Jana Nayagan Hindi Box Office: హిందీలో జన నాయగన్ ఊపు.. దళపతి విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ సూపర్‌స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన చివరి మూవీ జన నాయగన్. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మించారు. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. మమితా బైజు, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జూలై 23న జన నాయగన్ వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో హిందీలో జన నాయగన్ వసూళ్లు ఎంత? ఇప్పటి వరకు ఎంత వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..
జన నాయగన్ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి జన నాయగన్ మూవీని 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. విజయ్ క్రేజ్, ఈ సినిమా చుట్టూ చెలరేగిన వివాదాల కారణంగా జన నాయగన్ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. థియేట్రికల్ రైట్స్ పరంగా వరల్డ్ వైడ్‌గా 240 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని చెబుతున్నారు. దాంతో దళపతి విజయ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 245 కోట్ల రూపాయల షేర్.. 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

జన నాయగన్ కలెక్షన్స్
జన నాయగన్ మూవీకి తొలిరోజున ఇండియాలో 42.70 కోట్ల రూపాయలు, రెండో రోజున 21.15 కోట్ల రూపాయలు, మూడో రోజున 28.50 కోట్ల రూపాయలు చొప్పున 92.35 కోట్ల రూపాయల నెట్.. 109.14 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. తమిళనాడులో 61 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 19.22 కోట్ల రూపాయలు, కేరళలో 10 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 8.34 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 9.78 కోట్ల రూపాయలు చొప్పున వసూళ్లు రాబట్టింది జన నాయగన్.
జన నాయగన్ టికెట్ల అమ్మకాలు
టికెట్ల అమ్మకాల విషయంలోనూ జన నాయగన్ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. బుక్ మై షోలో 2.8 మిలియన్లు, డిస్ట్రిక్ట్ యాప్‌లో 2.7 మిలియన్లు చొప్పున మూడు రోజుల్లో 5.5 మిలియన్ల టికెట్లు సేల్ అయినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. విజయ్ క్రేజ్ దృష్ట్యా వీకెండ్ ముగిసేనాటికి ఈ సినిమా మరిన్ని బెంచ్ మార్కులు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.
జన నాయగన్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే... నార్త్ అమెరికాలో శనివారం జన నాయగన్ మూవీ 356 లోకేషన్స్‌లో 245K డాలర్లు (2.36 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, యూకే, సింగపూర్, మలేషియా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో కలిపి ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు జన నాయగన్‌కు 63.50 కోట్ల రూపాయలు వసూలైంది. భారత్‌లో కలెక్షన్స్‌తో కలిపి జన నాయగన్ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 172 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది.
జన నాయగన్ హిందీ కలెక్షన్స్
ఇక జన నాయగన్‌ను హిందీలో జననేతగా విడుదల చేశారు. అయితే ఈ సినిమా అంచనాలకు మించి రాణిస్తోంది. జననేతను జీ స్టూడియెస్ సంస్థ ఉత్తర భారతదేశంలో విడుదల చేసింది. విజయ్ మూవీకి తొలిరోజున 3.5 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 4 కోట్ల రూపాయలు చొప్పున 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ట్రేడ్ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కథ, కమర్షియల్ ఎలిమెంట్స్, విజయ్ క్రేజ్ కారణంగా హిందీ ప్రేక్షకులు జననేతను ఆదరిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆదివారం జననేతకు మరింత మెరుగైన వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు.
జననేత హిందీ థియేట్రికల్ రైట్స్ 4.5 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. దాంతో ఇక్కడ బ్రేక్ఈవెన్ కావాలంటే 5 కోట్ల రూపాయల షేర్.. 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్‌తో జననేత సేఫ్ జోన్‌లోకి వచ్చేశాడు. ఇకపై వచ్చేదంతా డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభమే. ఇకపోతే.. దళపతి విజయ్ చివరి చిత్రం ది గోట్ హిందీలో 20 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మరి జననేత ఆ వసూళ్లను అధిగమిస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications



