఇది గర్వకారణమైన ఘట్టం కానుంది. ఎందుకంటే ఒక భారీ హాలీవుడ్ సినిమా తరహాలోనే రామాయణం కూడా ప్రపంచం మొత్తానికి చూపించబడుతోంది అన్నారు.
ప్రపంచ ప్రజలు మన సంస్కృతి, కథల వైభవాన్ని తెలుసుకునేందుకు ఇది ఒక మార్గాన్ని సుగమం చేయనుంది. ఈ కల సాకారం కావడానికి సహకరించిన అభిమానులందరికీ, రామాయణాన్ని విశ్వసించే వారికి కృతజ్ఞతలు. మన దేశ యువతే మన భవిష్యత్తు.. కాబట్టి మన భవిష్యత్తును కాపాడుకోవడానికి కృషి చేద్దామని నమిత్ మల్హోత్రా రాసుకొచ్చారు. ప్రపంచ స్థాయిలో రామాయణ విడుదల అవుతుందని అభిమానులు సంతోషిస్తున్నా.. ట్రైలర్ రిలీజ్ వాయిదాపడటంతో వారు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications



