Salman Khan: సల్మాన్ ఖాన్‌కు ఏమైంది? కండాల వీరుడు కొత్త లుక్‌పై అభిమానుల్లో ఆందోళన..

Salman Khan: బాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. దాదాపు మూడు దశాబ్దాలుగా స్టార్ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నారు. కెరీర్‌ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో బ్లాక్‌బస్టర్లు, సూపర్‌హిట్లు అందుకున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా స్టార్‌డమ్‌కు నిర్వచనంగా మారిపోయారు. అంతేకాదు, సల్మాన్ ఖాన్ అంటే ఫిట్‌నెస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా భావిస్తారు. సిక్స్ ప్యాక్ బాడీ, యంగ్ లుక్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించారు. అలాంటి స్టార్ హీరో ఒక్కసారిగా పూర్తిగా భిన్నంగా కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇంతకీ ఏమన్నారంటే?

Also Read
72nd National Film Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే?
72nd National Film Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే?

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి స్టార్ హీరో వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సినిమాల వల్ల కాదు. ఆయన తాజా లుక్ వల్ల.. ఇటీవల ముంబైలోని స్లమ్ రీహాబిలిటేషన్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'డేటా కలెక్షన్ అండ్ వెరిఫికేషన్ సపోర్ట్ సెంటర్'ప్రారంభోత్సవానికి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ఐటీ సర్వర్ రూమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ లైట్ ఆలివ్ గ్రీన్ షర్ట్, తలపై క్యాప్‌తో కనిపించారు. ముఖంలో గతంలో కనిపించే మెరుపు తగ్గినట్టు అనిపించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

Recommended For You
Bigg Boss Telugu 10: నాగార్జునకు మరో జాక్‌పాట్? బిగ్ బాస్ 10 రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
Bigg Boss Telugu 10: నాగార్జునకు మరో జాక్‌పాట్? బిగ్ బాస్ 10 రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
Salman Khan s Unrecognisable New Look

అయితే.. సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ఫిట్‌గా, స్టైలిష్‌గా కనిపించే భాయ్‌జాన్ ఈసారి కాస్త నీరసంగా, వయసు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా గుర్తుపట్టని విధంగా కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.'ఇది నిజంగా సల్మాన్ ఖానేనా?'అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. కొందరు మొదటి చూపులో గుర్తుపట్టలేకపోయామని కూడా చెబుతున్నారు. కొందరు ఇది వయసు ప్రభావమని, మరికొందరు కొత్త సినిమా కోసం ప్రత్యేక మేకోవర్ అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు.

You May Also Like
ప్రతి రోజూ అలా ప్రార్థించేదాన్ని.. సీతమ్మ పాత్ర కోసం సాయి పల్లవి చేసిన పని ఇదే!
ప్రతి రోజూ అలా ప్రార్థించేదాన్ని.. సీతమ్మ పాత్ర కోసం సాయి పల్లవి చేసిన పని ఇదే!

ఇంకొందరు మాత్రం ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన కుటుంబం లేదా సన్నిహితులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కార్యక్రమం అనంతరం సల్మాన్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. తనదైన హాస్యంతో అందరినీ నవ్వించారు. "ఏ ప్రశ్న అయినా అడగండి. కానీ ఆ ఒక్క ప్రశ్న మాత్రం అడగొద్దు. దాని గురించి నేను ఏమీ చెప్పను" అంటూ సరదాగా మాట్లాడారు.

Lenin 9 Days BoxOffice: లెనిన్ బాక్సాఫీస్ స్టామినా ఇదే.. అఖిల్ అక్కినేని మూవీ ఎన్ని కోట్లంటే?
Lenin 9 Days BoxOffice: లెనిన్ బాక్సాఫీస్ స్టామినా ఇదే.. అఖిల్ అక్కినేని మూవీ ఎన్ని కోట్లంటే?

ఇక సల్మాన్ ఖాన్ కెరీర్ మాత్రం బిజీగా ఉంది. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న 'మాతృభూమి', టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీలింగ్వల్ సినిమా, అలాగే 'కిక్ 2'వంటి సినిమాలు వరుసలో ఉన్నాయి. ఈ సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్ ఖాన్ కొత్త లుక్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసినా, ఆయన సినిమాలపై ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమాలతో భాయ్‌జాన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతారనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తం చేస్తున్నారు.

Read more about: salman khan bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X