MIB Day 10 Collections: వీకెండ్‌లో దుమ్మురేపుతోన్న మా ఇంటి బంగారం.. సమంత మూవీకి ఎన్ని కోట్లంటే?
Maa Inti Bangaaram Box Office Collections: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో వారంలోనూ అదే జోరును కొనసాగిస్తోంది. ముఖ్యంగా వీకెండ్‌లో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా కలెక్షన్లు మళ్లీ ఊపందుకున్నాయి. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, సమంత కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాగా కొత్త రికార్డు నెలకొల్పిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో 10వ రోజుల్లో మా ఇంటి బంగారం'ఎన్ని కోట్లు రాబట్టింది? సమంత హవా ఎలా ఉంది? ఈ వివరాలు పరిశీలిస్తే..
9వ రోజు భారీ వసూళ్లు
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. తొమ్మిదో రోజు 'మా ఇంటి బంగారం' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.4.90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది ఎనిమిదో రోజు కలెక్షన్లతో పోలిస్తే దాదాపు 12.6 శాతం పెరుగుదల నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ.49.72 కోట్లకు చేరుకున్నాయి. రెండో వారంలో కూడా ఈ రేంజ్ లో ఇలాంటి కలెక్షన్లు అందుకోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. తొమ్మిదో రోజు థియేటర్లలో సినిమా ఆక్యుపెన్సీ కూడా భారీ స్థాయిలో నమోదైంది. సగటున 42.94 శాతం ఆక్యుపెన్సీ రావడం ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న క్రేజ్ ఏంటో తెలుపుతోంది.

ఇక ఇండియన్ బాక్సాఫీస్‌తో పాటు ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటివరకు విదేశీ మార్కెట్లలో రూ.21.85 కోట్ల గ్రాస్ సాధించగా, భారత్‌లో రూ.49.72 కోట్ల గ్రాస్ తో కలిపి ప్రపంచవ్యాప్తంగా సినిమా రూ.71.57 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సమంత కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియంట్ మూవీగా మా ఇంటి బంగారం నిలిచింది. ఇదిలా ఉంటే.. మా ఇంటి బంగారం ప్రపంచ వ్యాప్తంగా రూ.73 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.
10వ రోజు అంచనాలు ఎలా ఉన్నాయి?
సమంత 'మా ఇంటి బంగారం' మూవీకి బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా భారీ వసూళ్లు అందుకుంటుంది. ఇక ఆదివారం సెలవు కావడంతో పదో రోజు సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం..ఈ సినిమా సుమారు 710 షోలలో రన్ అవుతోంది. మధ్యాహ్నం వరకు రూ.1.85 కోట్ల నెట్ వసూలు చేసింది. సాయంత్రం, రాత్రి షోల పూర్తి కలెక్షన్లు చేరిన తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ ట్రెండ్ బట్టి చూస్తే.. పదో రోజు ఈ సినిమా రూ.4 నుంచి రూ.5 కోట్ల మధ్య గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో మొత్తం ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ. 53 కోట్ల గ్రాస్ చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 80 కోట్ల గ్రాస్ మార్క్ దాటే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి, లాభాల బాట పట్టిన మా బంగారం మూవీ రాబోయే రోజుల్లో మరిన్ని కలెక్షన్లు అందుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications



