Kattalan Closing Collections: కాటాలన్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఆంటోనీ వర్గీస్ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?
మలయాళ స్టార్ హీరో ఆంటోనీ వర్గీస్ నటించిన తాజా మూవీ కాటాలన్. పౌల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 28వ తేదీన వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో హైప్ తెచ్చుకుంది కాటాలన్. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మొహమ్మద్ ఈ కాటాలన్ సినిమాను నిర్మించారు. ఆంటోనీ సరసన దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించారు. సిద్ధిఖీ, జగదీష్, కబీర్ దుహన్ సింగ్, సునీల్, అన్సోన్ పాల్, పార్ధ్ తివారీ, హరీశంకర్ నారాయణన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రెనదివ్, చంద్రు సెల్వరాజ్, సుదీప్ ఎల్మాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. అజనీష్ లోకనాథ్, రవి బస్రూర్ సంగీతం అందించారు. సమీర్ మొహమ్మద్ ఎడిటర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? కాటాలన్ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? ఈ సినిమాకు లాభమెంత? నష్టమెంత? ఈ వివరాల్లోకి వెళితే..
కాటాలన్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి కాటాలన్ సినిమాకు 45 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా కోసం థాయ్‌లాండ్, వెగమాన్‌లలో చిత్రీకరణ జరిపారు. టెక్నికల్ స్టాండర్డ్స్ ఎక్కడా తగ్గకుండా నిర్మాతలు ఖర్చు పెట్టారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కాటాలన్‌పై హైప్ నెలకొంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 100 కోట్ల రూపాయలు వసూలు చేయాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

కాటాలన్ కలెక్షన్స్
ఈ సినిమాకు తొలిరోజున ఇండియాలో 3.80 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.60 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.40 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 93 లక్షల రూపాయలు, ఐదో రోజున 31 లక్షల రూపాయలు, ఆరో రోజున 23 లక్షల రూపాయలు, ఏడో రోజున 22 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజున లక్ష రూపాయలు, తొమ్మిదో రోజున 2 లక్షల రూపాయలు చొప్పున ఇండియాలో ఇప్పటి వరకు 8.52 కోట్ల రూపాయల నెట్.. 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కేరళలో 5.37 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 1.20 కోట్ల రూపాయలు, తమిళనాడులో 32 లక్షల రూపాయలు, కర్ణాటకలో 51 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 1.50 కోట్ల రూపాయలు రాబట్టింది ఈ మూవీ.
కాటాలన్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఓవర్సీస్‌లో కాటాలన్ మూవీని పార్స్ ఫిలింస్ విడుదల చేసింది. తొలిరోజున అమెరికా సంయుక్త రాష్ట్రాలు, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, సింగపూర్, థాయ్‌లాండ్ తదితర దేశాలలో కలిపి ఏకంగా 5.11 కోట్ల రూపాయలు వసూలు చేసింది కాటాలన్. అయితే ఆ తర్వాతి నుంచి కలెక్షన్స్ కోల్పోతూ వచ్చింది ఈ చిత్రం. ఇప్పటి వరకు ఆంటోనీ వర్గీస్ మూవీకి ఓవర్సీస్‌లో 7.30 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి కాటాలన్‌కు వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 17.32 కోట్ల రూపాయలు రాబట్టింది.
కాటాలన్ లాభమెంత? నష్టమెంత?
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కాటాలన్‌కు తొలిరోజున భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ ఆ జోష్‌ను కొనసాగించలేకపోయింది. రెండో రోజు నుంచే ఆంటోనీ వర్గీస్ మూవీకి వసూళ్లు పడిపోయాయి. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన కాటాలన్ కేవలం కేరళలో మాత్రమే చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. తొలివారంలో దృశ్యం 3, కరుప్పు సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవ్వగా.. ఈ వారం పెద్ది వంటి పాన్ ఇండియా సినిమా రాకతో పూర్తిగా చేతులెత్తేశాడు ఆంటోనీ.
ఈ సినిమాను 50 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించగా.. కేవలం 32 శాతం మాత్రమే రికవరీ సాధించింది కాటాలన్. దాంతో బడ్జెట్ పరంగా దాదాపు 32 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చి డిజాస్టర్‌గా నిలిచింది ఈ చిత్రం. ఇప్పట్లో ఈ సినిమా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే వారం మరికొన్ని క్రేజీ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉండటంతో కాటాలన్ థియేట్రికల్ రన్ ముగిసినట్లే. అయితే ఓటీటీ రైట్స్, ఆడియో, శాటిలైట్ రైట్స్ ద్వారా నిర్మాత కొంతమేర సేఫ్ జోన్‌లోకి వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications



