Jana Nayagan Karnataka Box Office: కర్ణాటకలో జన నాయగన్ మేనియా.. అడ్వాన్స్ బుకింగ్‌లో ఎన్ని కోట్లంటే?
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్ నటించిన సినిమా జన నాయగన్. హెచ్ వినోద్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు. జన నాయగన్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు కీలకపాత్రలు పోషిచారు. ఈ సినిమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా.. ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్‌గా సేవలందించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకత్వం వహించారు.
షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన జన నాయగన్ అనివార్య కారణాలు, సెన్సార్ సమస్యలు, కోర్టు కేసులతో 7 నెలలు ఆలస్యంగా జూలై 23న వరల్డ్ వైడ్‌గా విడుదల అవుతోంది. విజయ్ చివరి సినిమా కావడంతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తునన తొలి మూవీ కావడంతో జన నాయగన్‌పై తమిళనాడుతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. దీనికి తగినట్లుగానే రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపుతోంది జన నాయగన్. ముఖ్యంగా కర్ణాటకలో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో ప్రీ సేల్స్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

జన నాయగన్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి జన నాయగన్ మూవీని 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించారు. విజయ్ క్రేజ్ కారణంగా జన నాగయన్‌కు రిలీజ్‌కు ముందే రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తమిళనాడు, కేరళ థియేట్రికల్ రైట్స్ 120 కోట్ల రూపాయలు, ఆంధ్రా తెలంగాణ థియేట్రికల్ రైట్స్ 14 కోట్ల రూపాయలు, కర్ణాటక రైట్స్ 20 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 80 కోట్ల రూపాయల చొప్పున దాదాపు 240 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 245 కోట్ల రూపాయల షేర్.. 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
జన నాయగన్‌కు బ్రహ్మరథం
విజయ్ సినిమాలకు తమిళనాడుతో పాటు కర్ణాటకలోనూ అదే స్థాయిలో మార్కెట్ ఉంది. తమిళ సరిహాద్దు జిల్లాలతో పాటు బెంగళూరు, మైసూరు తదితర నగరాలలో తమిళుల ప్రాబల్యం కారణంగా విజయ్ సినిమాలు గతంలో రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేశాయి. తాజాగా జన నాయగన్ కోసం కూడా అక్కడి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఒక్క బెంగళూరు నగరంలోనే తొలి రోజున ఈ సినిమాకు 1000కి పైగా షోలను ఏర్పాటు చేశారని అంచనా. బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు.
జన నాయగన్ కర్ణాటక అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్
ఇప్పటి వరకు అందుతున్న సమచారాన్ని బట్టి తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్‌లో కర్ణాటక వ్యాప్తంగా 1519 షోలకు గాను 1.69 లక్షల టికెట్లు అమ్ముడైనట్లుగా వార్తలు వస్తున్నాయి. తద్వారా తొలిరోజున జన నాయగన్ కర్ణాటక వ్యాప్తంగా 8.18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఫైనల్ లెక్కల తర్వాత ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది విజయ్ స్టార్ పవర్‌కు నిదర్శనంగా అభిమానులు చెబుతున్నారు.
ఇండియాలో జన నాయగన్ ప్రీ సేల్స్ కలెక్షన్స్
జన నాయగన్‌కు తొలిరోజు ఏర్పాటు చేసిన మార్నింగ్ షోలలో వరల్డ్ వైడ్‌గా 70 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా చెబుతున్నారు. చెన్నైలో అయితే ఇది 100 శాతంగా ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమచారం ప్రకారం అడ్వాన్స్ బుకింగ్ పరంగా తమిళనాడులో 16.14 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 8.18 కోట్ల రూపాయలు, కేరళలో 3.44 కోట్ల రూపాయలు, తెలంగాణలో 1.24 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 1.10 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 1.88 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 32 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
భారీ ఓపెనింగ్స్‌పై జన నాయగన్ కన్ను
ఇక అమెరికాలో జన నాయగన్‌కు 356 సెంటర్స్‌లో 719 షోలు ఏర్పాటు చేయగా 15458 టికెట్లు అమ్ముడై 2,80,693 డాలర్లు (2.71 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. అయితే నార్త్ అమెరికా వ్యాప్తంగా ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్‌లో 455K డాలర్లు (4.39 కోట్ల రూపాయలు) రాబట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రీమియర్స్+ డే 1 కలెక్షన్స్ కలిపి ఈ మొత్తం 700K డాలర్లు (6.76 కోట్ల రూపాయలు) రాబట్ట వచ్చని అంచనా వేస్తున్నారు. యూరప్, యూకే, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో కలిపి జన నాయగన్ కేవలం అడ్వాన్స్ బుకింగ్‌లోనే 2.7 మిలియన్ డాలర్లు (26 కోట్ల రూపాయలు) వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో జన నాయగన్ కేవలం అడ్వాన్స్ బుకింగ్‌లోనే వరల్డ్ వైడ్‌గా 58 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజున దళపతి విజయ్ మూవీ వరల్డ్ వైడ్‌గా 100 కోట్ల రూపాయల నుంచి 120 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications




