This Week Movie Releases: శ్రీనివాస మంగాపురం, సిగ్మా, 418.. ఇంకా ఈ వారం రిలీజయ్యే సినిమాలు ఇవే!

ప్రతివారం మాదిరిగానే ఈ వారం కూడా చిన్నా, పెద్దా సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి ముందుకొస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మూడో తరం వారసుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మరి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు హాలీవుడ్‌లోనూ చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వీక్ రిలీజయ్యే సినిమాలను పరిశీలిస్తే..

Also Read
Devara: దేవర వసూళ్లు ఫేకా? నిజమేంటో తేల్చేసిన ప్రముఖ నిర్మాత!
Devara: దేవర వసూళ్లు ఫేకా? నిజమేంటో తేల్చేసిన ప్రముఖ నిర్మాత!

శ్రీనివాస మంగాపురం
ఘట్టమనేని జయకృష్ణ, రషా తడానీ జంటగా నటించిన మూవీ శ్రీనివాస మంగాపురం. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై పీ కిరణ్ నిర్మించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, నరేశ్, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. జూలై 30న శ్రీనివాస మంగాపురం వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

This Week Movie Releases Srinivasa Mangapuram Sigma 418 and More Films Hitting Theatres

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే:
స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో భాగంగా నాలుగో మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే. ఈ సినిమాకు డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వం వహించారు. స్టాన్ లీ, స్టీవ్ డిటికో రచించిన స్పైడర్ మ్యాన్ పుస్తకం ఆదారంగా ఈ చిత్రాన్ని కెవిన్ ఫీజ్, ఆమీ పాస్కల్, అవి అరద్ నిర్మించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, జెండ్, సాదీ సింక్, జాకబ్ బాటాలాన్, జాన్ బెర్నథాల్ తదితరులు నటించారు. బ్రెట్ పావ్లాక్ సినిమాటోగ్రాఫర్‌గా, నాట్ సాండర్స్ ఎడిటర్‌గా, మైఖేల్ జియాచినో సంగీతం అందించారు. జూలై 30న స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recommended For You
టార్చర్ చేసి.. తెలుగులో నాపై అలా బ్యాన్.. పల్లవి గౌడ షాకింగ్ కామెంట్స్
టార్చర్ చేసి.. తెలుగులో నాపై అలా బ్యాన్.. పల్లవి గౌడ షాకింగ్ కామెంట్స్

సిగ్మా:
సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన మూవీ సిగ్మా. కోలీవుడ్ సూపర్‌స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తొలిసారిగా దర్శకత్వం వహించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజు సుందరమ్, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థసన్, జాగ్ జాపీ, మగాలక్ష్మీ, షీలా రాజ్‌కుమార్, కిరణ్ కొండా తదితరులు కీలకపాత్రలు పోషించారు. థమన్ సంగీత దర్శకత్వం వహించగా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. జూలై 31న తెలుగు, తమిళ భాషల్లో సిగ్మా విడుదల కానుంది.

You May Also Like
The India Story Movie Twitter Review: ది ఇండియా స్టోరీ మూవీ ట్విట్టర్ రివ్యూ
The India Story Movie Twitter Review: ది ఇండియా స్టోరీ మూవీ ట్విట్టర్ రివ్యూ

418:
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి తొలిసారిగా తీసిన హారర్ మూవీ 418. ప్రీతి పగడాల లీడ్ రోల్‌ పోషించగా.. చరణ్ లక్కరాజు, సూర్యరాజ్ కీలకపాత్రలు పోషించారు. కీర్తన్ నాడగౌడ దర్శకత్వం వహించారు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు అండగా నిలిచారు. ఆయన శిష్యుడే కీర్తన్. జూలై 31న 418 వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

నా తొలిప్రేమ ఆయనతోనే... లవ్‌స్టోరీని బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి
నా తొలిప్రేమ ఆయనతోనే... లవ్‌స్టోరీని బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి

భాయ్ తేరా స్టార్ హై
ది ప్యారడైజ్ ఫేయ్ రాఘవ్ జుయాల్, నిహారిక ఎన్ఎం జంటగా నటించిన మూవీ భాయ్ తేరా స్టార్ హై. ఈస్ట్‌వుడ్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ బీ అగర్వాల్, అవంతిక హరి, సునీల్ రుపానీలు ఈ సినిమాను నిర్మించారు. సంజయ్ కపూర్, బర్కా సింగ్, వికల్ప్ మెహతా, వివన్ భాతేనా, నిక్కీ అనేజా, టినా దేశాయ్, దేవ్ అగర్వాల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అమిత్ త్రివేది సంగీత దర్శకత్వం వహించగా.. త్రిభువన్ బాబు సాదినేని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. జూలై 30న భాయ్ తేరా స్టార్ హై సినిమా విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X