This Week Movie Releases: ఓ సుకుమారి, జీడీఎన్, ది ఒడిస్సీ.. ఇంకా ఈ వారం రిలీజయ్యే సినిమాలు ఇవే!
ప్రతివారం మాదిరిగానే ఈ వారం కూడా చిన్నా, పెద్దా సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి ముందుకొస్తున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు హాలీవుడ్ దర్శక దిగ్గజం క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ కూడా ఈ వారమే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ వీక్ రిలీజయ్యే సినిమాలను పరిశీలిస్తే..

వదలా:
టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు కీలకపాత్ర పోషించిన సస్పెన్స్ థ్రిల్లర్ వదలా. లయ, హృతిక శ్రీనివాస్ కీలకపాత్రలు పోషించారు. ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించగా.. చరిత చిత్ర బ్యానర్‌పై తమ్మారెడ్డి భరద్వాజ, కిశోర్ నాయుడు చిరుమామిళ్ల ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా.. కార్తీక్ బీ కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మే 22న రావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల కారణంగా జూలై 17కి వాయిదా పడింది.
ఓ సుకుమారి
ఐశ్వర్య రాజేష్- తిరువీర్ రెడ్డి జంటగా నటించిన మూవీ ఓ సుకుమారి. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి ఈ సినిమాని నిర్మించగా.. భరత్ దర్శన్ దర్శకత్వం వహించారు. శ్రీ వరప్రసాద్ ఎడిటర్‌గా, సీహెచ్ కుషెందర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా... భరత్ మంచిరాజు సంగీతం అందించారు. తెలుగు, తమిళ భాషల్లో ఓ సుకుమారి సినిమా జూలై 17న విడుదల కానుంది.
జీడీఎన్:
కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మూవీ జీడీఎన్. అగ్రనటుడు ఆర్ మాధవన్ ఇందులో లీడ్ రోల్ పోషిస్తున్నారు. సత్యరాజ్, జయరాం, ప్రియమణి, దుషారా విజయన్, వినయ్ రాయ్, తంబి రామయ్య, నందాలాల్, టీజయ్ అరుణాసలం, కరుణాకరణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట్రై కలర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై వర్గీస్ మూలన్, విజయ్ మూలన్, సరితా మాధవన్, ఆర్ మాధవన్‌లు ఈ సినిమాను నిర్మిస్తుండగా కృష్ణకుమార్ రామాకుమార్ దర్శకత్వం వహించారు. గోవింద వసంత సంగీతం అందించారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో జూలై 17న జీడీఎన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మకుటం:
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, అంజలి, దుషారా విజయన్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ మగుదం (తెలుగులో మకుటం). జాన్ విజయ్, జయ ప్రకాష్, అజయ్, వంశీ కృష్ణ, అబుసలీం, వీజే ఝాన్సీ, పదం కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై బీ సురేష్, ఆర్‌బీ జీవన్ చౌదరి, జితన్ రమేశ్, జీవాలు ఈ సినిమాను నిర్మించారు. హీరో విశాల్ స్వయంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రిచర్డ్ ఎం నాథన్, అభినందన్ రామానుజం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. ఎన్‌బీ శ్రీకాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగు, తమిళ భాషల్లో జూలై 17న మకుటం విడుదల కానుంది.
ది ఒడిస్సీ
హాలీవుడ్ దర్శక దిగ్గజం క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మూవీ ది ఒడిస్సీ. గ్రీక్ దేశానికి ఇతిహాసం ఒడిస్సీ ఆధారంగా ఎపిక్, ఫాంటసీ, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఆయన ఈ సినిమాను తెరకెక్కించారు. మాట్ డామన్, టామ్ హలండ్, అన్నా హథావే, రాబర్ట్ పట్టిన్సన్, సమంతా మోర్టాన్, జెందాయ తదితరులు నటించారు. యూనివర్సల్ పిక్చర్స్, సిన్‌కాపి బ్యానర్స్‌పై ఎమ్మా థామస్, క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాను నిర్మించారు. హోతే వాన్ హోతేమా సినిమాటోగ్రాఫర్‌గా, జెన్నిఫర్ లామే ఎడిటర్‌గా వ్యవహరించగా.. లూడ్విగ్ గోరన్సన్ సంగీతం అందించారు. వరల్డ్ వైడ్‌గా జూలై 17న ది ఒడిస్సీ వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.
ఇవి కాకుండా జూలై 17న తెలుగులో ఒక కోర్ట్ కేస్, రాజా ది రాజా.. తమిళంలో బ్లాక్ గోల్డ్, అరుల్‌వన్, అర్జునన్ పర్ పత్తు, అన్బె డియానా... హిందీలో రాహున్ మైనే తెరే రుబారు.. జూలై 16న మలయాళంలో వరావు విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications




