Lenin 9 Days BoxOffice: లెనిన్ బాక్సాఫీస్ స్టామినా ఇదే.. అఖిల్ అక్కినేని మూవీ ఎన్ని కోట్లంటే?
Lenin Collection: అక్కినేని అఖిల్ హీరోగా మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లెనిన్'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. ఫ్యామిలీ ఆడియన్స్, యువత నుంచి మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమా తొలి వారం స్ట్రాంగ్ కలెక్షన్లు అందుకుంది. ఇక రెండో వారంలోనే లాభాల బాటలో అడుగుపెట్టింది. ముఖ్యంగా అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక తొలి వారం వసూళ్లు సాధించిన సినిమా గా 'లెనిన్' నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో లెనిన్ సినిమా తొలివారం ఏ మేరకు వసూళ్లను సాధించింది. రెండో వీకెండ్ బాక్సాఫీస్ వద్ద పరిస్థితి ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
లవ్, ఎమోషన్, యాక్షన్, గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మించారు. సుమారు 55 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్, శాటిలైట్, ఇతర నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా మంచి ఆదాయాన్ని రాబట్టింది. దాంతో నిర్మాణ వ్యయంలో గణనీయమైన భాగం ముందుగానే రికవరీ అయిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. థియేట్రికల్‌గా ఈ సినిమాకు సుమారు 24 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఉండగా, తొలి వారంలోనే ఆ మార్క్‌ను దాటేసి అన్ని ఏరియాల్లో లాభాల్లోకి ప్రవేశించినట్లు సమాచారం.

రోజువారీ కలెక్షన్లలో ఇలా..
ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు 7.15 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు అందుకోగా.. , రెండో రోజు 8.85 కోట్ల రూపాయలు, మూడో రోజు 9.90 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వీకెండ్ తర్వాత సాధారణంగా వసూళ్లు తగ్గినా, నాలుగో రోజు 3. 60 కోట్ల రూపాయలు, ఐదో రోజు 3 కోట్ల రూపాయలు, ఆరో రోజు 2.15 కోట్ల రూపాయలు, ఏడో రోజు 2 కోట్ల రూపాయలు రాబట్టింది. దీంతో తొలి వారం ముగిసే సమయానికి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం 36.65 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది.
రెండో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత కొత్త సినిమాల విడుదల ప్రభావం కనిపించినప్పటికీ, ఎనిమిదో రోజు కూడా 1.65 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం 38.30 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు 53.50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో ఇండియా నుంచి 43. 94 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్ మార్కెట్ల నుంచి 9.56 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమానికి అత్యధిక స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఇప్పటివరకు 38.75 కోట్ల రూపాయల గ్రాస్ నమోదు కాగా, కర్ణాటకలో 4.15 కోట్ల రూపాయలు, తమిళనాడులో 46 లక్షల రూపాయలు వసూలు చేసింది. మరోవైపు.. ఈ సినిమా 6 రోజుల్లో 78 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసిందని అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.
9 రోజు అంచనా కలెక్షన్లు
ఇక రెండో శుక్రవారం కొత్త సినిమాల ప్రభావంతో వసూళ్లు కొంత తగ్గినప్పటికీ, శనివారం మళ్లీ కలెక్షన్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన, పాజిటివ్ టాక్ కారణంగా రెండో వీకెండ్‌లో మంచి వసూళ్లు నమోదు కావచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
శనివారం నాడు క్రమంగా ఆక్యూపెన్సీ 4 కోట్ల రూపాయాలు నుంచి 4.5 కోట్ల రూపాయాల కలెక్షన్లు వసూలు చేసే అవకాశమున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే.. నేడు ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్‌ను అందుకునే అవకాశముందని భావిస్తున్నారు. అదే జోరు కొనసాగితే, ఈ వీకెండ్ కలెక్షన్లు వరకు పెరిగే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications





